శ్రీరెడ్డి మరో సంచలనం.. కోనవెంకట్ పేరు బయటకు, స్మశానం వెనుక నీచంగా.. మరో ఇద్దరి పేర్లు త్వరలో!
Recommended Video

నటి శ్రీరెడ్డి టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తనని అవకాశాల పేరుతో వాడుకున్నారని శ్రీరెడ్డి సినీప్రముఖులు పేర్లు బయటకు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో టాలీవుడ్ లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇప్పటికే శ్రీరెడ్డి ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్ గురించి సంచలన విషయాలు బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి చేస్తున్న పోరాటానికి క్రమంగా మద్దత్తు పెరుగుతోంది. టాలీవుడ్ మొత్తం ప్రస్తుతం శ్రీరెడ్డి గురించే చర్చ జరుగుతోంది.తాజాగా జరిగిన ఓ టివి ఛానల్ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి మరో బడా సినీప్రముఖుడి పేరు బయట పెట్టి సంచలనం సృష్టించింది.

టాలీవుడ్ లో శ్రీరెడ్డి ప్రకంపనలు
టాలీవుడ్ లో శ్రీరెడ్డి ప్రకంపనలు రేపుతోంది. కాస్టింగ్ కౌచ్ విషయంలో శ్రీరెడ్డి వెల్లడిస్తున్న అంశాలు విస్మయానికి గురిచేసే విధంగా ఉన్నాయి. అవకాశాల పేరుతో తనని ఎలా వాడుకున్నారు.. సినీఇండిస్ట్రిలో రాణించాలని వస్తున్న యువతుల బతుకులు ఎలా నాశనం అవుతున్నాయి అనే విషయాలని శ్రీరెడ్డి బయట పెడుతోంది.

అభిరామ్ పేరు బయట పెట్టి సంచలనం
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్ పేరు బయట పెట్టి శ్రీరెడ్డి సంచలనం సృష్టించింది. అతడితో సన్నిహితంగా ఉంటున్న ఫోటోలని సైతం శ్రీరెడ్డి మీడియాకు విడుదల చేసింది.

అయినా మారలేదు
తాను ఫిలిం ఛాంబర్ ఎదుట అర్థ నగ్న ప్రదర్శన చేసే వరకు కూడా ఎవరి పేర్లు బయటకు చెప్పలేదని శ్రీరెడ్డి తెలిపింది. వారు ఏమైనా మారుతారేమో అని భావించానని, అయినా కూడా మారలేదని అందుకే పేర్లు బయటపెట్టానని శ్రీరెడ్డి తెలిపింది.

అవకాశం ఇస్తానని చెప్పాడు
అవకాశం ఇస్తానని మభ్య పెట్టడం వలనే తాను అభిరామ్ తో సన్నిహితంగా మెలిగానని శ్రీరెడ్డి తెలిపింది. లేకపోతే అతడి మొహం ఎవరు చూస్తారని శ్రీరెడ్డి ప్రశ్నించింది.

అతడిని క్షమించను
అభిరామ్ అన్న మాటలకు అతడిని క్షమించే ఉద్దేశం లేదని, కాళ్ళమీద పది బ్రతిమలాడినా క్షమించమని శ్రీరెడ్డి తెలిపింది. తనని తీసుకుని వెళ్లి రామానాయుడు స్టూడియోలో నీచమైన పనులు చేయించాడని శ్రీరెడ్డి ఆరోపించింది.

బలవంతపు సెక్స్
అతడితో ఉన్న ఫొటోల్లో తాను నవ్వుతూ ఉన్నానని ఆరోపిస్తున్నారని శ్రీరెడ్డి తెలిపింది. అతడి వాడుకునే సమయంలో కెమెరాలు పెట్టలేం కదా అని శ్రీరెడ్డి ప్రశ్నించింది. అతడి చేసింది బలవంతపు సెక్స్ అని శ్రీరెడ్డి ఘాటుగా ఆరోపిస్తోంది.

మరో సంచలనం.. కోన వెంకట్ పేరు బయటకు
అభిరామ్ పేరు బయట పెట్టి సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి మరో మారు న్యూస్ ఛానల్ వేదికగా ప్రకంపనలు రేపింది. స్టార్ రైటర్ కోన వేన వెంకట్ కూడా తనపై బలవంతగా లైంగిక దాడికి పాల్పడ్డారని శ్రీరెడ్డి సంచలన ఆరోపణ చేసింది.

స్మశానం వెనుక నీచంగా
హైదరాబాద్ లో స్మశానం వెనుక ఉన్న గెస్ట్ హౌస్ కు పిలిచాడు. అక్కడకు వివి వినాయక్ వస్తాడని, పరిచయం చేస్తానని నమ్మించి పిలిచాడు. మందు తాగుతావా అని అడిగాడు.. నాకు అలవాటు లేదు అని తాను చెప్పినట్లు శ్రీరెడ్డి తెలిపింది. ఆ తరువాత లైంగికంగా తనని బలవంతం చేసినట్లు శ్రీరెడ్డి ఆరోపించింది.

బెదిరింపు కాల్స్
కోనవెంకట్ కి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని శ్రీరెడ్డి తెలిపింది. పోలీస్ లు లాగితే అతడి చేసిన బెదిరింపు కాల్స్ బయట పడుతాయని శ్రీరెడ్డి తెలిపింది.

మరో ఇద్దరి పేర్లు బయటకు
త్వరలోనే తాను మరో ఇద్దరి పేర్లు బయట పెడుతా అని శ్రీరెడ్డి షాక్ ఇచ్చింది. శ్రీరెడ్డి వలన ఇంకెంత మంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయో అని సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది.
పోలీస్ దర్యాప్తుకు కోన వెంకట్ డిమాండ్
శ్రీరెడ్డి తనపై చేసిన ఆరోపణలపై కోనవెంకట్ స్పందించారు. ఓ నటి తనతో పాటు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేస్తోంది. దీనిపై పోలీస్ లు దర్యాప్తు జరిపి నిజా నిజాలు నిగ్గు తేల్చాలని కోన వెంకట్ డిమాండ్ చేసారు.
చీప్ పబ్లిసిటీ
చాలా మందికి సినీ ఇండస్ట్రీ, సినీ ప్రముఖులు టార్గెట్ గా మారుతున్నారని కోనవెంకట్ ఆరోపించారు. వారంతా చీప్ పబ్లిసిటి కోసమే ఇదంతా చేస్తున్నారని కోన వెంకట్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తెలుగు నటులు తెలుగు చిత్రాల్లో ఉండాలనే వాదనతో తాను ఏకీభవిస్తానని కోనవెంకట్ అన్నారు. తన గీతాంజలి చిత్రంలో కూడా ఎక్కువగా తెలుగు నటులే ఉన్నారని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications











