twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీరెడ్డి ఓపెన్ స్టేట్‌మెంట్.. ఆ*** బిగ్ బోకు.. బీప్.. బిచ్చగాళ్లు బెటర్.. హేమపై!

    |

    కాస్టింగ్ కౌచ్ సంచలన తార శ్రీ రెడ్డి రచ్చ ఏ మాత్రం బ్రేక్ తీసుకోవడం లేదు. హైదరాబాద్ వదిలి చెన్నైలో సెట్ అయింది ఇక ఆమె రచ్చకు ఫుల్‌స్టాప్ పడ్డట్టే అనుకున్నారంతా. కానీ ఊహించని రీతిలో సోషల్ మీడియా వేదికగా ఏ ఒక్కరినీ వదలకుండా అందరినీ టార్గెట్ చేస్తోంది శ్రీ రెడ్డి. ఈ నేపథ్యంలో నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న బిగ్ బాస్‌పై, అదేవిధంగా తొలి వారమే ఎలిమినేట్ అయిన హేమపై తాజాగా కొన్ని సంచలన కామెంట్లు చేసింది శ్రీ రెడ్డి. ఆమె చేసిన ఈ కామెంట్లపై నెటిజన్ల నుంచి సైతం మిశ్రమ స్పందన వస్తోంది. వివరాల్లోకి పోతే..

    బిగ్ బాస్ నాగార్జునకు షాక్

    బిగ్ బాస్ నాగార్జునకు షాక్

    టాలీవుడ్ పెద్దలపై లైంగిక ఆరోపణలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన శ్రీ రెడ్డి.. హైదరాబాద్ వదిలి చెన్నైలో సెటిలై పోయింది. అక్కడి నుంచే తన సహజ ధోరణికి పదును పెట్టింది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా శ్రీ రెడ్డి చేస్తున్న పోస్టులు మరింత సంచలనంగా మారుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్‌ని టార్గెట్ చేస్తున్న శ్రీ రెడ్డి.. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 3 పై పడింది. ఇప్పటికే 'బిగ్ బాస్ గాడు ఒక ఎదవ' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ఆమె తాజాగా మరికొన్ని వ్యాఖ్యలతో షాకిచ్చింది.

    బిగ్ బాస్

    ఈ సారి కాస్త డోస్ పెంచేసి.. ''బిగ్ బాస్ ఆడమ్మా బిగ్ బోకు.. బ్రోకర్ బీప్ బీప్.. వీళ్లకంటే బిచ్చగాళ్లు బెటర్.. డబ్బుకోసం ఎన్ని తిప్పలో ఒక్కొక్కడికీ'' అంటూ తనదైన స్టైల్ లో పోస్ట్ వదిలింది శ్రీ రెడ్డి. అంతటితో ఆగకుండా తొలివారం ఎలిమినేట్ అయిన నటి హేమను కూడా ఓ ఆట ఆడేసుకుంది.

    హేమ ఏంటి సంగతి.. అప్పుడలా, ఇప్పుడిలా?

    ''హేమ, అప్పుడు బిగ్ బాస్ గాడు పెద్ద తోపు అన్నారు.. పాపం శ్వేతా రెడ్డి గారిని తిట్టారు.. ఇప్పుడు మీరేమో బిగ్ బాస్ గాడిని చీటర్ అంటున్నారు. ఏ?'' అంటూ చురకంటించే ప్రశ్న వేసింది శ్రీ రెడ్డి. గతంలో శ్వేతా రెడ్డి బిగ్ బాస్ పై ఆరోపణలు చేసినపుడు హేమ రియాక్ట్ అయిన తీరుపై శ్రీ రెడ్డి ఈ కౌంటర్ వేసింది.

    శ్రీ రెడ్డి కౌంటర్స్‌పై నెటిజన్ల రెస్పాన్స్

    శ్రీ రెడ్డి కౌంటర్స్‌పై నెటిజన్ల రెస్పాన్స్

    నటి హేమపై శ్రీ రెడ్డి వేసిన కౌంటర్లకు నెటిజన్ల నుంచి పాజిటివ్ స్పందన వస్తోంది. ''అవసరం కోసం అలా మాట్లాడి ఉండవచ్చు, శ్రీ యూ నువ్ ఎప్పటికీ కరెక్ట్'' అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఈ సంగతులు ఎలా ఉన్నా కూడా బిగ్ బాస్ షో ప్రారంభానికి ముందు మొదలైన రచ్చ, వివాదాలు నేటికీ ఏదో ఒక రూపంలో కొనసాగుతుండటం గమనించదగిన విషయం.

    శ్వేతా రెడ్డికి శ్రీ రెడ్డి మద్దతు

    శ్వేతా రెడ్డికి శ్రీ రెడ్డి మద్దతు

    ఇక బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభానికి ముందు బిగ్ బాస్ నిర్వాహకులపై లైంగిక ఆరోపణలు చేసిన శ్వేతా రెడ్డికి మద్దతు పలుకుతోంది శ్రీ రెడ్డి. '' నాకు తమిళ బిగ్ బాస్ బాగా నచ్చింది. శ్వేతా రెడ్డి గారూ.. మీ దెబ్బకి బిగ్ బాస్ తెలుగు అట్టర్ ఫ్లాప్.. నా సపోర్ట్ మీకే శ్వేతా రెడ్డి'' అంటూ గతంలో కామెంట్ చేసిన శ్రీరెడ్డి.. ఇటీవలే శ్వేతా రెడ్డితో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చి మరోసారి హాట్ చర్చలకు తెరలేపింది.

    చివరి వరకు ఇంకెన్ని వివాదాలో

    చివరి వరకు ఇంకెన్ని వివాదాలో

    ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ బయట ఆరోపణలు, బిగ్ బాస్ హౌస్ లోపల కంటిస్టెంట్ల మధ్య గొడవలు చూస్తుంటే.. ఇక రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలు చూస్తామా! అనే డౌట్ వస్తోంది జనాల్లో. మొత్తానికైతే ఈ సరి బిగ్ బాస్ భలే హాట్ హాట్‌గా సాగుతోందిలే.

    English summary
    Tollywood sensation actor Sri Reddy is very much active in social media. Bigg Boss 3 season started with Nagarjuna as host. Upon that show Sri Reddy commented sensationally in Facebook.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X