అందుకే లైంగికంగా లొంగిపోయా.. కారణం అదే.. మాజీ సీఎం మనవడి ఇష్యూపై సెన్సేషన్.. శ్రీ రెడ్డి ప్రెస్ మీట్

కాస్టింగ్ కౌచ్ పేరిట సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు పరిష్కారం చేపట్టాలని ఉద్యమించిన శ్రీ రెడ్డి.. మెల్లగా తన ఉద్యమాన్ని దారి మళ్లించి సోషల్ మీడియాలో వీరవిహారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫేస్‌బుక్ వేదికగా చేసుకొని పలువురు సినీ ప్రముఖుల బండారం బయటపెడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కాగా తాజాగా మీడియా ముందుకొచ్చిన శ్రీ రెడ్డి తానే లైంగికంగా తలవంచానని నిర్మొహమాటంగా చెప్పి మరో షాకిచ్చింది. పూర్తి వివరాల్లోకి పోతే..

అందుకే లైంగికంగా లొంగిపోయా.. తప్పలేదు

అందుకే లైంగికంగా లొంగిపోయా.. తప్పలేదు

సినిమా అవకాశం ఇస్తానని ఆశ చూపెట్టారు కాబట్టే లైంగికంగా లొంగిపోయానని శ్రీ రెడ్డి చెప్పుకొచ్చింది. మేజర్ అయిన యువతీ యువకులు తమ తమ ఇష్టప్రకారం సెక్స్ చేసుకోవచ్చని సుప్రీం కోర్టే తీర్పు ఇచ్చిందని గుర్తుచేసింది శ్రీ రెడ్డి. అయితే అవకాశం ఇస్తానని చెప్పి మోసం చేశారు కాబట్టే తాను కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తున్నానని పేర్కొంది.

ప్రత్యేకంగా వ్యక్తులను గురి.. చర్చనీయాంశం

ప్రత్యేకంగా వ్యక్తులను గురి.. చర్చనీయాంశం

ఫేస్‌బుక్ వేదికగా హద్దులు దాటి కామెంట్లు చేస్తున్న శ్రీ రెడ్డి సినీ, రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తులను ఎంచుకొని మరీ టార్గెట్ చేస్తోంది. గతంలో తేజ, ఇలియానా, బోయపాటి శ్రీను లాంటి బడా సినీ ప్రముఖల పేర్లు వాడేసిన ఈమె.. తాజాగా మాజీ సీఎం మనవడు ఉదయానిధిపై సంచనల కామెంట్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

అతనితో హోటల్లో ఆ రాత్రి..

అతనితో హోటల్లో ఆ రాత్రి..

ఉదయనిధి స్టాలిన్‌ను టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి.. ఈ మాజీ సీఎం మనవడి గురించి సోషల్ మీడియాలో ఓ మెసేజ్ పోస్ట్ చేసింది. హాయ్ ఉదయనిధి స్టాలిన్ అంటూ మొదలు పెట్టిన శ్రీ రెడ్డి అంతా ఓపెన్ చేసేసింది. 3 సంవత్సరాల క్రితం జరిగిన ఓ సినిమా షూటింగ్‌లో విశాల్ ద్వారా స్టాలిన్‌ను కలిసానని, అతనితో హోటల్లో ఆ రాత్రి చాలానే చేశానని, అతను లైంగికంగా వాడేసుకున్నాడని కామెంట్ చేసింది.

 మీడియా ముందు శ్రీ రెడ్డి.. ఏమందో తెలిస్తే షాక్

మీడియా ముందు శ్రీ రెడ్డి.. ఏమందో తెలిస్తే షాక్

దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఈ పరిస్థితుల నడుమ తమిళనాడు మీడియాతో ప్రెస్ మీట్ పెట్టిన శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్ చేసి మరో షాకిచ్చింది. ఉదయనిధి స్టాలిన్‌ పై చేసిన కామెంట్ తన ఫేక్ అకౌంట్ నుంచి వచ్చిందని, ఆ మెసేజ్‌కి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసింది.

ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఇలా..

ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఇలా..

తన పేరిట సోషల్ మీడియాలో వందల కొద్ది ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పిన శ్రీ రెడ్డి.. ఇటీవలే ఉదయనిధి స్టాలిన్‌ను టార్గెట్ చేస్తూ వచ్చిన మెసేజ్‌తో తనకెలాంటి సంబంధం స్పష్టం చేసింది. ఇలాంటి ఫేక్ ఖాతాలతో తాను హైదరాబాద్ లో కంప్లైంట్ కూడా చేయడం జరిగిందని చెప్పింది.

Recommended Video

#CineBox : Mahesh Babu Sarileru Neekevvaru Movie Updates !
పలు అనుమానాలు.. శ్రీ రెడ్డి చెప్పేది నిజమేనా?

పలు అనుమానాలు.. శ్రీ రెడ్డి చెప్పేది నిజమేనా?

ఉన్నట్టుండి శ్రీ రెడ్డి ఇలా యూ టర్న్ తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెనే నిజంగా కామెంట్స్ చేస్తోందా? లేక ఆమె పేరిట ఫేక్ అకౌంట్స్ ఉన్నాయనే మాట వాస్తవమేనా? అనే దానిపై చర్చ మొదలైంది. చూడాలి మరి ఈ ఇష్యూ ఇంకెత దూరం వెళ్తుందో!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X