For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Prabhu Devaపై విరుచుకుపడ్డ శ్రీరెడ్డి.. సల్మాన్ ఖాన్ కెరీర్‌ను నాశనం చేయడానికేనా? అంటూ కామెంట్లు..

    |

    బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ చిత్రం రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా తొలి ఆట నుంచి మిక్స్‌డ్ రివ్యూలు వెలువడుతున్నాయి. ఓవర్సీస్‌లో థియేట్రికల్ రిలీజ్ కాగా, ఇండియాలో ఓటీటీ ద్వారా విడుదలైంది. ఈ సందర్భంగా వివాదాస్పద నటి శ్రీరెడ్డి తన ట్విట్టర్ అకౌంట్‌లో దారుణంగా కామెంట్ చేశారు. ఆమె చేసిన కామెంట్లు ఏమిటంటే..

    తమిళ సినీ ప్రముఖులపై శ్రీరెడ్డి

    తమిళ సినీ ప్రముఖులపై శ్రీరెడ్డి

    సాధారణంగా శ్రీరెడ్డి మెగా హీరోల సినిమాలపైనే ప్రతికూలంగా కామెంట్లు చేస్తుంటారు. అంతేకాకుండా తమిళంలో సెలెక్టివ్‌గా కొందరిపై మాటల తూటాలు విసురుతుంటారు. గతంలో విశాల్, ఇతర సినీ ప్రముఖుల సినిమాలపై ఘాటుగా స్పందించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా రాధే సినిమా దర్శకుడు ప్రభుదేవాపై విరుచుకుపడ్డారు.

     రాధే సినిమా గురించి వన్ లైన్ రివ్యూ అంటూ

    రాధే సినిమా గురించి వన్ లైన్ రివ్యూ అంటూ

    రాధే సినిమా గురించి వన్‌ లైన్ రివ్యూ అంటూ సినిమాను శ్రీరెడ్డి సమీక్షించారు. సినిమా నిర్మాణ చరిత్రలోనే ఇప్పటి వరకు రానటువంటి అతి చెత్త చిత్రం రాధే. సల్మాన్ ఖాన్ గొప్ప నటుడు. అందులో ఎలాంటి సందేహం లేదు అని బాలీవుడ్ కండలవీరుడికి కితాబు ఇచ్చారు.

    ప్రభుదేవా చెత్త డైరెక్షన్

    ప్రభుదేవా చెత్త డైరెక్షన్

    అయితే రాధే సినిమా దారుణంగా ఉండటానికి కారణం దర్శకుడు ప్రభుదేవా. చెత్త స్టోరీ, దారుణంగా డైరెక్షన్ అంటూ శ్రీరెడ్డి కామెంట్ చేసింది. రాధే చిత్రం ఓ డస్ట్ బీన్‌ లాంటి చిత్రం... ఛీ ఛీ అంటూ ప్రభుదేవాపై విరుచుకుపడ్డారు. దాంతో ఆమె రివ్యూకు నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు.

     శ్రీరెడ్డి రివ్యూపై నెటిజన్ల కామెంట్లు

    శ్రీరెడ్డి రివ్యూపై నెటిజన్ల కామెంట్లు

    రాధే సినిమాపై శ్రీరెడ్డి తన రివ్యూ పోస్టు చేసిన తర్వాత నెటిజన్లు ఘాటుగా స్పందించారు. నీవు చెప్పిన తర్వాత ఇక సినిమా చూడను డియర్. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అని ఒకరు.. ఈ సినిమాకు రాధే కంటే గధే అని టైటిల్ పెట్టాలి, మరీ అంత ఘోరంగా ఉందా అక్కాయ్, నీవు ఎలా జస్టిఫికేషన్ చేస్తావు అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

    Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
    ట్విట్టర్లో భారీగా ప్రభుదేవాపై ట్రోలింగ్

    ట్విట్టర్లో భారీగా ప్రభుదేవాపై ట్రోలింగ్

    ఇదిలా ఉండగా, రాధే రిలీజ్ తర్వాత ప్రభుదేవాపై నెటిజన్ల కూడా భారీ స్థాయిలో మండిపడుతున్నారు. వాంటెడ్ లాంటి నాసిరకంగా సినిమా తీసిన ప్రభుదేవా మళ్లీ రాధే లాంటి మూవీ తీసి వెన్నుపోటు పొడిచారనే విధంగా కామెంట్ చేశారు. డైరెక్షన్ విషయంలో ప్రభుదేవా దారుణంగా విఫలమైంది. సల్మాన్ ఖాన్ కెరీర్ నాశనం చేయడానికే ప్రభుదేవా రాధే తీశాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. దాంతో ప్రభుదేవా ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారారు.

    English summary
    Actress Sri reddy Review About Radhe Movie: Radhe One Line Review Face with rolling eyes One of the Worst Movie Ever in the history of film making Folded hands Salman Bhai Great Actor But #PrabhuDeva Spoiled Movie, Worst Story, Worst Direction, Its just Dustbin Chi chi
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X