నోరుపారేసుకున్న శ్రీరెడ్డి.. భరత్ అనే నేను బ్లాక్‌బస్టరా? పక్కా ఫ్లాప్.. మహేష్‌పై కామెంట్స్!

వివాదాస్పద నటి శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా కాస్టింగ్ కౌచ్ దారుణాలు గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది, ఒక్క ఈ విషయమే కాదు, అనేక అంశాలపై ఆమె స్పందించింది. కొన్ని సార్లు ఆమె కామెంట్స్ దుమారంలేపాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఆమె మాట్లాడిన మాటలు సంచలనం అయ్యాయి. తాజాగా భరత్ అనే నేను, కొందరు డైరెక్టర్ల గురించి శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

Recommended Video

KTR Special Interview With Bharat Anu Nenu Movie Team Part 2
రివర్స్ లో శ్రీ రెడ్డికి పంచ్

రివర్స్ లో శ్రీ రెడ్డికి పంచ్

తనని చాలా మంది సినీప్రముఖులు అవకాశాల పేరుతో వాడుకుని వదిలేశారని మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణా ప్రభుత్వం స్పందించి దీనిపై చర్యలు తీసుకోకుంటే ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరించిన సంగతి తెలియందే. తాజాగా శ్రీ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు మరికొందరు రివర్స్ లో రియాక్ట్ అయ్యారు. కరాటే కళ్యాణి శ్రీ రెడ్డిపై వ్యతిరేకంగా చేసిన కామెంట్స్ మనందరికి తెలుసు.

శ్రీ రెడ్డి భరత్ అనే నేను

తాజాగా శ్రీ రెడ్డి మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాపై స్పందించింది. భరత్ అనే నేను సినిమా పెద్దగా లేదని, వీక్ కంటెంట్ తో సినిమా చేసారని, అందరు అనుకుంటున్నట్లు ఈ సినిమా హిట్ కాదని, కేవలం మహేష్ బాబు క్రేజ్ వల్ల ఆడిందని సంచలన కామెంట్స్ చెయ్యడం జరిగింది.

సుకుమార్, తేజ, పూరి

నిజం సినిమాలో మహేష్ బాబు నటించిన ఒక సీన్ ను పోస్ట్ చేసి ''ఇది మహేష్ బాబు అంటే, ఇది యాక్టింగ్ అంటే, ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వొచ్చు ఈ యాక్టింగ్ కి, మహేష్ బాబు లో ఒక గొప్ప నటుడు దాగి ఉన్నాడు, ఒక్క సుకుమార్, తేజ, పూరి జగన్నాధ్ మాత్రమే మహేష్ లో ఉన్న నటుడిని వేలికితిస్తున్నారు'' అని తనదైన శైలిలో కామెంట్స్ చేసారు.

కొరటాలపై శ్రీరెడ్డి కామెంట్ష్

కొరటాలపై శ్రీరెడ్డి కామెంట్ష్

ఇదిలా ఉండగా, తనతో దర్శకుడు కొరటాల శివ అమర్యాదగా ప్రవర్తించాడు అని శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా వాట్సాప్ ఛాటింగ్‌ను కూడా బయటపెట్టింది. ఈ వ్యవహారమంతా భరత్ అనే నేను రిలీజ్‌కు ముందు జరగడంతో కొంత గందరగోళం నెలకొన్నది.

శ్రీరెడ్డి వ్యాఖ్యలపై కొరటాల శివ స్పందన

శ్రీరెడ్డి వ్యాఖ్యలపై కొరటాల శివ స్పందన

అయితే శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కొరటాల శివ స్పందించారు. ప్రత్యేకంగా ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. తన తల్లి, భార్య తప్ప మరో మహిళ నా జీవితంలో లేదని ఆయన చెప్పారు. భరత్ అనే నేను రిలీజ్‌కు ముందు ఎలాంటి వివాదాలు తలెత్తకుండా చేయడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడనే మాటలు సినీ వర్గాల్లో వినిపించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X