పతివ్రతలా ఆ రోజు కబుర్లు.. రకుల్ ప్రీత్‌పై శివాలెత్తిన శ్రీ రెడ్డి

ప్రస్తుతం భారత సినీ పరిశ్రమను డ్రగ్స్ కేసు కలవర పెడుతోంది. బాలీవుడ్, శాండల్ వుడ్‌లో డ్రగ్స్ కేసుకు సంబంధించి పలు అరెస్ట్‌లు కూడా జరిగియి. డ్రగ్స్ కేసు పవనాలు మెల్లిగా టాలీవుడ్ వైపుకు వీస్తున్నాయి. రియా చక్రవర్తి కాల్ లిస్ట్‌లో రకుల్ ప్రీత్, రానా పేర్లు ఉండటం, తాజా విచారణలో రియా రకుల్ పేరును చెప్పడం కలకలం రేపుతోంది. ఇక రకుల్ పేరు డ్రగ్స్ కేసులో బయటకు రావడంతో టాలీవుడ్ సెలెబ్రిటిల్లోనూ అందోళన మొదలైనట్టు కనిపిస్తోంది. తాజాగా శ్రీ రెడ్డి రకుల్ ప్రీత్‌ను ఓ ఆటాడేసుకుంది. డ్రగ్స్ విషయంలో రకుల్ పేరు రావడంతో ఓ వీడియోను రిలీజ్ చేసింది.

ఆ రోజు అలా..

ఆ రోజు అలా..

ఇది రివేంజ్ అని నేను అనుకోను.. ఒకానొక సమయంలో క్యాస్టింగ్ కౌచ్ సమయంలో నేను పోరాటం చేస్తున్నప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి.. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ గానీ, డ్రగ్స్ కానీ అలాంటివేవీ ఉండవు.. మమ్మల్ని ఎవ్వరూ కూడా తిట్టరు..అప్పుడు పెద్ద ఉద్యమంలా చేసి క్యాండిల్స్ వెలిగించి.. మంచు లక్ష్మీ ఏమో.. మా ఇండస్ట్రీలోనే డ్రగ్స్ ఉన్నాయా? మా ఇండస్ట్రీలోనే క్యాస్టింగ్ కౌచ్ ఉందా? మమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తారంటూ ప్రశ్నలు వేశారు అని శ్రీ రెడ్డి గుర్తుకు చేసుకుంది.

పతితు కబుర్లు..

పతితు కబుర్లు..

ఈ రోజు డ్రగ్స్ విషయంలో రకుల్ పేరు బయటకు వచ్చింది. ఆ రోజు రకుల్ ప్రీత్ టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ లేదండి అదండి ఇదండి టాలీవుడ్ సూపర్ అండి డూపర్ అండి.. డ్రగ్స్ కూడా ఏమోనండి అని పతితు కబుర్లు చెప్పింది. ఈ రోజు ముంబై వెళ్లి క్యాస్టింగ్ కౌచ్ ఉండకూడదు.. బాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంది అని పబ్లిసిటీ కోసం నోటికొచ్చింది మాట్లాడుతోంది అని శ్రీ రెడ్డి చెప్పుకొచ్చింది.

రంకు పురాణాలు..

రంకు పురాణాలు..

బాలీవుడ్ న్యూస్ టాలీవుడ్‌కు , టాలీవుడ్ న్యూస్‌కు రాదని అనుకుంటుందా? అక్కడ ఒకలా ఇక్కడ ఒకలా మాట్లాడుతుంది.. మళ్లీ ఏమీ లేదని అంటుంది. కానీ డ్రగ్స్ విషయంలో రకుల్ పేరు ఎలా బయటకు వచ్చిందో నాకు తెలియడం లేదు. ఆరోజు నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడి.. పతితుల్లా ప్రవర్తించారు.. ఈరోజు మొత్తం రంకు పురాణాలు, చెత్త యవ్వారాలన్నీ బయటకు వస్తున్నాయంటూ శ్రీ రెడ్డి తెలిపింది.

Recommended Video

Sushant Singh Rajput : Sri Reddy Comments Viral || వారందరి చావును కూడా నేను త్వరలోనే చూస్తానేమో ?
అది ఎవ్వరినీ వదిలిపెట్టదు..

అది ఎవ్వరినీ వదిలిపెట్టదు..

నాకు వచ్చిన చెడ్డ పేరు ఎలాగో వచ్చింది..ఇన్ కమ్ ట్యాక్స్ రైడులు అవ్వొచ్చు, డ్రగ్స్ కేసులు అవ్వొచ్చు.. కరోనా వల్ల అవ్వొచ్చు ప్రతీ ఒక్కరూవాళ్ల పాపాన్ని అనుభవిస్తున్నారు.. ఎందుకో తెలుసా? పాపం కట్టి కుదిపేస్తది. అదే మనందరం కర్మ అంటాం.. ఈ రోజు ప్రతీ ఒక్కరూ కర్మను అనుభవిస్తున్నారు..కర్మ ఎవ్వరినీ వదలిపెట్టలేదు.. అందుకే అందరికీ చెబుతున్నా.. జాగ్రత్తగా ఉండండి.. జాగ్రత్తగా మాట్లాడండి..రిలేషన్ షిప్‌లో జాగ్రత్తగా ఉండండి.. కర్మ ఎవ్వరినీ వదలదు.. కర్మకు వారు వీరు అని తేడా ఉండదు.. అంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X