For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నీ సైజులు చెప్పేస్తా.. ప్యాంట్ విప్పి నాతో ఛాలెంజ్ చేసే దమ్ముందా? స్టార్ హీరోపై శ్రీ రెడ్డి సవాల్

|

టాలీవుడ్ సంచలనం శ్రీరెడ్డి ఇప్పుడు కోలీవుడ్ సంచలనంగా మారింది. మహిళలను లైంగికంగా లొంగదీసుకుని హ్యాండ్ ఇస్తున్నారనే బలమైన వాదనతో తెలుగు సినిమా పెద్దలకు చుక్కలు చూపించిన ఈమె గత కొంతకాలంగా కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌పై పడింది. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళిపోయి అక్కడే సెటిలై పోయిన శ్రీ రెడ్డి.. ఎవ్వరినీ వదిలేదు అన్నట్లుగా మరోసారి తన మాటల తుఫాన్ స్టార్ట్ చేసింది. బోల్డ్ మాటలే సిగ్గుపడే రేంజ్‌లో అసభ్య పదజాలం ఉపయోగిస్తూ రెచ్చిపోయి కామెంట్లు చేస్తోంది.

నోటికి పదును పెట్టి.. చివరకు

నోటికి పదును పెట్టి.. చివరకు

శ్రీ రెడ్డి లేవనెనెత్తిన కాస్టింగ్ కౌచ్ అంశంపై కొందరు ప్రముఖులు పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్న సందర్భం లోనే శ్రీ రెడ్డి తన నోటికి పదును పెట్టేసింది. వల్గర్ పదజాలం వాడటంతో ఓ వైపు పాపులర్ అవుతూనే మరోవైపు కాస్టింగ్ కౌచ్ అంశంపై పట్టు కోల్పోయింది. ఒకరిద్దరు కాకుండా చాలా మంది తెలుగు హీరోల పేర్లు చెప్పడం బాగానే ఉన్నా, దానికి సరైన ఆధారాలు చూపక పోవడంతో ఆమె చేసిన ఉద్యమం నీరుగారి పోయింది.

తెలుగు హీరోల నుంచి తమిళ హీరోల వైపు

తెలుగు హీరోల నుంచి తమిళ హీరోల వైపు

గతంలో మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, రాఘవ లారెన్స్, నాని లాంటి వారిపై లైంగిక ఆరోపణలు చేసిన ఈమె చివరకు కోలీవుడ్‌లో సెటిలై పోయింది. అక్కడ కూడా తన రెగ్యులర్ పంథాకు పదును పెట్టేస్తూ తమిళ హీరోలకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా తమిళ స్టార్ హీరో విశాల్‌పై రెచ్చిపోయి కామెంట్ చేస్తోంది శ్రీ రెడ్డి.

అమ్మాయిలను వాడుకొని వదిలేసే రకం విశాల్

నడిగర్ సంఘం ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో శ్రీ రెడ్డి అటాక్ చేయడం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హీరో విశాల్.. అమ్మాయిలను వాడుకొని వదిలేసే రకం అని, ఆయన క్యారవాన్‌లో జరిగేవన్నీ రాసలీలలే అని తెలిపి పెద్ద బాంబ్ పేల్చింది శ్రీ రెడ్డి. అంతేకాదు విశాల్ క్యారెక్టర్‌కు సంబంధించిన ఆధారాలు తన వద్ద వున్నాయని ఆమె ఆరోపిస్తోంది.

 ప్యాంట్ విప్పి నాతో ఛాలెంజ్ చేసే దమ్ముందా?

ప్యాంట్ విప్పి నాతో ఛాలెంజ్ చేసే దమ్ముందా?

ఈ మేరకు తాజాగా విశాల్‌పై శ్రీ రెడ్డి చేసిన ఓ కామెంట్ సంచలనం సృష్టిస్తోంది. నీ సైజులు చెప్పేస్తా.. ప్యాంట్ విప్పి నాతో ఛాలెంజ్ చేసే దమ్ముందా? అంటూ శ్రీ రెడ్డి ఓపెన్ సవాల్ విసరడంతో షాకయ్యాయి సినీ వర్గాలు. తాను రెడ్డి అయినంత మాత్రాన.. రెడ్డిలందరికీ సపోర్ట్ చేయనని, ఆడవారికి అన్యాయం చేసిన వారి ***** పిసికేస్తానని ఆమె పోస్ట్ పెట్టడం సెన్సేషన్‌గా మారింది.

విశాల్‌నే ఎందుకు టార్గెట్ చేసిందంటే..

విశాల్‌నే ఎందుకు టార్గెట్ చేసిందంటే..

గతంలో నానిపై శ్రీరెడ్డి ఇటువంటి ఆరోపణలే చేసినప్పుడు విశాల్.. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాడు. ఇవాళ నానికి మద్దతుగా నిలుస్తున్నందుకు రేపు శ్రీరెడ్డి తనపై కూడా ఆరోపణలు గుప్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అప్పట్లోనే విశాల్ చెప్పాడు కూడా. సరిగ్గా ఆయన చెప్పినట్లే దానిని నిజం చేస్తూ ఇప్పుడు విశాల్ మీద పడి చెప్పరాని కామెంట్స్ చేస్తోంది శ్రీ రెడ్డి. అయితే శ్రీ రెడ్డి తీరును కొందరు సపోర్ట్ చేస్తుండగా, మరికొందరు విమర్శిస్తుండటం గమనార్హం.

English summary
Actress Sri Reddy once again fired on hero Vishal. She shered a post, on that post she challenged with hero vishal
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more