మేకప్‌లు వేసుకుంటూ పిచ్చి కూతలు కూస్తుంటారు... మాధవీలతపై శ్రీరెడ్డి సెటైర్స్
శ్రీరెడ్డి, మాధవీలత మధ్య వివాదం ఇప్పుడు మొదలైంది కాదు. నాడు క్యాస్టింగ్ కౌచ్, మీటూ పోరాటంలో భాగంగా వీరిద్దరి అభిప్రాయాల్లో తేడా వచ్చింది. శ్రీ రెడ్డి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసిందో.. అప్పటి నుంచి వీరి దారులు వేరయ్యాయి. ఆ సమయంలో మాధవీలత పవన్ కళ్యాణ్‌ను సపోర్ట్ చేసింది. ఇక అప్పటి నుంచి వీరిద్దరి మధ్య దూరం పెరగుతూనే వచ్చింది. ఆ మధ్య సాధినేని యామినిపై మాధవీలత కామెంట్ చేయడం.. సాధినేనికి మద్దతు తెలుపుతూ మాధవీలతపై శ్రీ రెడ్డి ఫైర్ అవ్వడం అందరికీ తెలిసిందే. తాజాగా మరో సారి మాధవీలతపై శ్రీరెడ్డి పరోక్షంగా సెటైర్స్ వేసింది.

మల్లెపూలు అంటూ...
సాధినేని యామిని టీడీపీ నుంచి బీజేపీలో చేరడంపై మాధవీలతా ఫైర్ అయింది. మల్లెపూల వాసనలు గురించి ఇష్టం వచ్చినట్లుగా అబద్ధాలు చెప్పే వారికి, మల్లెపూలు నలిపిన కథలు బాగా తెలిసిన వారికి పదవులు ఇస్తారా.. అంటూ మాధవీలతా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.

ఆమె గురించి మట్లాడితే తాట తీస్తా..
ఈ వ్యవహారంలో శ్రీరెడ్డి దూరి మాధవీలతను ఏకి పారేసింది. 'యామిని సాధినేనికి నేను సపోర్ట్ చేస్తున్నాను.. ఆమె గురించి ఎవరైనా పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తా.. హిస్టరీ కూడా బయటకు తీయవలసివస్తుంది' అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది.

మాధవీలత సైతం రివర్స్ ఎటాక్..
మాధవీలత స్పందిస్తూ.. ‘సాధారణం జనాలు మాట్లాడతారు.. తెలివైనవారు వాటిని వింటారు గ్రహిస్తారు.. కుక్కలు మొరుగుతాయి.. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఏమంటున్నానో.. నేను చాలా తెలివిగా ప్రవర్తిస్తాను మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో' అంటూ శ్రీరెడ్డిపై పరోక్ష కామెంట్స్ చేసింది.

కుక్క అంతా హైట్ ఉన్నవాళ్లు..
ఏనుగు, కుక్కలతో పోల్చుతూ మాధవీలతా చేసిన పరోక్ష కామెంట్లపై శ్రీ రెడ్డి కౌంటర్ వేసింది. ‘కుక్క అంత హైట్ ఉన్నవాళ్లు కూడా ఏనుగు మీద జోకులేస్తుంటే.. దేంతో నవ్వాలో అర్థం కావట్లే. చిత్తకార్తె పూ.. 'అంటూ శ్రీ రెడ్డి రెచ్చిపోయింది. తాజాగా మరోసారి శ్రీ రెడ్డి మాధవీలతను గెలికింది.
Recommended Video

మేకప్‌లు వేసుకుంటూ..
తాజాగా శ్రీ రెడ్డి చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ‘బీజేపీ లో కొంతమంది మేము సినిమా హీరోయిన్లము, సెలెబ్రెటీలము అనుకుంటూ మేకప్ లు వేసుకుంటూ పిచ్చి కూతలు కూస్తుంటారు..కానీ వారు ప్రధానమంత్రి లేదా పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు ప్రచారం చేయరు. నిన్న కాక మొన్న బీజేపీ లో చేరిన సాదినేని యామిని శర్మ ని చూడండి. పీఎం చెప్పాడు అని ఏకంగా శపధాలు, ప్రమాణాలు చేస్తూ తను పాటిస్తూ బీజేపీ కార్యకర్తలను, దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపుతోంద'ని పోస్ట్ చేసింది. మరి దీనిపై మాధవీలత ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











