Don't Miss!
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
హీరో బాలకృష్ణను వదలని శ్రీరెడ్డి.. మీ నోర్లు పడిపోయినియ్యా అంటూ కామెంట్!
Recommended Video
శ్రీ రెడ్డి మరోసారి తనదైన శైలిలో కామెంట్స్ చేసింది. అయితే ఈసారి బాలయ్యను టార్గెట్ చేసింది. వివరాల్లోకి వెళ్ళితే... నిన్న బాలయ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడిని ఉద్దేశించి కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేసారు. అసభ్య పదజాలం ఉపయోగిస్తూ మాట్లాడిన మాటలు దుమారం లేపాయి. ఈ మాటలను పట్టుకొని శ్రీ రెడ్డి... నేను అంటే అన్నాను అంటారు, మరి బాలయ్య మాట్లాడిన మాటలు పట్టించుకోరా అని ప్రశ్నించింది.
|
నెటిజన్లకు శ్రీ రెడ్డి సవాల్..
ఈ రోజు బాలయ్య బాబు స్పీచ్ ఎంత మంది విన్నారు ?? ఎంత పద్దతిగా, అసలు ఏ మాత్రం బూతులు లేకుండా ఉంది కదా !! నన్ను మాత్రం ఒంటరి ఆడ పిల్లని అని మీ నోటికొచ్చినట్లు తిట్టారు కదా, ఇప్పుడు మీ నోర్లు పడిపోయినియ్య ?? అంటూ ట్విట్టర్లో స్పందించింది.
|
మెగా హీరోలకు నేను పెద్ద అభిమానిని...
ఈ రోజు స్పందించినట్లు మెగా ఫ్యామిలీ ఎప్పుడో స్పందించి ఉంటే చాలా హుందాగా ఉండేది, ఏది ఏమైనా రామ్ చరణ్, అల్లు అర్జున్ కి నేను వీరాభిమానిని అని శ్రీరెడ్డి ట్వీట్ చేసింది.
|
పవన్ తల్లికి నా క్షమాపణలు...
పవన్ కళ్యాణ్ అమ్మ గారికి నా శిరస్సు వంచి పది లక్షల సాష్టాంగనమస్కారాలు. నన్ను క్షమించండి అమ్మ, మీ చెప్పుతో కొట్టండి నన్ను కానీ సినీ పెద్దలకు మిమ్మల్ని అంటే గాని అర్ధం కాలేదమ్మా ఈ ఒంటరి ఆడ పిల్ల బాధ, మీ ఫోటో చూసి పది లక్షల సార్లు క్షమించమని వేడుకున్నా అమ్మ !
లీగల్ కేసులు పెరుగుతాయి..
నా పర్సనల్ లైఫ్ మీద అబద్దాలతో కూడిన ప్రచారం చేస్తున్నా వారికి లీగల్ కేసులు పెరుగుతాయి. వెంటనే వీడియోలు తీయించుకోకపోతే బాగుండు. నేను ఇక దీనిపై మాట్లాడను. ఆల్రెడి కేసులు ఉన్నాయి మీ పైనా. నన్ను వేధించడం ఆపండి అని శ్రీరెడ్డి ఫేస్బుక్లో స్పందించింది.