శ్రీరెడ్డితో శ్వేతారెడ్డి రచ్చ.. ఆ నా కొడుకులది అంటూ సెన్సేషనల్ కామెంట్

Recommended Video

Swetha Reddy & Sri Reddy Fight Together Against Bigg Boss Telugu 3 || Filmibeat Telugu

సంచలనాలకు కేంద్ర బిందువైన రెడ్డి సిస్టర్స్ దగ్గరయ్యారు. సినీ ఇండస్ట్రీలోని లైంగిక వేధింపులపై కాస్టింగ్ కౌచ్ రూపంలో పెద్ద ఉద్యమం చేసిన శ్రీరెడ్డి, బుల్లితెర షో బిగ్ బాస్ నిర్వాహకులపై లైంగిక ఆరోపణలు చేసి ఈ మధ్య తెగ హంగామా చేస్తున్న శ్వేతా రెడ్డి ఇద్దరూ కలిసి సెన్సేషన్ సృష్టించారు. కాగా రెడ్డి సిస్టర్స్ ఇద్దరం కలిశామని, లైంగిక వేధింపులని ఎప్పటికీ సహించమని పేర్కొంటూ ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టి మరోసారి వార్తల్లో నిలిచింది శ్రీరెడ్డి.

శ్రీరెడ్డి.. అస్సలు ఆగేలా లేదు

శ్రీరెడ్డి.. అస్సలు ఆగేలా లేదు

కాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో టాలీవుడ్ పెద్దలకు చుక్కలు చూపించిన శ్రీరెడ్డి.. ఇటీవలే హైదరాబాద్ వదిలి చెన్నైలో సెటిలై పోయింది. దీంతో శ్రీరెడ్డి ఇక సైలెంట్ అయిపోయినట్లే అనుకున్నారంతా. కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా తాను ఎప్పటికీ కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతూనే ఉంటా అని హింట్స్ ఇస్తూ పలువురు సినీ ప్రముఖులపై ఫేస్‌బుక్ వేదికగా విరుచుకు పడుతూ వస్తోంది సంచలన తార శ్రీరెడ్డి.

ఇంతలో రంగంలోకి శ్వేతారెడ్డి

ఇంతలో రంగంలోకి శ్వేతారెడ్డి

శ్రీరెడ్డి హంగామా కొనసాగుతుండగానే శ్వేతారెడ్డి కూడా రంగంలోకి దిగింది. యాంకర్‌గా పలు ఛానల్స్‌లో పనిచేసి యూట్యూబ్ ద్వారా ఆరోపణలు మొదలు పెట్టి గత ఎన్నికల్లో కేఏ పాల్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది శ్వేతా రెడ్డి. ఇక దాన్ని కంటిన్యూ చేస్తూ ఇటీవల బిగ్ బాస్‌ నిర్వాహకులపై లైంగిక ఆరోపణలు చేసి హాట్ టాపిక్ గా మారింది.

శ్వేతారెడ్డికి సపోర్ట్ దొరికింది

శ్వేతారెడ్డికి సపోర్ట్ దొరికింది

బిగ్ బాస్ నిర్వాహకులు కమిట్‌మెంట్ అడిగారని ఆరోపణలు గుప్పించిన శ్వేతారెడ్డికి గాయత్రీ గుప్తా, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి రూపంలో సపోర్ట్ లభించింది. ఈ ముగ్గురూ కలిసి తమ గళాన్ని ఢిల్లీలో వినిపించి బిగ్ బాస్ బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా తాజాగా శ్వేతారెడ్డి, శ్రీరెడ్డి కూడా ఒక్కటవ్వడం సంచలనంగా మారింది.

ఆ నా కొడుకుల తొక్క తీస్తాం

యాంకర్ శ్వేతారెడ్డి, తాను కలిసి దిగిన కొన్ని ఫొటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన శ్రీరెడ్డి.. లైంగిక వేధింపులకు పాల్పడే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తామిద్దరం మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను ఆశలు సహించమని పేర్కొంటూ.. రెడ్డి సిస్టర్స్.. తొక్క తీస్తాం కొడుకులది అని తనదైన స్టైల్‌లో ట్యాగ్ లైన్ పెట్టింది శ్రీరెడ్డి.

ఇక సంచలనాలేనా..?

ఇక సంచలనాలేనా..?

లైంగిక వేధింపుల విషయంలో సంచలన తారగా పేరు తెచ్చుకున్న శ్రీరెడ్డి.. ఇప్పుడు కాంట్రవర్సీ క్వీన్ శ్వేతా రెడ్డితో కూడింది. ఇద్దరిదీ ఒకే కాన్సెప్ట్, దాని పైనే ఇద్దరి ఫైటింగ్. పైగా రెడ్డి సిస్టర్స్ అని అంటోంది.. అంటే ఈ లెక్కన ఇక రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలు చూస్తామా! అనే డౌట్ వస్తోంది జనాల్లో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X