twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘వందేళ్ల చరిత్రలో శ్రీరెడ్డి బ్లాక్ బస్టర్ విక్టరీ, అపుడు ఝాన్సీ లక్ష్మిభాయి... ఇపుడు శ్రీరెడ్డి’

    By Bojja Kumar
    |

    Recommended Video

    Srireddy Leaks : వివాదంలోకి మెగాస్టార్ చిరంజీవికి కూడా లాగే ప్రయత్నం

    కాస్టింగ్ కౌచ్ మీద పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి మీద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్ చేశారు. వందేళ్ల సినిమా చరిత్రలో నటి శ్రీరెడ్డిలా ఎవరూ పోరాటం చేయలేదంటూ ప్రశంసలు గుప్పించారు. తన పోరాటం ద్వారా ఆమె సంచలన విజయం సాధించారని, శ్రీరెడ్డిపై తనకు గౌరవం మరింత పెరిగిందని, ఝాన్సి లక్ష్మి భాయి కత్తితో పోరాటం చేస్తే శ్రీరెడ్డి తన దేహంతో పోరాటం చేసిందని వర్మ వరుస ట్వీట్స్ చేశారు.

    శ్రీరెడ్డికి సెల్యూట్

    గత వందేళ్లుగా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. అయితే ఇన్నేళ్ల కాలంలో ఎవరూ వ్యక్తిగతంగా దీనిపై పోరాడలేదు. కాస్టింగ్ కౌచ్‌ దుర్మార్గాలపై ఎవరూ చేయని పోరాటం శ్రీరెడ్డి చేస్తోంది, ఆమె చేస్తున్న పోరాటానికి సెల్యూట్ చేయకుండా ఉండలేక పోతున్నాను అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

    శ్రీరెడ్డి తల్లి గర్వపడాలి

    శ్రీరెడ్డి బట్టలు విప్పి అర్ధనగ్నంగా నిరసన తెలిపే విధానం తప్పే అని అభిప్రాయపడుతున్న వారు.... ఓ విషయాన్ని గుర్తించాలి. ఆమె ఇలా చేయడం వల్లనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అందరూ మేల్కొన్నారు అనేది ఎవరూ కాదనలేని విషయం. తన కూతురు సాధించిన విజయానికి శ్రీరెడ్డి తల్లి గర్వపడాలి అని వర్మ అన్నారు.

    జాతీయ మానవ హక్కుల సంఘం కూడా

    శ్రీరెడ్డి చేసిన నిరసన జాతీయ మానవ హక్కుల సంఘం కూడా కాస్టింగ్ కౌచ్ అంశంపై కదిలేలా చేసింది. తన పోరాటంతో శ్రీరెడ్డి సాధించి గొప్పవిజయం ఇది. అమేజింగ్ అచీవ్మెంట్ అంటూ రామ్ గోపాల్ వర్మ పొగడ్తలు గుప్పించారు.

    ఝాన్సీ లక్ష్మి భాయితో పోల్చిన వర్మ

    శ్రీరెడ్డి సాధించిన విజయాన్ని చరిత్రతో పోల్చినపుడు...అప్పట్లో ఝాన్సీ లక్ష్మి భాయి తన రాజ్యం కోసం కత్తితో పోరాటం చేసింది. ఇపుడు ఈ శ్రీ లక్ష్మి భాయి తన దేహాన్ని ఆయుధంగా ఉపయోగించి ఇండస్ట్రీలోని చెడుపై పోరాటం చేసింది అని వర్మ అన్నారు.

    బ్లాక్ బస్టర్ విక్టరీ

    శ్రీరెడ్డి సాధించిన విజయం తర్వాత ఆమెపై గౌరవం మరింత పెరిగిందని, ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకున్న నీకు సెల్యూట్ చేయకుండా ఉండలేక పోతున్నాను. నువ్వు సాధించిన విజయం మామూలు విజయం కాదు, బ్లాక్ బస్టర్ విజయం.... అని వర్మ అన్నారు.

    English summary
    "Casting couch existed ever since the advent of Cinema a 100 years back ..Not getting into individual allegations MsSriReddy has drawn more attention to the evils of Casting Couch than anyone in the last 100 years and I salute her for that. Those who thought MsSriReddy was wrong in stripping can’t deny,its only that shock which woke up both national and international communities ..Sri Reddy’s mother should be proud of what her daughter achieved for film industry in general and aspiring actresses in particular." RGV tweeted,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X