twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఆ పార్ట్‌లో రోగం: నటి శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

    |

    కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేర్లలో శ్రీరెడ్డి ఒకటి. హీరోయిన్‌గా తెలుగు వాళ్లకు పరిచయం అయిన ఈ బ్యూటీ.. కాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. అదే సమయంలో నగ్న నిరసన కారణంగా దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది. అప్పటి నుంచి ఎవరో ఒకరి మీద టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతోన్న ఈమె.. కొద్ది రోజులుగా పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణంరాజు మీద ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే తరచూ ఆయనపై విమర్శలు చేస్తోంది. తాజాగా ఆ ఎంపీపై వివాదాస్పద కామెంట్లు చేసింది. ఆ వివరాలు మీకోసం!

    అలా మొదలైన కెరీర్.. వివాదాలతో హైలైట్

    అలా మొదలైన కెరీర్.. వివాదాలతో హైలైట్

    శ్రీరెడ్డి కెరీర్ ఆరంభంలో ఓ న్యూస్ చానెల్‌లో ప్రజెంటర్‌గా పని చేసింది. ఆ తర్వాత 'నేను నాన్న అబద్ధం' అనే మూవీతో హీరోయిన్‌గా మారింది. ఆ వెంటనే 'అరవింద్ 2', 'జిందగీ' తదితర సినిమాల్లో లీడ్ రోల్ చేసింది. అయినప్పటికీ ఆమెకు అంతగా గుర్తింపు మాత్రం దక్కలేదు. దీంతో సినిమా అవకాశాలు కూడా సన్నగిల్లాయి. అప్పటి నుంచి ఏదో ఒక వివాదంలో ఉంటూ హైలైట్ అవుతోంది.

    వైసీపీ మీద ఆయన... ఆయన మీద శ్రీరెడ్డి

    వైసీపీ మీద ఆయన... ఆయన మీద శ్రీరెడ్డి

    నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేసి గెలుపొందారు. అయితే, కొన్ని నెలలుగా ఆయన సొంతం పార్టీ అధిష్టానం పైనే ఎదురు తిరిగారు. అదే సమయంలో ముఖ్యమంత్రితో పాటు పలువురు నేతలపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీరెడ్డి.. రఘురామ కృష్ణంరాజును టార్గెట్ చేసింది. ఆయనపై వరుస పోస్టులు పెడుతోంది.

    ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బ్యూటీ

    ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బ్యూటీ

    కొన్ని రోజుల క్రితం ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఉద్దేశించి శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసింది. 'విగ్గురాజు.. ఏంట్రా రెచ్చిపోతున్నావు? నేను రంగంలోకి దిగానంటే తట్టుకోలేవు. నేను వస్తున్నా ఆగరా నీ పని చెబుతా' అంటూ రాయడానికి వీలులేని బూతులను తిట్టింది. ఈ మేరకు కొన్ని వీడియోలను కూడా తన ఫేస్‌బుక్ ఖాతాలో విడుదల చేసింది. దీంతో మరో వివాదం రాజుకుంది.

    బ్లూఫిల్మ్‌లు తీసుకుంటూ పోయే దేవతవు

    బ్లూఫిల్మ్‌లు తీసుకుంటూ పోయే దేవతవు

    శ్రీరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను కూడా వదిలారు. అందులో 'ఓ కులానికి వత్తాసు పలుకుతూ నన్ను తిడుతోన్న బ్లూఫిల్మ్ నటి.. నువ్వు వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని నన్ను తిట్టడానికి వచ్చావు. ఆ కులం వాళ్లకు నువ్వో శృంగార దేవతలా మారావు' అంటూ శ్రీరెడ్డిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

    రఘురామ కృష్ణంరాజు అరెస్ట్.. శ్రీరెడ్డి పోస్ట్

    రఘురామ కృష్ణంరాజు అరెస్ట్.. శ్రీరెడ్డి పోస్ట్

    రెండు రోజుల క్రితం ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఉన్న ఆయన నివాసానికి వచ్చి మరీ ఏపీకి తీసుకెళ్లారు పోలీసులు. దీనిపై శ్రీరెడ్డి సంతోషం వ్యక్తం చేస్తూ వరుసగా పోస్టులు చేస్తోంది. 'ఒక వికెట్ డౌన్ అయిందని.. విగ్గురాజుకు తగిన శాస్తి జరిగిందని' అంటూ కొన్ని వీడియోలను సైతం షేర్ చేసిందీ బ్యూటీ.

    ఏపీ హైకోర్టులో ఎంపీ.. పోలీసులపై ఫిర్యాదు

    ఏపీ హైకోర్టులో ఎంపీ.. పోలీసులపై ఫిర్యాదు

    శనివారం ఎంపీ రఘురామ కృష్ణంరాజును పోలీసులు ఏపీ హైకోర్టులో హాజరు పరిచారు. ఆ సమయంలో ఆయనకు సంబంధించిన కేసులపై విచారణ జరిగింది. ఇక, చివర్లో తనను కస్టడీలో ఉంచిన సమయంలో పోలీసులు కొట్టారని ఆరోపిస్తూ రఘురామ కోర్టులో కేసు వేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన న్యాయస్థానం ఆయనకు వైద్య పరీక్షలు జరిపేందుకు ఓ కమిటీని కూడా నియమించింది.

    రఘురామ కృష్ణంరాజుకు ఆ పార్ట్‌లో రోగం

    రఘురామ కృష్ణంరాజుకు ఆ పార్ట్‌లో రోగం

    రఘురామ కృష్ణంరాజు కాళ్లకు గాయాలు ఉన్నట్లు చూపిన ఫొటోలను తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేసిన శ్రీరెడ్డి.. ఆయన చెప్పేది అబద్ధమని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేసింది. అందులో 'ఎంపీకి ఒంటి నిండా రోగాలే ఉన్నాయి. కాళ్లకు కూడా ఓ రోగం వల్ల అలా కందిపోయాయి. అవి పోలీసులు కొట్టిన దెబ్బలు కాదు. వృషణాల్లో కూడా జబ్బు ఉంది' అని పేర్కొంది.

    English summary
    Tollywood Actress Sri Reddy Sensational Comments on Mp Raghurama Krishnam Raju in Her Facebook Account.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X