ఆ హీరో భార్య అమ్మాయిలను సప్లై చేస్తుంది, కేకలు వేస్తున్నా వదలడు.. ‘మా’ ఎన్నికల వేళ శ్రీరెడ్డి బాంబ్!
'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'(మా) ఎన్నికలు పొలిటికల్ ఎన్నికల కంటే రసవత్తరంగా తయారయ్యాయి. ఇటు శివాజీ రాజా ప్యానల్, అటు నరేష్ ప్యానల్ ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల వేళ వివాదాస్పద నటి శ్రీరెడ్డి రంగంలోకి దిగడం చర్చనీయాంశం అయింది.
కాస్టింగ్ కౌచ్ ఇష్యూపై ఫైట్ చేసిన సమయంలో 'మా' అధ్యక్షుడి హోదాలో ఉన్న శివాజీ రాజాతో విబేధించి, తమకు న్యాయం చేయడం లేదని అప్పట్లో ఫైర్ అయిన శ్రీరెడ్డి... ఇపుడు అతడినే 'మా' ప్రెసిడెంట్ చేయాలని ప్రచారం చేస్తుండటం గమనార్హం. తాజాగా ఓ వీడియో విడుదల చేసిన శ్రీరెడ్డి నరేష్ ప్యానల్‌లోని కొందరు వ్యక్తుల మీద సంచలన ఆరోపణలు చేశారు.

‘మా’ ఎన్నికలపై శ్రీరెడ్డి ప్రభావం ఉంటుందా?
నరేష్ గారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉన్నప్పటికీ తన ప్యానల్‌లో ఎంచుకున్న మనుషులు సరైన వారుకాదు. ఆయన శివాజీ రాజా ప్యానల్ మీద ఏదో ఆరోపణలు చేస్తున్నారు. కానీ తగిన ఆధారాలతో క్లారిటీ ఇవ్వడం లేదని శ్రీరెడ్డి తెలిపారు.

మీకు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి
నరేష్ గురించి తన సోషల్ మీడియా పేజీలో వ్యాఖ్యానిస్తూ.. వందల కోట్ల ఆస్తులు, పెద్ద పెద్ద ఖరీదైన కార్లు, బంగ్లాలు ఉన్న మీరు ఇప్పటి వరకు ‘మా' అసోసియేషన్లో ఓ పోస్ట్ వెలగబెట్టారు. కానీ ఎవరికీ సహాయం చేయలేదు. మీకు పదవి కావాలి.. సేవ సున్నా అంటూ విమర్శించారు.

ఒకప్పుడు శివాజీ రాజాను విమర్శించా.. కానీ
ఒకప్పుడు శివాజీ రాజా మీద నేను అలిగిన మాట నిజమే. ఎందుకంటే.. ‘మా' అసోసియేషన్ ముందు ధర్నా చేసినపుడు నాకు సపోర్ట్ చేయలేదని, వ్యతిరేకంగా మాట్లాడారని కోపం ఉండేది. కానీ ఇపుడు ‘మా'ను తీసుకెళ్లి అర్హత లేని వ్యక్తుల చేతుల్లో పెట్టే ప్రయత్నం జరుగుతుంటే మంచి వ్యక్తిని మంచి వ్యక్తి అనడానికి నాకు అహంకారం ఎందుకు అడ్డురావాలి? శివాజీ రాజా ప్యానల్ ఈ ఎన్నికల్లో దిగ్విజయంగా గెలుపొందాలని కోరుకుంటున్నట్లు శ్రీరెడ్డి తెలిపారు.
ఆ హీరో భార్య దగ్గర ఉండి పంపిస్తుంది: సంచలన విషయాలు వెల్లడించిన శ్రీరెడ్డి
శివాజీ రాజాకు సపోర్ట్ చేయడంతో పాటు ఈ వీడియోలో ‘ఆ హీరో భార్య దగ్గర ఉండి పంపిస్తుంది' అంటూ ఓ సంచలన విషయం బయట పెట్టింది శ్రీరెడ్డి. మరి శ్రీరెడ్డి ఏం చెప్పంది, ఎవరి గురించి చెప్పంది అనేది ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.


Click it and Unblock the Notifications











