twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ఒక్కడు అలా చేస్తే.. మే 3 తరువాత పరిస్థితి ఏంటి.. ప్రధాని నిర్ణయంపై శ్రీ రెడ్డి సెటైర్స్

    |

    శ్రీరెడ్డి సినీ, రాజకీయ విషయాలపై చురుకుగా స్పందిస్తుందన్న సంగతి తెలిసిందే. సినిమాల్లో అయితే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విరుచుకుపడే శ్రీ రెడ్డి రాజకీయాల్లోనూ విభిన్న అభిప్రాయాలను వెల్లిబుచ్చుతుంది. కేసీఆర్, జగన్, మోడీ పరిపాలను బాగుందని వారి నిర్ణయాలను సమర్థిస్తూ ఉంటుంది. ఇలా సినీ, రాజకీయ వ్యక్తులపై తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్ డౌన్‌ను పొడిగించిన సంగతి తెలిసిందే. జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ.. ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయంపై శ్రీ రెడ్డి సెటైర్స్ వేసింది. అదేంటో ఓ సారి చూద్దాం.

     తాండవం చేస్తోన్న కరోనా..

    తాండవం చేస్తోన్న కరోనా..

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రపంచదేశాలన్నీ కరోనాకు గజగజ వణికిపోతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 18 లక్షల మందికి కరోనా సోకగా.. లక్షకు పైగా మృత్యువాత పడ్డారు. మన దేశంలోనూ కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. ఇండియాలో పది వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. 300కు పైగా దుర్మరణం చెందారు.

    కట్టుదిట్టమైన లాక్ డైన్..

    కట్టుదిట్టమైన లాక్ డైన్..

    గత నెల నుంచి అమలు చేసిన 21 రోజుల లాక్ డౌన్ నేటితో ముగిసింది. కాసేపటి క్రితం జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని మోడీ.. మరో 19 రోజుల పాటు అంటే మే 3 వరకు లాక్ డౌన్‌ను పొడిగించినట్టు పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై శ్రీరెడ్డి సెటైర్స్ వేసింది.

    మే 3 తరువాత కరోనా..

    మే 3 తరువాత కరోనా..

    ప్రధాని ప్రకటించిన లాక్ డౌన్‌ను ఉద్దేశిస్తూ.. మే 3 తరువాత కరోనా ఆకాశంలోకి షిఫ్ట్ అవుతుందా? పేదవారి గురించి ఆలోచించండి.. వారిని కాపాడండి.. నిత్యావసరాలు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వండని శ్రీ రెడ్డి కోరింది.

    Recommended Video

    Anchor Sreemukhi About Her Movie Career
    ఆ ఒక్కడు అలా చేస్తే..

    ఆ ఒక్కడు అలా చేస్తే..

    ‘ఒకవేళ మే 3 తరువాత కరోనా ఉన్న వ్యక్తి అందరికీ వ్యాపింపజేస్తే ఏం చేస్తారు.. అతడు లక్షల మందికి కరోనాను అంటిస్తాడు.. మళ్లీ ఏం చేస్తార'ని శ్రీరెడ్డి ప్రశ్నించింది. మొత్తానికి శ్రీ రెడ్డి సంధించిన ప్రశ్నలు ఆలోచనలు రేకెత్తించేలానే ఉన్నాయి.

    English summary
    Sri Reddy Satires On Lockdown Extension Till 3rd May. Sri Reddy Quentioned that What Will Do After may 3rd, And Think About Poor People.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X