For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందులో మరోసారి వేలుపెట్టిన శ్రీ రెడ్డి.. నరేష్ నువ్వు అంటూ సంచలన కామెంట్స్

    |

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌‌ (మా)లో రగులుతున్న వివాదాలు రోజు రోజుకు ముదిరిపోతున్నాయి. ప్రస్తుతం మా అసోసియేషన్‌‌ అధ్యక్షుడుగా నరేష్‌పై అదే 'మా'కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న రాజశేఖర్, సెక్రటరీగా ఉన్న జీవిత విరుచుకు పడుతుండటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. తాజాగా ఈ ఇష్యూలోకి శ్రీ రెడ్డి కూడా ఎంటరై కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. వివరాల్లోకి పోతే..

    మా సభ్యుల మధ్య విబేధాలు

    మా సభ్యుల మధ్య విబేధాలు

    మా ఫండ్స్‌కు సంబంధించి మా సభ్యుల మధ్య విబేధాలు తలెత్తాయి. గత 9 నెలలుగా మాలో ఏం జరుగుతుంది ? ఎంత ఫండ్ వచ్చింది? మా నుంచి ఎలాంటి ఈవెంట్లు జరుగుతున్నాయి అనే దానిపై జీవిత, రాజశేఖర్ అనుమానాలు వ్యక్తం చేస్తుండటం.. ఈ ఇష్యూ రోజు రోజుకూ మరింత పెద్దది కావడం సినీ వర్గాల్లో అలజడి సృష్టిస్తోంది.

    నరేష్ తీరు.. జీవితరాజశేఖర్

    నరేష్ తీరు.. జీవితరాజశేఖర్

    ఈ మేరకు జీవితరాజశేఖర్ ఫ్రెండ్లీ సమావేశం ఏర్పాటు చేసి అందరికీ ఆహ్వానం పంపారు. ఈ సమావేశానికి నరేష్ మినహాయిస్తే.. మిగిలిన మా సభ్యులు హాజరయ్యారు. దీంతో మా ఫ్రెండ్లీ సమావేశానికి నరేష్ గైర్హాజరు కావడంపై జీవిత, రాజశేఖర్, హేమ తదితరులు తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. నరేష్ తీరును తప్పుబడుతున్నారు.

    నరేష్ గందరగోళం.. ఎందుకు తప్పించు కుంటున్నారు

    నరేష్ గందరగోళం.. ఎందుకు తప్పించు కుంటున్నారు

    ఇకపోతే ఈ సమావేశాన్ని అడ్డుకోవడానికి అధ్యక్షుడు నరేష్ చాలా రకాలుగా ప్రయత్నించారని, ఆ సమావేశం ఎందుకు జరిగిందో తెలుసా అంటూ గందరగోళం సృష్టిస్తున్నారని జీవిత మండిపడింది. మా సంఘానికి ఎలాంటి చెడు జరిగినా.. లేదా భంగం కలిగినా ప్రాణాలిస్తామని చెప్పిన నరేష్ ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారని జీవితా రాజశేఖర్ అంటుండటం చర్చనీయాంశంగా మారింది.

    ఇంతలో ఎంటరైన శ్రీ రెడ్డి

    ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే ఇందులో సంచలన తార శ్రీ రెడ్డి తల దూర్చడం మరింత సెన్సేషన్‌గా మారింది. గతంలో ఆమె చేసిన కాస్టింగ్ కౌచ్ పోరాటంలో 'మా'ను కూడా లాగి పెద్ద దుమారం రేపుతూ ఫిలిం చాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు ఫేస్‌బుక్ వేదికగా మా వివాదంలో వేలుపెట్టింది శ్రీ రెడ్డి.

    Sri Reddy Open Offer Goes Viral || మొత్తం వాళ్ళకే ఇచ్చేస్తా
     నరేష్ నువ్వు అంటూ.. శ్రీ రెడ్డి

    నరేష్ నువ్వు అంటూ.. శ్రీ రెడ్డి

    ''నరేష్ సగం గోసి నువ్వే విప్పేసుకున్నావ్. సగం గోసి మా మెంబర్స్ లాగేశారు'' అంటూ తనదైన కోణంలో పంచ్ వేసింది శ్రీ రెడ్డి. దీంతో ఆమె చేసిన ఈ పోస్ట్ పై మిశ్రమంగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. 'మా' లో ఈ వివాదం ఇలాగే కొనసాగితే ఇంకెంత దూరం వెళుతుందో మరి!.

    English summary
    Once again controversy took place in MAA. VK Naresh questions committee. Now Sri Reddy enter into this issue and puts her comment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X