Don't Miss!
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అల్లు అర్జున్‌పై శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్.. ఎంత మాట.. ఎంత మాట! బన్నీ అభిమానుల రియాక్షన్..
టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలను టార్గెట్ చేస్తూ వస్తున్న శ్రీ రెడ్డి తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై కామెంట్ చేసి సంచలనం సృష్టించింది. కాస్టింగ్ కౌచ్ పేరిట సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు పరిష్కారం చేపట్టాలని ఉద్యమించిన శ్రీ రెడ్డి.. మెల్లగా తన ఉద్యమాన్ని దారి మళ్లించి సోషల్ మీడియాలో వీరవిహారం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సారి బన్నీని టార్గెట్ చేసింది ఈ వివాదాస్పద తార. ఇంతకీ బన్నీ జోలికి శ్రీ రెడ్డి ఎందుకొచ్చినట్లు? ఆమె చేసిన ఆ కామెంట్ ఏంటి? వివరాల్లోకి పోతే..
అల్లు అర్జున్.. రియల్లీ గ్రేట్
మెగా ఫ్యామిలీ హీరోగా పరిచయమైనప్పటికీ తన టాలెంట్‌తో రోజు రోజుకూ ఫాలోయింగ్ పెంచుకుంటూ అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్నాడు అల్లు అర్జున్. 'గంగోత్రి' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయన సినిమా సినిమాకు పురోగతి సాధిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని టాలీవుడ్ హీరోల్లో బెస్ట్ డాన్సర్‌గా కీర్తించబడుతున్నాడు.
శ్రీ రెడ్డి అటాక్.. అల్లు అర్జున్ స్టైలిష్ లుక్
ఇలాంటి తరుణంలో అల్లు అర్జున్ స్టైలిష్ లుక్‌పై శ్రీ రెడ్డి అటాక్ చేయడం హాట్ టాపిక్ అయింది. ఎప్పుడూ కాంట్రవర్సియల్ కామెంట్స్ చేస్తూ టాలీవుడ్, కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న శ్రీ రెడ్డి.. అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ గురించి తన సోషల్ మీడియా ఖాతాలో కామెంట్ పెట్టింది.
అల్లు అర్జున అంటూ.. ఎంత మాట.. ఎంత మాట!
''అల్లు అర్జున ఎప్పటికైనా నీ ఒరిజినల్ హెయిర్‌తో సినిమాల్లో వస్తావా? ఎప్పుడూ ఎక్స్టెన్షన్ విగ్గులేనా?'' అంటూ శ్రీ రెడ్డి ఫేస్బుక్ పోస్ట్ పెట్టింది. దీంతో ఈ పోస్ట్ చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ శ్రీ రెడ్డిని ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ఎప్పుడూ ఇలాంటి చీఫ్ ట్రిక్స్ తప్ప ఇంకోటి తెలియదా నీకు? అని ప్రశ్నిస్తున్నారు.
అప్పట్లో కూడా ఇలాగే..
గతంలో కేరళ వరదల కారణంగా రాష్ట్రంలోని ప్రజలు అతలాకుతలం అయినప్పుడు కూడా ఇలాగే అల్లు అర్జున్‌పై విరుచుకుపడింది శ్రీ రెడ్డి. 10 కోట్లు పెట్టి కార్ కొంటావు.. కానీ కేరళ ప్రజలకు సహాయం చేయవా? అని అప్పట్లో బన్నీని ప్రశ్నించింది శ్రీ రెడ్డి.
భారీ అంచనాలు.. అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ
ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. అల.. వైకుంఠపురములో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అయ్యాడు బన్నీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల నడుమ జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది.