మీ చెప్పుతో కొట్టండి.. ఆడపిల్ల బాధ అర్థం కాలేదా? మళ్లీ శ్రీరెడ్డి కామెంట్ల కలకలం

By Rajababu

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఆయన ఫ్యాన్స్‌పై వివాదాస్పద నటి శ్రీరెడ్డి ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. పవన్ తల్లిని ఉద్దేశించి చేసిన కామెంట్లపై ఆమె వివరణ ఇచ్చారు. తాను చేసింది తప్పేనని సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకొన్నది. పవన్ చేసిన ట్వీట్లపై కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఇంతకు శ్రీరెడ్డి చేసిన ట్వీట్లు ఏమిటంటే..

Recommended Video

ఆ విషయం లో మరి ఆయన చేసిందేమిటి?? | Filmibeat Telugu
 పది లక్షల నమస్కారాలు

పది లక్షల నమస్కారాలు

పవన్ కళ్యాణ్ అమ్మ గారికి నా శిరస్సు వంచి పది లక్షల సాష్టాంగనమస్కారాలు నన్ను క్షమించండి. అమ్మ, నన్ను మీ చెప్పుతో కొట్టండి. కానీ సినీ పెద్దలకు మిమ్మల్ని అంటే గాని ఈ ఒంటరి ఆడ పిల్ల బాధ అర్ధం కాలేదమ్మా. మీ ఫోటో చూసి పది లక్షల సార్లు క్షమించమని వేడుకున్నా అమ్మ అని శ్రీరెడ్డి ట్వీట్ చేసింది.

 ఏదేదో ఊహించుకుని సృష్టిస్తున్నారు

ఏదేదో ఊహించుకుని సృష్టిస్తున్నారు

పవన్ కళ్యాణ్ అన్న నేను స్టార్ట్ చేసిన ఈ ఉద్యమానికి ఎలాంటి రాజకీయ రంగు లేదు. ఇదంతా మీకు మీరు ఏదేదో ఊహించుకుని సృష్టించిందే. మీ ఊహల్లోంచి వచ్చినవే ఈ పాత్రలు, సన్నివేశాలు. మళ్లీ చెప్తున్నా టీవీ9, ఏబీఎన్, మహా ఛానెల్‌కు ఏ సంబంధం లేదు. మీ ట్వీట్స్ చూస్తుంటే చాలా జాలి వేస్తుంది అని శ్రీరెడ్డి ట్వీట్ చేసింది.

నలుగురికి మార్గదర్శం కావాలి

నలుగురికి మార్గదర్శం కావాలి

ఫాన్స్ అంటే జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి వుండి, ప్రజల సమస్యలకోసం పోరాడుతూ నలుగురికి మార్గదర్శం అవ్వాలి. అంతేగాని సహనం లేకుండా కార్లు పగలకొట్టడం కాదు. పవన్ కళ్యాణ్ గారికి ఫాన్స్ బలం అవ్వాలి కానీ బలహీనత కాకూడదు అని మరో ట్వీట్‌లో పేర్కొన్నది.

పోరాటానికి మీ మద్దతు ఇవ్వండి

పోరాటానికి మీ మద్దతు ఇవ్వండి

నిజాయితీకి మారుపేరు పవన్ కళ్యాణ్ ఫాన్స్. అలానే నిజాయితీగా తెలుగు అమ్మాయిల కోసం నేను చేస్తున్న ఈ పోరాటానికి మీ మద్దతు ఇస్తారని నా చిరకాల కోరిక అని శ్రీరెడ్డి ట్వీట్ ద్వారా వేడుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X