ఇల్లీ అక్కతో తాజ్ బంజారాలో డైరెక్టర్ తేజ రాసలీలలు.. సెన్సేషన్‌గా మారిన శ్రీ రెడ్డి పోస్ట్

Recommended Video

Actress Sri Reddy Sensational Comments On Director Teja

టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు ఇండస్ట్రీ లోకి వచ్చే మహిళలని కాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొంటూ అప్పట్లో శ్రీ రెడ్డి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఏకంగా పబ్లిక్ లోనే తన దుస్తులను విప్పేసి ఇలాంటి ఉదంతాలపై తన నిరసన తెలిపింది శ్రీ రెడ్డి. ఆ తర్వాత కొన్ని రోజులు యాక్టీవ్ గా ఉంటూ పలువురు సినీ ప్రముఖుల పేర్లు బయటపెట్టి సంచలనం సృష్టించిన ఈమె.. ప్రస్తుతం కోలీవుడ్ లో సెటిలై పోయింది. అయినప్పటికీ తన యాంగిల్ ఏ మాత్రం మార్చుకొని శ్రీ రెడ్డి తాజాగా దర్శకుడు తేజకు, స్టార్ హీరోయిన్ ఇలియానాకు లింక్ పెడుతూ పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది.

తేజ రాసలీలల వినోదం. తాజ్ బంజారాలో ఇల్లీ అక్కతో

ఇటీవలే సీత సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి చతికిల పడ్డ తేజపై బండరాయి వేస్తూ శ్రీ రెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. తేజ అసలు వ్యవహారం అంటూ వరుస పోస్ట్ లతో రచ్చ రచ్చ చేసేసింది. ''తేజ రాసలీలల వినోదం. తాజ్ బంజారాలో ఇల్లీ అక్కతో ఏంటి మరి.. మరిచిపోయావా'' అంటూ తన ఫేస్ బుక్‌లో శ్రీ రెడ్డి పెట్టిన పోస్ట్ పలు అనుమానాలకు తావిస్తోంది.

రామ్ గోపాల్ వర్మని కూడా లాగేస్తూ

రామ్ గోపాల్ వర్మని కూడా లాగేస్తూ

తేజ రాసలీలల వినోదం అని సెన్సేషన్ కామెంట్ పెట్టిన శ్రీ రెడ్డి అంతటితో ఆగక వర్మను కూడా ఇందులోకి లాగేసింది. ''రామ్ గోపాల్ వర్మకి ఆకు.. నాకు ఈక ఎవరు? ఇంకెవరు తేజం'' అంటూ మరో పోస్ట్ పెట్టింది. ''డైరెక్టర్ తేజ గారు రామ్ గోపాల్ వర్మని, నన్ను అనేంత బొమ్మ లేదు గాని.. ఫస్ట్ మీ బొమ్మలకి హిట్ ఇవ్వండి. నా బొచ్చు'' అంటూ తనదైన శైలిలో శ్రీ రెడ్డి వరుస కామెంట్స్ పెట్టింది.

ఉన్నట్టుండి తేజపై పడటానికి కారణం

ఉన్నట్టుండి తేజపై పడటానికి కారణం

ఎంతో మంది ప్రముఖుల పేర్లు బయటపెట్టినా కూడా ఇప్పటి వరకూ డైరెక్టర్ తేజ గురించి శ్రీ రెడ్డి మాట్లాడిన సందర్భం లేదు. కానీ ఉన్నట్టుండి ఇలా సంచలన ఆరోపణలు చేయడం, పైగా స్టార్ హీరోయిన్ ఇలియానాతో లింక్ పెట్టేయడం పై హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి. అయితే శ్రీ రెడ్డి తేజను టార్గెట్ చేయడానికి కారణం.. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంపై తేజ ఘాటుగా స్పందించడమే అని తెలుస్తోంది.

సీత ప్రమోషన్స్‌లో భాగంగా తేజ

సీత ప్రమోషన్స్‌లో భాగంగా తేజ

ఇటీవలే తన లేటెస్ట్ మూవీ సీత ప్రమోషన్స్ లో భాగంగా తేజ చేసిన వ్యాఖ్యలు చూసి శ్రీ రెడ్డికి ఎక్కడో కాలినట్టుంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ.. శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన ద్వారా ఇండస్ట్రీ పరువు రోడ్డున పడిందని.. ఆ ఉదంతాన్ని వెనుకుండి నడిపింది స్వయానా రామ్ గోపాల్ వర్మ అని అన్నారు. అంతేకాదు ఇలాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా ఇండస్ట్రీని ఏం పీకలేరు అంటూ శ్రీ రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు డైరెక్టర్ తేజ.

 గతంలో శ్రీ రెడ్డిని ఆదుకునే తేజ

గతంలో శ్రీ రెడ్డిని ఆదుకునే తేజ

గతంలో శ్రీరెడ్డి అర్థనగ్న ప్రదర్శన ద్వారా ఇండస్ట్రీ మొత్తం ఆమెపై ఆగ్రహంతో అవకాశాలు ఇవ్వని తరుణంలో దర్శకుడు తేజ ఆమెకు తన సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో ‘ఎన్టీఆర్ బయోపిక్' మూవీకి దర్శకత్వం వహిస్తున్న తేజ.. ఆ సినిమాలో శ్రీరెడ్డికి మంచి పాత్రను ఇస్తున్నట్టు ప్రామిస్ చేశారు. కానీ ఆ తరువాత తేజ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం, శ్రీ రెడ్డికి ఆ అవకాశం రాకపోవడం జరిగింది.

సీత సమయంలో మర్చిపోయినందుకేనా?

సీత సమయంలో మర్చిపోయినందుకేనా?

ఎన్టీఆర్ బయోపిక్ చేజారక సీత సినిమా చేశారు తేజ. కానీ శ్రీ రెడ్డికి తానిచ్చిన మాట మరిచి ఆమె వైపు చూడలేదు. అవకాశం ఇవ్వలేదు.. పైగా శ్రీ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో దానికి కౌంటర్ గానే శ్రీ రెడ్డి.. తేజ వ్యవాహారాన్ని బయటపెడతానని షాక్ ఇచ్చిందని అంటున్నారు కొందరు. కాకపోతే ఇలియానాతో తేజ వ్యవహారం అనే సరికి ఇది బాగా హాట్ టాపిక్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X