ఆ ఫొటో షేర్ చేసి సమంతపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు: అలా వ్యాపారం చేస్తుందంటూ పోస్ట్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ బాంబ్ పేల్చి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయింది ప్రముఖ నటి శ్రీరెడ్డి. ఆ తర్వాత తనకు సంబంధించిన కొన్ని ఫొటోలను లీక్ చేసి సినీ పరిశ్రమలో కలకలం రేపింది. అప్పటి నుంచి ఆమె పేరు తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. సోషల్ మీడియా వేదికగా ఎవరో ఒక సెలెబ్రిటీపై విమర్శలు చేస్తూ సంచలనం అవుతోందీ బ్యూటీ. ఈ క్రమంలోనే తాజాగా స్టార్ హీరోయిన్ అక్కినేని సమంతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, ఓ ఫొటోను సైతం షేర్ చేసింది. ఇంతకీ ఏం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా శ్రీరెడ్డి

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా శ్రీరెడ్డి

కాస్టింగ్ కౌచ్ వివాదంతో తెలుగు రాష్ట్రాల్లో హైలైట్ అయింది శ్రీరెడ్డి. అదే సమయంలో పలువురు సినీ పెద్దలపై తీవ్ర స్థాయిలో విరుచుకుని పడి కలకలం రేపింది. అప్పటి నుంచి ఈమె నిరంతరం ఏదో ఒక విధంగా హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఇవి మాత్రమే కాదు.. రాజకీయాలపైనా ఆమె ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే పలువురు నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేసింది.

హీరోలు, హీరోయిన్లనూ వదల్లేదు

హీరోలు, హీరోయిన్లనూ వదల్లేదు

తెలుగు సినీ ఇండస్ట్రీలోని కొంత మంది స్టార్ హీరోలు.. హీరోయిన్లపై శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. పేరున్న ఒక హీరో తనను బాగా వాడుకున్నాడని, ఆ తర్వాత భార్య కోసం తనను వదిలేశాడని సంచలన ఆరోపణలు చేసింది. అలాగే, కొందరు హీరోయిన్ల ఫిజిక్‌ పైనా కామెంట్లు చేసింది. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌నూ టార్గెట్ చేసి వరుస పోస్టులు పెట్టిందామె.

చేసేదేం లేక వాళ్లే వదిలిపెట్టేశారు

చేసేదేం లేక వాళ్లే వదిలిపెట్టేశారు

ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. సినీ పరిశ్రమలోని చాలా మందిపై శ్రీరెడ్డి ఇబ్బందికరమైన రీతిలో కామెంట్లు చేసింది. దీంతో కొంత మంది హీరోలు, హీరోయిన్ల అభిమానులు ఆమెపై ఫైర్ అయ్యారు. అదే సమయంలో ఆమెను ట్రోల్ చేస్తూ కామెంట్లు పెట్టారు. అప్పుడు మరింతగా రెచ్చిపోయిన శ్రీరెడ్డి వాళ్లందరిపై బూతలతో వీరంగం చేసింది. దీంతో వాళ్లంతా చేసేదేం లేక గమ్మునుండిపోయారు.

తీరు మారని శ్రీరెడ్డి.. హీరోయిన్లపై

తీరు మారని శ్రీరెడ్డి.. హీరోయిన్లపై

ఇక, ఈ మధ్య కొందరు హీరోయిన్ల పేర్లు ప్రస్తావిస్తూ తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంది శ్రీరెడ్డి. పాత కాలం నాటి హీరోయిన్లను ఇప్పటి వాళ్లను పోలుస్తూ అభ్యంతరకరమైన పోస్టులు చేసిన ఆమె.. ఇటీవల టాలీవుడ్‌లోని కొందరు స్టార్ హీరోయిన్లపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేసింది. ఇలా విమర్శిస్తూ రోజుకో పోస్ట్ పెడుతూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోందీ బోల్డ్ బ్యూటీ.

సామ్‌పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

సామ్‌పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

గతంలో శ్రీరెడ్డి టార్గెట్ చేసిన హీరోయిన్లలో అక్కినేని సమంత ఒకరు. బడా ఫ్యామిలీకి కోడలిగా ఉన్న ఆమెపై ఎన్నో సందర్భాల్లో కామెంట్లు చేసింది. అంతేకాదు, సామ్ ఫిజిక్ పైనా పలు వివాదాస్పద పోస్టులు పెట్టింది. దీంతో అక్కినేని అభిమానులు శ్రీరెడ్డిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో సమంతపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.

Recommended Video

Gatham Actress Poojitha About Her Acting Experience
అలా వ్యాపారం చేస్తుందంటూ పోస్ట్

అలా వ్యాపారం చేస్తుందంటూ పోస్ట్

ఇటీవల మాల్దీవుల్లో దిగిన ఓ బికినీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది సమంత. దాన్ని తన ఖాతాలో పోస్ట్ చేసిన శ్రీరెడ్డి ‘గాయ్స్.. ఈ ఫొటోను పూర్తిగా చూడండి. సమంతకు పెళ్లి అయిపోయింది. అయినప్పటికీ తన తర్వాత 100 తరాలకు సరిపడా డబ్బులు సంపాదించినా.. అందంతో వ్యాపారం చేయాలని ఎందుకు అనుకుంటోంది?' అని అందులో రాసుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X