ఇదో ఫ్యామిలీ డ్రామా.. లెజెండ్ పగ తీర్చుకుంటున్నాడు.. చిరు, పవన్‌లపై శ్రీరెడ్డి టార్గెట్

క్యాస్టింగ్ కౌచ్, మీటూ అంటూ టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించింది శ్రీరెడ్డి. దగ్గుబాటి అభిరామ్, నాని వంటి వారిపై ఆరోపణలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆపై ఫిల్మ్ ఛాంబర్ ఎదుట నగ్న ప్రదర్శన చేసి అందరినీ షాక్‌కు గురి చేసింది. పవన్ కళ్యాణ్‌పై అసభ్యకర మాటలు వదలడం, ధూషించడంతో కథ అంతా మారిపోయింది. దీంతో దెబ్బకు మూటాముళ్ల సర్దుకుని కోలీవుడ్‌కు చెక్కేసింది. అయితే మధ్యలో కొన్ని రోజలు సైలెంట్‌గా ఉన్న శ్రీ రెడ్డి.. మళ్లీ పుంజుకుంది నోటికి పని చెబుతోంది.

యాక్టివ్ అయిన శ్రీ రెడ్డి..

యాక్టివ్ అయిన శ్రీ రెడ్డి..

కోలీవుడ్‌లో సెటిలైన శ్రీ రెడ్డి.. అడపాదడపా ఆఫర్లు దక్కించుకుంటూ తన పని తాను చేసుకుంటూ పోతోంది. యూట్యూబ్‌లో వంటల ప్రోగ్రామ్ చేసుకుంటూ వివాదాలకు దూరంగా ఉండసాగింది. అయితే ఆ మధ్య చిరంజీవి, రీసెంట్‌గా రాకేష్ మాస్టర్ శ్రీ రెడ్డి గురించి ప్రస్తావించడంతో మరింత రెచ్చిపోయింది.

బిగ్‌బాస్ ఫైనల్‌లో..

బిగ్‌బాస్ ఫైనల్‌లో..

బిగ్ బాస్ మూడో సీజన్ ఫైనల్ ఎపిసోడ్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంటెస్టెంట్లందర్నీ పలకరిస్తూ.. తమన్నా సింహాద్రి గురించి చెప్పుకొచ్చాడు. ఆమె గురించి గొప్పగా చెప్పే క్రమంలో శ్రీ రెడ్డిపై కౌంటర్స్ వేశాడు. అక్కడితో చిరును టార్గెట్ చేస్తూ వచ్చింది శ్రీ రెడ్డి.

జనసేన ఆవిర్భావ సభలోనూ..

జనసేన ఆవిర్భావ సభలోనూ..

అయితే పవన్ కళ్యాణ్, చిరంజీవిపై శ్రీ రెడ్డి ఎన్ని కామెంట్స్ చేసినా, ఎంతటి ఘాట పదజాలాన్ని వాడినా.. వారెప్పుడు శ్రీ రెడ్డి గురించి ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు. ఈ మధ్య జనసేన ఆవిర్భావసభలోనూ శ్రీరెడ్డిని పరోక్షంగానే ప్రస్థావించాడు పవన్ కళ్యాణ్. ఆ సమయంలోనూ శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసింది.

Recommended Video

Sri Reddy Comments On Amala Paul About Bhavninder Singh
చిరు పగబడుతున్నాడట..

చిరు పగబడుతున్నాడట..

‘పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కావడం వల్ల పగ తీర్చుకోవడం లేదేమో గానీ.. లెజెండ్ అయిన చిరంజీవి మాత్రం నా మీద పగ తీర్చుకుంటున్నాడు.. ఇదంతా ఫ్యామిలీ డ్రామా' అంటూ సెన్సేషనల్ పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X