శ్రీ రెడ్డిలో బయటపడుతున్న మరో కోణం.. రా‌మ్ చరణ్‌‌పై కామెంట్.. దిమ్మతిరిగే కౌంటర్

Recommended Video

Sri Reddy Comments On Ram Charan About Best Actor Award || Filmibeat Telugu

టాలీవుడ్ సంచలన తార శ్రీ రెడ్డి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆమె ఫేస్‌బుక్ మెసేజీలే. గతంలో కాస్టింగ్ కౌచ్ పై ఉద్యమించి కొన్ని కారణాల వల్ల ఆ ఉద్యమం వీడిన శ్రీ రెడ్డి.. ప్రస్తుతం ఫేస్‌బుక్ వేదికగా తాను టార్గెట్ చేసిన ఏ ఒక్కరినీ వదలకుండా తనదైన పదజాలం ఉపయోగిస్తూ ఏకిపారేస్తుండటం చూస్తూనే ఉన్నాం. హీరో, డైరెక్టర్ ఎవ్వరైనా, వారిని ఎంత పేరున్నా సరే భయపడేదే లేదన్నట్లుగా ఆమె వ్యవహరిస్తూ వస్తోంది. ఈ రకంగా భారీ ఫాలోయింగ్ కూడగట్టుకున్న శ్రీ రెడ్డి తాజాగా రామ్ చరణ్ పై చేసిన కామెంట్ ఆమె లోని మరో కోణాన్ని బయటపెడుతోంది. ఇంతకీ శ్రీ రెడ్డి ఏమని కామెంట్ చేసింది? వివరాల్లోకి పోతే..

సోషల్ మీడియాలో శ్రీ రెడ్డి.. ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్

సోషల్ మీడియాలో శ్రీ రెడ్డి.. ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్

హైదరాబాద్ వదిలి చెన్నైలో సెటిలైన శ్రీ రెడ్డి కొంత కాలంగా సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో నెట్టింట ఆమె బాగా ఫేమస్ అయిపోయింది. దీంతో శ్రీరెడ్డి ఫాలోవర్లు కూడా అరవై లక్షలు దాటిపోయారు. వారందరికీ అబ్బో అనిపించేలా తాజాగా జరుగుతున్న వ్యవహారాలతో ఆమె చర్చనీయాంశం అవుతోంది. ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ జనం నోళ్ళలో నానుతోంది.

ఇటీవలే ప్రభాస్‌ని ఉద్దేశిస్తూ సెన్సేషనల్ కామెంట్

ఇటీవలే ప్రభాస్‌ని ఉద్దేశిస్తూ సెన్సేషనల్ కామెంట్

ఇటీవలే ప్రభాస్‌ని ఉద్దేశిస్తూ సెన్సేషనల్ కామెంట్ చేసింది శ్రీ రెడ్డి. 'ప్రభాస్ ప్రవర్తన చాలా కూల్‌గా, మర్యాదపూర్వకంగా ఉంటుంది. అదే సమయంలో అతడు కూర్చునే విధానం రాయల్‌గా కనిపిస్తుంది. డ్రీమ్ బాయ్.. నిన్ను చూసి గర్వంగా ఫీలవుతున్నాను' అంటూ తన పోస్టులో పేర్కొంది శ్రీ రెడ్డి.

తాజాగా రామ్ చరణ్‌పై పడిన శ్రీ రెడ్డి

ఇక తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌పై పడింది శ్రీ రెడ్డి. ఇటీవలే జరిగిన సాక్షి అవార్డుల కార్యక్రమంలో రామ్ చరణ్ బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ సందర్బంగా ఆయనపై అభినందనల వర్షం కురిపించింది శ్రీ రెడ్డి. ఈ మేరకు ఫేస్‌బుక్ వేదికగా ప్రత్యేకమైన మెసేజ్ పెట్టింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

మెగా అభిమానుల మిశ్రమ స్పందన

మెగా అభిమానుల మిశ్రమ స్పందన

శ్రీ రెడ్డి పెట్టిన ఈ పోస్ట్ పై మెగా అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. తమ అభిమాన హీరోకి అభినందనలు తెలిపినందుకు కొందరు సంతోష పడుతుండగా, పవన్ కళ్యాణ్ విషయంలో ఆమె ప్రవర్తిస్తున్న తీరును గుర్తు చేస్తూ ఇంకొందరు మండిపడుతున్నారు. ఏదేమైనా తాను కుటుంబానికి కాదు వ్యక్తికి ప్రాధాన్యం ఇస్తా అన్నట్లుగా శ్రీ రెడ్డి సాగుతున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది.

శ్రీ రెడ్డి.. అంటే అదో టైపు అనుకుంటే పొరపాటే!

శ్రీ రెడ్డి.. అంటే అదో టైపు అనుకుంటే పొరపాటే!

మధ్య మధ్యలో కాంట్రవర్సియల్ పోస్ట్‌లు పెడుతూ సంచలనం సృష్టిస్తూనే తనలోని మరో కోణాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తోంది శ్రీ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ప్రభాస్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలపై పాజిటివ్ కామెంట్స్ చేస్తోంది. శ్రీ రెడ్డి అంటేనే అదో టైపు అనుకునే వారికి ఈ రకంగా దిమ్మతిరిగేలా కౌంటర్లు వేస్తోంది ఈ సంచలన తార.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X