నానిపై శ్రీరెడ్డి ఆరోపణలు: బిగ్‌బాస్ రాకుండా తొక్కేశాడు, సాయి పల్లవిని కూడా....

By Bojja Kumar

హీరో నాని మీద శ్రీరెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ..... బిగ్‌బాస్ ఆఫర్ ఫైనల్ అయిన తర్వాత కూడా రాజకీయాలు చేసి నాకు ఛాన్స్ దక్కకుండా చేశాడని ఆమె మండి పడ్డారు. గతంలో నన్ను సినిమా అవకాశాలు ఇప్పిస్తానని సెక్సువల్‌గా వాడుకున్నాడని, ఇపుడు బిగ్ బాస్ లాంటి అవకాశాలు కూడా రాకుండా చేస్తూ తొక్కేస్తున్నాడని తెలిపారు. హీరోయిన్ సాయి పల్లవిని కూడా నాని ఇబ్బంది పెట్టాడని, పైకి కనిపించేంత మంచోడు కాదని, కులం సపోర్టుతోనే నాని ఈ స్థాయికి ఎదిగాడని అన్నారు.

Recommended Video

Sri Reddy Comments About Actor Nani's Personal Life
నన్ను బిగ్‌బాస్ కోసం ఫైనల్ చేస్తున్నట్లు చెప్పారు

నన్ను బిగ్‌బాస్ కోసం ఫైనల్ చేస్తున్నట్లు చెప్పారు

బిగ్ బాస్ 2 సెలక్షన్స్ జరుగుతున్నపుడే నాకు నిర్వాహకులు కాల్ చేశారు. కొన్ని ప్రశ్నలు అడిన తర్వాత నన్ను ఫైనల్ చేస్తున్నట్లు చెప్పారు. చాలా మందికి మీ గురించి వ్యక్తిగతంగా తెలియదు. మీ బిహేవియర్ తెలియదు. మీరు పొగరుబోతు అని చాలా మంది అంనుకుంటారు. మీకు వస్తే మీ నిజమైన వ్యక్తిత్వం ఏమిటో తెలుస్తుందని చెప్పి నిర్వాహకులు చెప్పడంతో నేను కూడా చాలా సంతోషంగా ఫీలయ్యాను.... అని శ్రీరెడ్డి తెలిపారు.

నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి

నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి

మూడు నెలల నుండి పని లేకుండా ఖాళీగా ఉన్నాను. నాకూ ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్స్ మీద కాన్సట్రేట్ చేయకపోతే నాకు కూడా కష్టమే. అందుకే బిగ్ బాస్ చేద్దామని అనుకున్నాను. కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పట్లో దారికొచ్చేది కాదు. ఉద్యమాల నేపథ్యంలో బిగ్ బాస్‌కు వెళదామా? వద్దా? అనే డైలమా అయితే ఉండేది. బిగ్ బాస్ వారు నన్ను 99.9 శాతం ఫైనల్ చేసినట్లు చెప్పడంతో ఆర్థిక సమస్యలైనా తీరుతాయని వెళదామని డిసైడ్ అయ్యాను, ప్రజలందరూ కూడా నేను బిగ్ బాస్ షోకు వస్తానని ఆశించారు.... కానీ చివరి నమిషంలో నాకు ఛాన్స్ లేదని చెప్పారు అని శ్రీరెడ్డి తెలిపారు.

నాని నాకు బిగ్ బాస్ ఆఫర్ రాకుండా చేశాడు

నాని నాకు బిగ్ బాస్ ఆఫర్ రాకుండా చేశాడు

ఎందుకు తీసుకోవడం లేదని బిగ్ బాస్ నిర్వాహకులను కాంటాక్టు చేసినపుడు కొన్ని పాలిటిక్స్ జరిగాయి, ఈ సారి మీకు ఛాన్స్ ఇవ్వడం లేదు, తర్వాత సీజన్లో చూస్తాం అన్నట్లుగా మాట్లాడారు. ఆ రాజకీయాలు ఏమిటి? అని ఆరా తీస్తే నాని నన్ను వద్దు అని చెప్పినట్లు తెలిసింది.... అని శ్రీరెడ్డి వెల్లడించారు.

అప్పటి నుండే నాని పరిచయం

అప్పటి నుండే నాని పరిచయం

నానికి రెండు మూడు సినిమాలు హిట్స్ ఉన్నపుడు ఉప్పలపాటి రవి, నాని పరిచయం అయ్యారు. ఉప్పలపాటి రవి అనే వ్యక్తి ఒక ప్రొడ్యూసర్. ఇది ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇందులో డ్రగ్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. నాకు తెలుసు ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటారో. దాని గురించి తొందరలోనే మాట్లాడతాను. అయితే నాని డ్రగ్స్ తీసుకుంటాడని మాత్రం నేను అనను. దీని గురించి తర్వాత మాట్లాడతాను అని శ్రీరెడ్డి తెలిపారు.

ఆఫర్లు అని చెప్పి సెక్సువల్‌గా వాడుకున్నాడు

ఆఫర్లు అని చెప్పి సెక్సువల్‌గా వాడుకున్నాడు

నాని పరిచయమైన తర్వాత మా ఇంటికి వచ్చేవాడు. ఇద్దరం కలిసి బయటకు వెళ్లేవారం. అలా పరిచయం అయిన నాని ఉప్పలపాటి రవి తీసే నెక్ట్స్ మూవీలో అవకాశం ఇప్పిస్తానని, అది కాక పోయినా తర్వాత సినిమాలో సెకండ్ లీడ్ గా అయినా పెట్టిస్తానని ప్రామిస్ చేశాడు. ఆ టైమ్‌లో నాని వేరొకరితో లవ్‌లో ఉన్నాడని తెలుసు. అయినా రెగ్యులర్‌గా రావడం, నాతో చనువు తీసుకోవడం, సినిమా ఆఫర్లు అని చెప్పి సెక్సువల్‌గా వాడుకోవడం చేసేవాడు.... అని శ్రీరెడ్డి తెలిపారు.

నాని గురించి చెప్పడానికి అందుకే భయపడ్డాను

నాని గురించి చెప్పడానికి అందుకే భయపడ్డాను

నాని విషయం ముందు నేను చెప్పడానికి భయపడ్డాను. కానీ మా లాయర్‌ను అడిగినపుడు నీకు ప్రాపర్‌గా ఆధారాలు ఉండాల్సిన అవసరం లేదు. ఒక వేళ సంఘటన నిజమైతే నిజ నిర్దారణ ఎలా చేయాలి అనేది కోర్టు చూసుకుంటుంది. నీకు జరిగిన అన్యాయాన్ని కోర్టుకు చెప్పుకోవచ్చు అన్నారు. అప్పటి నుండి ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పడానికి ధైర్యం వచ్చింది.... అని శ్రీరెడ్డి తెలిపారు.

నేను ఇష్టంతో చేయలేదు, కెరీర్ కోసం చేశాను

నేను ఇష్టంతో చేయలేదు, కెరీర్ కోసం చేశాను

ఆ సమయంలో రోడ్ నెం. 1లోని కరాచీ బేకరీ వెనకాల ఉండేదాన్ని. నా ఇంటికి నాని వచ్చేవాడు. సినిమాలో ఆఫర్లు అని చెప్పి నాతో చనువు తీసుకునేవాడు. అప్పటికి నేను ఒకే ఒక సినిమా కంప్లీట్ చేసుకుని ఉన్నాను. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు లేని పరిస్థితుల్లో అందులోనూ నాని పక్కన అంటే ఎంతో కొంత ఆశ ఉంటుంది. నేనూ అవకాశం వస్తుందని ఆశ పడ్డాను. అతడితో కలవడం నాకు ఇష్టమా? ఇష్టం లేదా? అనేది పక్కన పెట్టండి. ఆల్రెడీ ఆ అబ్బాయి లవ్‌లో ఉన్నపుడు ఏవిధంగా ఇష్టంతో ఆ పని చేస్తారు? ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడనా? నాకు నా కెరీర్ కావాలి, లవ్ అనేది లేదు. దానికి ఏం పేరు పెట్టాలి? దీన్ని మోసం అనాలా? ఇంకేం అనాలో తెలియదు. ఇలాంటి దాడులు ఇండస్ట్రీలో చాలా మందిపై జరుగుతున్నాయి.... అని శ్రీరెడ్డి తెలిపారు.

 కులం వల్లే నానికి అవకాశాలు

కులం వల్లే నానికి అవకాశాలు

ఇలాంటి దరిద్రులకు. వెధవలకు కూడా మంచి మంచి షోలు పడి ఇంకా సంపాదించుకుంటున్నారే తప్ప తెలుగు ఆడపిల్లలు అలాగే ఉండిపోతున్నారు. నాని లాంటి వారు పైకొస్తున్నారు. ఇక్కడ కుల రాజకీయాలు ఉంటాయి కాబట్టే ఇలాంటివి జరుగుతాయి. ఇండస్ట్రీలో రెండు కులాలు మాత్రమే ఉంటాయి. వారు తప్ప వేరొకరు పైకి రావడానికి అకాశం ఉండదు, ఒక వేళ వచ్చినా వారిని ఎంకరేజ్ చేసే వారు ఉండరు. నానికి కులాన్ని బట్టే అవకాశాలు వస్తున్నాయని అనుకుంటున్నాను.... అని శ్రీరెడ్డి తెలిపారు.

సాయి పల్లవిని కూడా ఇబ్బంది పెట్టాడు

సాయి పల్లవిని కూడా ఇబ్బంది పెట్టాడు

నాని డైరెక్టుగా సినిమాలో ఇన్వాల్వ్ అవుతాడు, హీరోయిన్ తో పాటు ఇతర ఆర్టిస్టుల ఎంపికలో కూడా అతడి ఇన్వాల్మెంట్ ఉంటుంది, దర్శకులను కూడా ఇబ్బంది పెడతాడు అనేది ఎప్పటి నుండో ఉంది. సాయి పల్లవిని కూడా సెట్లో ఇబ్బంది పెడితే బయటకు న్యూస్ కూడా వచ్చింది. నాని అనుకున్నంత బుద్దిమంతుడు అయితే కాదు. పైకి చాలా మంచి వాడిగా, డౌన్ టు ఎర్త్ అన్నట్లు యాక్ట్ చేస్తాడు. ..... అని శ్రీరెడ్డి తెలిపారు.

చరణ్, బన్నీలకు కూడా అంత యాటిట్యూడ్ ఉండదు

చరణ్, బన్నీలకు కూడా అంత యాటిట్యూడ్ ఉండదు

బేసికల్లీ నానికి చాలా యాటిట్యూడ్ ఉంటుంది. రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి వారికి కూడా అంత యాటిట్యూడ్ ఉండదు. రామ్ చరణ్ నిజంగా డౌన్ టు ఎర్త్ ఉంటారు. అందరితో చాలా బాగా మాట్లాడతారు. నిన్న మొన్న పైకిచ్చిన నానికి ఎంత యాటిట్యూడ్ ఉంటుంటో మీకు తెలియదు, ఎంత మంది ఆడపిల్లలను వాడుకున్నాడో తెలియదు, సాయి పల్లవి కూడా నాని నన్ను ఇరిటేట్ చేస్తున్నాడని, టార్చర్ చేస్తున్నాడని చాలా పెద్ద కంప్లయింట్ చేసింది..... అని శ్రీరెడ్డి తెలిపారు.

 ఇలా తొక్కేస్తే ఎలా బ్రతకాలి?

ఇలా తొక్కేస్తే ఎలా బ్రతకాలి?

నేను అవకాశాలు దక్కించుకుని... ఈఎంఐలకు డబ్బులైనా కట్టుకుందామనుకునే టైమ్‌లో బిగ్ బాస్ ఆఫర్ వస్తే కాలికింద వేసి తొక్కేశాడు. అపుడు ఎదిగే వయసులో నా జీవితాన్ని కాలికింద వేసి తొక్కేశాడు, ఇపుడు ఏదో ఆఫర్లు వస్తే కాలరాస్తున్నాడు. ఈ తొక్కుడు ఎన్ని సంవత్సరాలు? ఎన్ని రోజులని భరించాలి? ఈ కుల రాజకీయాలు ఎన్ని రోజులు భరించాలి? వచ్చిన అవకాశాలను కూడా కాల రాస్తే ఎలా బ్రతకాలి?.... అని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

నాని కొడుకు మీద ఒట్టేసి చెప్పమనండి

నాని కొడుకు మీద ఒట్టేసి చెప్పమనండి

నేను చేస్తున్న న్యాయ పోరాటంలో అన్ని కేసులు నేను గెలుస్తాననే అనుకుంటున్నాను. అందులో నాని కేసు కూడా ఒకటి ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఎంత మందిని ఇలా ఆశలు చూపించి నాశనం చేస్తారు? ఎంత కాలం అమ్మాయిల మానాలతో ఆడుకుంటారు? నాని కొడుకు మీద ఒట్టేసి చెప్పమనండి నేను ఆ అమ్మాయని ముట్టుకోలేదని, నా మాట విత్ డ్రా చేసుకుంటాను.... అని శ్రీరెడ్డి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X