తమన్నాకి పెద్ద బాయ్య దొరికాడు.. శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్.. నాగార్జునపై మరోసారి!
శ్రీ రెడ్డి సోషల్ మీడియా పోస్టులు సంచలనం సృష్టిస్తున్నాయి. టాలీవుడ్ పెద్దలపై లైంగిక ఆరోపణలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన శ్రీ రెడ్డి.. హైదరాబాద్ వదిలి చెన్నైలో సెటిలై పోయింది. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా శ్రీ రెడ్డి చేస్తున్న పోస్టులు మరింత సంచలనంగా మారుతున్నాయి. టాలీవుడ్ కి సంబంధించి ఏ ఒక్కరినీ వదలకుండా టార్గెట్ చేస్తున్న శ్రీ రెడ్డి.. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 3 పై పడింది. ఇప్పటికే హోస్ట్ నాగార్జునపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆమె తాజాగా మరికొన్ని వ్యాఖ్యలతో షాకిచ్చింది.

వివాదాల నడుమ బిగ్ బాస్ సీజన్ 3
పలు వివాదాల నడుమ స్టార్ట్ అయిన బిగ్ బాస్ మూడో సీజన్ నాగార్జున హోస్ట్‌గా జులై 21న ప్రారంభమై మంచి రేటింగుతో దూసుకెళుతోంది. ఈ సారి హౌస్‌లో ఉన్న వారంతా సెలబ్రిటీలే కావడంతో షో మరింత ఆసక్తిగా సాగుతోంది. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్, నాని హోస్ట్ చేసిన రెండో సీజన్‌తో పోలిస్తే... నాగార్జున మూడో సీజన్ పూర్తి భిన్నంగా, స్టైలిష్‌గా సాగుతోంది.
చంద్రబాబు కంటే ముదురు నాగార్జున
ఈ షో విషయమై ఇప్పటికే నాగార్జునపై వివాదస్పద కామెంట్స్ చేసింది సంచలన తార శ్రీ రెడ్డి. ‘నాగార్జున గారికి తెలిసినన్ని పాలిటిక్స్ చంద్రబాబు గారికి కూడా తెలియవు. డబ్బిస్తే బిగ్ బాస్ హీరో... ఇవ్వకపోతే బిగ్ బాస్ ఒక వెధవ' అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. దానికి కొనసాగింపుగా మరోసారి తన సోషల్ మీడియా పోస్టుకు పదును పెట్టింది శ్రీ రెడ్డి.
తమన్నాకి పెద్ద బాయ్య దొరికాడు
తొలివారం హేమ ఎలిమినేషన్ జరిగాక, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ట్రాన్స్‌జెండర్ తమన్నా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఇదే అదునుగా చేసుకొని నాగార్జునను ఉద్దేశిస్తూ మరో పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి. ''తమన్నాకి పెద్ద బాయ్య దొరికాడు.. నాగార్జున భయ్యా సెలక్షన్.. సారీ రివేంజ్ బావుంది.. సోనా ఈజ్ బెస్ట్'' అంటూ షాకింగ్ కామెంట్ చేసింది శ్రీరెడ్డి.

శ్వేతా రెడ్డికి శ్రీ రెడ్డి మద్దతు
అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభానికి ముందు బిగ్ బాస్ నిర్వాహకులపై లైంగిక ఆరోపణలు చేసిన శ్వేతా రెడ్డికి మద్దతు పలికింది శ్రీ రెడ్డి. '' నాకు తమిళ బిగ్ బాస్ బాగా నచ్చింది. శ్వేతా రెడ్డి గారూ.. మీ దెబ్బకి బిగ్ బాస్ తెలుగు అట్టర్ ఫ్లాప్.. నా సపోర్ట్ మీకే శ్వేతా రెడ్డి'' అంటూ కామెంట్ పోస్ట్ చేసింది శ్రీరెడ్డి.

ఓ వైపు హేమ.. మరోవైపు శ్రీ రెడ్డి
మొదటి నుంచే వివాదాల నడుమ హాట్ టాపిక్ గా మారిన బిగ్ బాస్ ఇష్యు.. హేమ ఎలిమినేషన్ తర్వాత మరిన్ని చర్చలకు తావిస్తోంది. ఈ లోగా హేమ చేసిన షాకింగ్ కామెంట్స్, శ్రీ రెడ్డి వరుస పోస్టులు బిగ్ బాస్ చర్చలను మరింత ముదిరేలా చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











