దేనితో నవ్వాలో అర్థం కావట్లేదు.. చిత్తకార్తె అంటూ మాధవీలతాపై శ్రీరెడ్డి ఫైర్
గత రెండు మూడు రోజులుగా మాధవీలతా, శ్రీ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సాధినినే యామిని బీజేపీలో చేరడంపై మాధవీలతా ఫైర్ అయింది. ఈ మేరకు ఆమెను ధూషిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అయితే సాధినేనికి మద్దతిస్తూ.. మాధవీలతాకు కౌంటర్ వేసింది శ్రీరెడ్డి. శ్రీరెడ్డి కౌంటర్‌కు మాధవీలతా స్పందించగా.. వాటిపై శ్రీరెడ్డి మరో కౌంటర్ వేసింది. ఇలా వీరిద్దరి మధ్య వ్యవహారం రగులుతూనే ఉంది. తాజాగా శ్రీ రెడ్డి చేసిన కామెంట్స్ ఏంటనేది ఓ సారి చూద్దాం.

సాధినేని యామినిపై ఫైర్
ఇటీవల సాధినేని యామిని టీడీపీ నుంచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమెను టార్గెట్ చేస్తూ మాధవీలతా ఫైర్ అయింది. గతంలో సాధినేని యామిని పవన్ కళ్యాణ్‌ను మల్లెపూలు నలపడానికి మాత్రమే పనికొస్తారని కామెంట్ చేసిన విషయం తెలిసిందే. అదే తరహాలో మాధవీ లతా సాధినేనిని ఉద్దేశిస్తూ.. మల్లెపూల వాసనలు గురించి ఇష్టం వచ్చినట్లుగా అబద్ధాలు చెప్పే వారికి, మల్లెపూలు నలిపిన కథలు బాగా తెలిసిన వారికి పదవులు ఇస్తారా.. అంటూ మాధవీలతా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.

ఆమె గురించి మట్లాడితే తాట తీస్తా..
సాధినేని యామినిపై కామెంట్స్ చేసిన మాధవీలతాపై శ్రీరెడ్డి రెచ్చిపోయింది. 'యామిని సాధినేనికి నేను సపోర్ట్ చేస్తున్నాను.. ఆమె గురించి ఎవరైనా పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తా.. హిస్టరీ కూడా బయటకు తీయవలసివస్తుంది' అంటూ శ్రీ రెడ్డి మాధవిలతకు గట్టి కౌంటర్ ఇచ్చింది.

కుక్కలు మొరుతూనే ఉంటాయి..
అయితే మాధవీలతా కాసేపటి క్రితం చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. అయితే అది ఎవరినీ ఉద్దేశించి చేసిందో మాత్రం తెలియడం లేదు. ‘సాధారణం జనాలు మాట్లాడతారు.. తెలివైనవారు వాటిని వింటారు గ్రహిస్తారు.. కుక్కలు మొరుగుతాయి.. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఏమంటున్నానో.. నేను చాలా తెలివిగా ప్రవర్తిస్తాను మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో' అంటూ పరోక్ష కామెంట్స్ చేసింది.
Recommended Video

కుక్క అంతా హైట్ ఉన్నవాళ్లు..
ఏనుగు, కుక్కలతో పోల్చుతూ మాధవీలతా చేసిన పరోక్ష కామెంట్లపై శ్రీ రెడ్డి కౌంటర్ వేసింది. ‘కుక్క అంత హైట్ ఉన్నవాళ్లు కూడా ఏనుగు మీద జోకులేస్తుంటే.. దేంతో నవ్వాలో అర్థం కావట్లే. చిత్తకార్తె పూ.. 'అంటూ శ్రీ రెడ్డి రెచ్చిపోయింది. మరి వీటిపై మాధవీలతా ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











