For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Kathi Mahesh మృతిపై శ్రీరెడ్డి సంచలన పోస్ట్: మీ హీరో కూడా పోతాడు.. అప్పుడప్పుడు ఆ పని చేయండి అంటూ!

  |

  కొద్ది రోజుల క్రితం ప్రమాదానికి గురైన సినీ విమర్శకుడు, ప్రముఖ నటుడు కత్తి మహేశ్ శనివారం మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. దీంతో చాలా మంది సెలెబ్రిటీలు ఆయన మృతిపై సంతాపం తెలుపుతున్నారు. అదే సమయంలో కొందరు మాత్రం ఆయనను విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించింది. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో సంచలన వ్యాఖ్యలతో కూడిన పోస్ట్ చేసింది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీ అందరి కోసం!

   రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడి

  రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడి

  కత్తి మహేశ్ ప్రయాణిస్తోన్న కారు జూన్ 26న నెల్లూరు జిల్లాలోని హైవేపై ప్రమాదానికి గురైంది. సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల ఆయనకు గాయాలయ్యాయి. మొదట అతడిని స్థానికి ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి మహేశ్‌కు అక్కడి వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం పరిస్థితి విషమించి కన్నుమూశారు.

   సుదీర్ఘ ప్రయాణం... ప్రముఖుల సంతాపం

  సుదీర్ఘ ప్రయాణం... ప్రముఖుల సంతాపం

  ఫిల్మ్ జర్నలిస్టుగా కెరీర్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత రివ్యూ రైటర్‌గా గుర్తింపును తెచ్చుకున్నారు కత్తి మహేశ్. ఈ క్రమంలోనే సినీ దర్శకుడిగా, నటుడిగా ఎన్నో సినిమాలు చేశారు. ఇప్పుడు కూడా చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మరణం సినీ కుటుంబం విషాదాన్ని నింపింది. కత్తి మృతిపై ప్రముఖులంతా సంతాపం తెలుపుతున్నారు.

   కత్తి మృతితో సంబరాలు.. విమర్శలు చేస్తూ

  కత్తి మృతితో సంబరాలు.. విమర్శలు చేస్తూ

  కత్తి మహేశ్ గతంలో ఎన్నో వివాదాల్లో భాగం అయ్యారు. శ్రీరాముడితో పాటు పలువరు సినీ ప్రముఖులను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇక, ఇప్పుడు ఆయన మరణించడంతో చాలా మంది ఔత్సాహికులు దీనిపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం మానవత్వం చూపించకుండా సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. దీంతో కత్తి మహేశ్ పేరు మారుమ్రోగుతోంది.

  తొలిసారి స్పందించిన శ్రీరెడ్డి.. సంచలన పోస్ట్

  తొలిసారి స్పందించిన శ్రీరెడ్డి.. సంచలన పోస్ట్

  కత్తి మహేశ్‌కు వివాదాస్పద నటి శ్రీరెడ్డికి మధ్య సత్సంబంధాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఆమె కాస్టింగ్ కౌచ్ ఉద్యమం సమయంలో ఆయన ఎంతగానో మద్దతు తెలిపారు. అలాగే, ఇద్దరూ కలిసి ఒకే వర్గాన్ని టార్గెట్ చేయడంతో బంధం మరింత బలపడింది. ఈ నేపథ్యంలో కత్తి మహేశ్ మరణంపై ఆమె తొలిసారి స్పందించింది. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో సంచలనమైన పోస్ట్ చేసింది.

  మీరు, మీ హీరో కూడా చచ్చిపోతారు అంటూ

  మీరు, మీ హీరో కూడా చచ్చిపోతారు అంటూ

  కత్తి మహేశ్ మరణించినా ఇంకా ఆయనపై ట్రోల్స్ చేస్తున్న వాళ్లపై నటి శ్రీరెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్ అయింది. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో 'అందరు వెనక, ముందు పోవాల్సిందే. కత్తి మహేష్ మరణాన్ని కూడా పండగలా చెప్పుకునే వాళ్ళకు, అపహాస్యం చేసేవాళ్ళకు ఇదే నా ఆన్సర్. రేపో ఎల్లుండో మీరు కూడా పోవాలి.. మీ హీరో కూడా పోతాడు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

  Recommended Video

  Swapnika Exclusive Interview Part 4 | Sarkaru Vaari Paata AD ​| Filmibeat Telugu
   అప్పుడప్పుడు ఆ పని చేయండని కామెంట్

  అప్పుడప్పుడు ఆ పని చేయండని కామెంట్

  ఇదే పోస్టులో శ్రీరెడ్డి మరిన్ని కామెంట్లు చేసింది. 'మీరేదో యుగపురుషులు లాగా ఎందుకురా ఫోజులు? అప్పుడప్పుడూ మీ బుర్రలను వాడుతూ ఉండండి. ఇప్పుడైతే ఆయన ఆత్మకు శాంతి చేకూరనివ్వండి' అని పేర్కొంది. శ్రీరెడ్డి చేసిన ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది. దీంతో చాలా మంది ఆమెకు అనుకూలంగా కామెంట్లను కూడా పెడుతున్నారు.

  English summary
  Tollywood Actor, film critic Kathi Mahesh Passesy Away in Chennai Hospital Saturday. Now Heroine Sri Reddy Did Sensational Post on His Death.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X