జూ.ఎన్టీఆర్, బాలయ్య అల్లుడి వ్యవహారంలో వేలుపెట్టిన శ్రీ రెడ్డి.. సెన్సేషనల్ కామెంట్స్
Recommended Video
టాలీవుడ్ సంచలన తార శ్రీ రెడ్డి మరోసారి సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడింది. ఇన్నాళ్లు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా సినీ ఇండస్ట్రీలోని ప్రతీ ఒకరిపై రెచ్చిపోయి కామెంట్లు చేసిన శ్రీ రెడ్డి.. ఈ సారి ఏకంగా నందమూరి ఫ్యామిలీ వ్యవహారంలో వేలుపెట్టి సంచలన కామెంట్స్ చేసింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ సినీ, రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ఇంతకీ శ్రీ రెడ్డి ఏమని కామెంట్ చేసింది? ఆ వివరాల్లోకి పోతే..

టీడీపీలోకి ఎన్టీఆర్..?
నందమూరి హరికృష్ణ ప్రథమ వర్ధంతి జరిగిన సమయంలో మాజీ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా వచ్చి జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, కుటుంబ సభ్యులను పరామర్శించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో చంద్రబాబు, ఎన్టీఆర్ ని టీడీపీలోకి ఆహ్వానించినట్లుగా వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ఈ ఇష్యుపై బాలయ్య అల్లుడు, టీడీపీ నాయకుడు భరత్ సంచలన కామెంట్స్ చేశారు.

జూ ఎన్టీఆర్ అవసరం లేదంటూ సంచలనం
ఓ ఇంటర్వ్యూలో భాగంగా భరత్ స్పందస్తూ.. ''జూ ఎన్టీఆర్ అవసరం పార్టీకి లేదనే అనుకుంటున్నాం. ఆయన అవసరం ఏముంది? మేము బాగానే హ్యాండిల్ చేస్తున్నాం. అలాంటపుడు ఆయన రావాలని ఎందుకు అనుకుంటాం. ఇప్పటిదాకా మేము నడిపిన పార్టీ, మాకు ఉన్న నాయకులు పనికిరాకుండా ఉన్నారా? అలాంటిదేమీ లేదు కదా'' అనేశారు భరత్.
వేలుపెట్టిన శ్రీ రెడ్డి.. డైరెక్ట్ అటాక్
తాజాగా ఈ వ్యవహారంలో వేలు పెడుతూ సెన్సేషన్ క్రియేట్ చేసింది శ్రీ రెడ్డి. బాలయ్య అల్లుడు, టీడీపీ నాయకుడైన భరత్ పై ఘాటుగా కామెంట్స్ చేసింది. ''నువ్వు బాలయ్య అల్లుడు అని వదిలేస్తున్నా, జూనియర్ ఎన్టీఆర్ లైఫ్ జర్నీలో రాలిన ఈకవి నువ్వు, వెళ్లి ముఖం కడుక్కో.. ఓడిపోయిన ఎంపీ ముఖమేసుకొని'' అంటూ అటాక్ చేసింది శ్రీ రెడ్డి.
మా జూనియర్ ఎన్టీఆర్‌ది అంటూ
''మా జూనియర్ ఎన్టీఆర్‌ది, ఎన్టీఆర్ బ్లడ్ అని తెరియుమా?? కొడితే బొక్కలేరుకోవాలి కొడకల్లారా..'' అంటూ మరో కామెంట్ లో మరింత దారుణంగా భరత్ పై రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. ఆమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారి పలు చర్చలకు దారి తీస్తున్నాయి.

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి వల వేస్తోందా..
అయితే ఈ ఇష్యుపై శ్రీ రెడ్డి ఎంత సీరియస్‌గా కామెంట్ చేసిందో తెలియదు కానీ.. కొందరు మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి వల వేసేందుకే ఇలా శ్రీ రెడ్డి కామెంట్లు పెట్టిందని అంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్, ఆయన ఫ్యాన్స్‌తో వైరం పెట్టుకున్న ఆమె.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి దగ్గర కావాలని ప్రయత్నిస్తోందటూ చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











