»   » శ్రీరెడ్డి సంచలన లీక్: వాడుకోవడం మా హక్కు అన్నాడు.. కోడలు కావాలని, నీ బతుకు ఎంత!

శ్రీరెడ్డి సంచలన లీక్: వాడుకోవడం మా హక్కు అన్నాడు.. కోడలు కావాలని, నీ బతుకు ఎంత!

Subscribe to Filmibeat Telugu

శ్రీరెడ్డి వివాదం టాలీవుడ్ ని కుదిపేస్తోంది. కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి పోరాటం చేస్తున్న నేపథ్యంలో శనివారం ఆమె ఫిలిం ఛాంబర్ ముందు అర్థ నగ్న నిరసన తెలపడంతో కొత్త వివాదం మొదలైంది. శ్రీరెడ్డి చర్యని మా ఆర్ట్ అసోసియేషన్ మెంబర్స్ అంతా ముక్త కంఠంతో ఖండించారు. శ్రీరెడ్డికి 'మా' లో మెంబర్ షిప్ ఇవ్వమని తేల్చేసిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి టాలీవుడ్ చిత్రాల్లో నటించకుండా కూడా బహిష్కరణ విధించారు. దీనికి శ్రీరెడ్డి కూడా ఘాటుగా స్పందించింది. టాలీవుడ్ మొత్తం ఏకమైనా తన పోరాటాన్ని అపనని అంటోంది. కాగా శ్రీరెడ్డి అర్థనగ్న నిరశనపై భిన్న స్పందన వస్తోంది. కొంత మంది శ్రీరెడ్డి చర్యని వ్యతిరేకిస్తుంటే మరికొంత మంది మద్దత్తు ప్రకటిస్తున్నారు.

Sri Reddy Exclusive Clothes Removing Video
ముక్తకంఠంతో ఖండించిన మా

ముక్తకంఠంతో ఖండించిన మా

శనివారం శ్రీరెడ్డి ఫిల్మ్ ఛాంబర్ ముందు నిలబడి అర్థనగ్నంగా తన నిరసన తెలియజేసింది. ఆమె చర్య ప్రస్తుతం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. శ్రీరెడ్డి అనూహ్య చర్యని మా సభ్యులు ముక్త కంఠంతో ఖండించారు. బట్టలూడదీసుకుంటే అవకాశాలు వస్తాయా అని ప్రశ్నించారు.

కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి పోరాటం

కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి పోరాటం

శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా టాలీవడ్ లో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ ఉందంతాలు, తెలుగు హీరోయిన్లకు అవాకాశాలు ఇవ్వకపోవడం వంటి అంశాల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తోంది.

అవకాశాలు ఇస్తే

అవకాశాలు ఇస్తే

శ్రీరెడ్డికి టాలీవడ్ లో మరెవ్వరూ అవకాశాలు ఇవ్వకుండా మా నిర్ణయం తీసుకుంది. ఎవరైనా శ్రీరెడ్డికి ఛాన్సులు ఇస్తే వారిపై చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది మా. మెంబర్ షిప్ కూడా ఇవ్వమని తేల్చేసింది. శ్రీరెడ్డి వివాదం గురించి మా సభ్యులైన శ్రీకాంత్, ఉత్తేజ్, శివాజీ రాజా మరియు హేమ వంటి నటులంతా మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే.

భిన్న స్పందన

భిన్న స్పందన

శ్రీరెడ్డి అర్థనగ్న ప్రదర్శనపై భిన్న స్పందన వస్తోంది. శ్రీరెడ్డి నిరసనకు బిజెవైఎం అధ్యక్షురాలు తుమ్మల పద్మ మద్దత్తు ఇచ్చారు. ఓ టివి ఛానల్ చర్చలో భాగంగా ఆమె శ్రీరెడ్డి చర్యని సమర్ధించారు.

వీరంతా అప్పుడు ఏమయ్యారు

వీరంతా అప్పుడు ఏమయ్యారు

శ్రీరెడ్డి అర్థ నగ్న ప్రదర్సన చేసిందని మా సభ్యులంతా మీడియా ముందుకు వచ్చారు. ఆమెకు సభ్యతం ఇవ్వమంటూ తేల్చారు. ఈ సభ్యులంతా రాంగోపాల్ వర్మ జీఎస్టీ చిత్రంలో మహిళని నగ్నంగా చూపించినప్పుడు ఏమయ్యారని ఆమె ప్రశ్నించారు.శ్రీరెడ్డికి సభ్యత్వం ఇవ్వకపోవడానికి వీరెవరు అంటూ నిలదీశారు.

చిన్న ఆర్టిస్టులకు అన్యాయం

చిన్న ఆర్టిస్టులకు అన్యాయం

ఉదయ్ కిరణ్ వంటి చిన్న ఆర్టిస్టులకు అన్యాయం జరిగినప్పుడు మా అసోసియేషన్ సభ్యలంతా ఎక్కడ ఉన్నారని తుమ్మల పద్మ అన్నారు. ఉదయ్ కిరణ్ కెరీర్ నాశనం కావడానికి పెద్ద స్టార్లు కారణం కాదా అని ఆమె ప్రశ్నించారు.

సంచలన లీక్ ఇచ్చిన శ్రీరెడ్డి

సంచలన లీక్ ఇచ్చిన శ్రీరెడ్డి

అదే టివి చర్చ కార్యక్రమంలో ఓ వ్యక్తి శ్రీరెడ్డిని ప్రశ్నించారు. ఇదే నిరసన మీకు అన్యాయం జరిగినప్పుడే ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించడంతో శ్రీరెడ్డి స్పందించింది. దేనికైనా ఓ సహనం, ఓపిక శ్రీరెడ్డి సంచలన విషయం వెల్లడించింది.

అందుకే పోరాటం

అందుకే పోరాటం

శ్రీరెడ్డి ఇప్పటికే టాలీవుడ్ లో కొందరి ప్రముఖుల గురించి లీకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సంచలనం వెల్లడించింది. టాలీవుడ్ లో ఓ పెద్ద కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి తనని వాడుకున్నాడని, అతడు మాట్లాడిన మాటలు భాదించడంతో పోరాటానికి దిగానని శ్రీరెడ్డి తెలిపింది.

అతడిచేతిలో మోసపోయాను

అతడిచేతిలో మోసపోయాను


ఓ పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి తనని వాడుకునట్లు శ్రీరెడ్డి వెల్లడించింది. ప్రేమ, పెళ్లి వంటి విషయాలతో అతడి వద్ద తాను మోసపోయానని శ్రీరెడ్డి వెల్లడించింది. మా ఇంటికి కోడలివి అయిపోయి ఆస్తి కొట్టేయాలనుకుంటున్నావా.. నీ స్థాయి ఏంటి, బతుకు ఏంటి అని అవమానించినట్లు శ్రీరెడ్డివెల్లడించింది.

వాడుకోవడం మా హక్కు అన్నాడు

వాడుకోవడం మా హక్కు అన్నాడు

ఇండస్ట్రీ ఆరంభం నుంచి మా తాత, తండ్రి మొదలుకుని ఏలుతున్నామని అతడు తనతో చెప్పినట్లు శ్రీరెడ్డి వెల్లడించింది. సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి చాలా మంది మహిళలు మా వద్దకు వస్తుంటారు. వాడుకోవడం మా హక్కు అని అతడు అన్న మాటలు భాదించినట్లు శ్రీరెడ్డి తెలిపింది.

English summary
Sri Reddy sensational comments on Tollywood top producer son. He was used me in the name of love says Sri Reddy
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X