twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో బాలకృష్ణ‌ను వదలని శ్రీరెడ్డి.. మీ నోర్లు పడిపోయినియ్యా అంటూ కామెంట్!

    |

    Recommended Video

    ఆ విషయం లో మరి ఆయన చేసిందేమిటి?? | Filmibeat Telugu

    శ్రీ రెడ్డి మరోసారి తనదైన శైలిలో కామెంట్స్ చేసింది. అయితే ఈసారి బాలయ్యను టార్గెట్ చేసింది. వివరాల్లోకి వెళ్ళితే... నిన్న బాలయ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడిని ఉద్దేశించి కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేసారు. అసభ్య పదజాలం ఉపయోగిస్తూ మాట్లాడిన మాటలు దుమారం లేపాయి. ఈ మాటలను పట్టుకొని శ్రీ రెడ్డి... నేను అంటే అన్నాను అంటారు, మరి బాలయ్య మాట్లాడిన మాటలు పట్టించుకోరా అని ప్రశ్నించింది.

    నెటిజన్లకు శ్రీ రెడ్డి సవాల్..

    ఈ రోజు బాలయ్య బాబు స్పీచ్ ఎంత మంది విన్నారు ?? ఎంత పద్దతిగా, అసలు ఏ మాత్రం బూతులు లేకుండా ఉంది కదా !! నన్ను మాత్రం ఒంటరి ఆడ పిల్లని అని మీ నోటికొచ్చినట్లు తిట్టారు కదా, ఇప్పుడు మీ నోర్లు పడిపోయినియ్య ?? అంటూ ట్విట్టర్‌లో స్పందించింది.

    మెగా హీరోలకు నేను పెద్ద అభిమానిని...

    ఈ రోజు స్పందించినట్లు మెగా ఫ్యామిలీ ఎప్పుడో స్పందించి ఉంటే చాలా హుందాగా ఉండేది, ఏది ఏమైనా రామ్ చరణ్, అల్లు అర్జున్ కి నేను వీరాభిమానిని అని శ్రీరెడ్డి ట్వీట్ చేసింది.

    పవన్ తల్లికి నా క్షమాపణలు...

    పవన్ కళ్యాణ్ అమ్మ గారికి నా శిరస్సు వంచి పది లక్షల సాష్టాంగనమస్కారాలు. నన్ను క్షమించండి అమ్మ, మీ చెప్పుతో కొట్టండి నన్ను కానీ సినీ పెద్దలకు మిమ్మల్ని అంటే గాని అర్ధం కాలేదమ్మా ఈ ఒంటరి ఆడ పిల్ల బాధ, మీ ఫోటో చూసి పది లక్షల సార్లు క్షమించమని వేడుకున్నా అమ్మ !

    లీగల్ కేసులు పెరుగుతాయి..

    నా పర్సనల్ లైఫ్ మీద అబద్దాలతో కూడిన ప్రచారం చేస్తున్నా వారికి లీగల్ కేసులు పెరుగుతాయి. వెంటనే వీడియోలు తీయించుకోకపోతే బాగుండు. నేను ఇక దీనిపై మాట్లాడను. ఆల్రెడి కేసులు ఉన్నాయి మీ పైనా. నన్ను వేధించడం ఆపండి అని శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో స్పందించింది.

    English summary
    Even after Sri Reddy and Ram Gopal Varma had apologized to Pawan Kalyan for an abusive rant against him and his mother on national television, latest she spoke some sensational comments about balakrishna
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X