శ్రీరెడ్డి మరో సంచలనం: ఎన్టీఆర్ ప్రస్తావన, ఆ ఫ్యామిలీ కులాభిమానం క్యాష్ చేసుకుంటోందంటూ...
కాస్టింగ్ కౌచ్, సినిమా పరిశ్రమలో తెలుగు వారికి ఎక్కువ అవకాశాలు అంశంపై పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి తాజాగా తన సోషల్ మీడియాలో ఓ సంచలన పోస్టు చేశారు. పేరు ప్రస్తావించకుండా సినిమా పరిశ్రమలో పాతుకుపోయిన ఫ్యామిలీని ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కులాభిమానాన్ని ఆ ఫ్యామిలీ క్యాష్ చేసుకుంటోందంటూ ఆరోపణలు గుప్పించారు.
Recommended Video

ఫాన్స్‌గా చెప్పుకుంటూ 'క్యాస్ట్ ప్రైడ్' తో కాలర్ ఎగరేసే చాలా మందిని చూసి జాలి వేసి తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నాను, ఇక ఏం చేయదలుచుకున్నారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ శ్రీరెడ్డి పేర్కొన్నారు. శ్రీరెడ్డి ఏ సినీ కుటుంబంపై ఈ వ్యాఖ్యలు చేశారో కింది మ్యాటర్ చదివితే మీకు అర్థమవుతుంది.

కులాభిమానం మెండుగా ఉండి అది తలకెక్కి...
దగ్గర దగ్గర 28 శాతం విస్తరించి ఉన్న ఒక సామాజిక వర్గం, కులాభిమానం మెండుగా ఉండి అది తలకెక్కి ఆ ఒక్క కుటుంబం బాగుంటే మేము బాగున్నట్టే అనుకొని ఒక పిచ్చి భ్రమ లో బతుకున్నారు.
మా కులంలో ఒక గొప్ప హీరో ఉన్నాడు, మిగిలిన ఇంకో సామజిక వర్గానికి ధీటైన పోటీ ఇచ్చాడు, మా పరువు నిలుపుతున్నాడు.... అనుకుంటూ ఒంటి మీద చొక్కా, కాలికి జోళ్ళు ఉన్నాయో లేదో చూసుకోకుండా 30 ఏళ్లుగా ఆ ఒక్క కుటుంబాన్ని మోస్తున్నారు... దీని వల్ల మీకు ఏం ఒరిగింది?.... అంటూ శ్రీరెడ్డి ప్రశ్నించారు.

వాళ్లు మేడల వరకు ఎదిగారు, మిమ్మల్ని గేటు దగ్గరే ఆపేశారు...
ఆ కుటుంబం అద్దె ఇంటి నుండి డాబాకి, ఆడ నుండి మేడలోకి ఆపై రాజ భవనం లాంటి ఇళ్ళలోకి మారి భుజాన మోస్తున్న మిమ్మల్ని గేటు దగ్గరే ఆపేశారు. అందులో మీకు వచ్చింది మా కులంలో ఒక పెద్ద హీరో ఉన్నాడు అని ఒక ఫాల్స్ 'క్యాస్ట్ ప్రైడ్' అంతే.... అని శ్రీరెడ్డి సూచించారు.

నీ రక్తం, నీ కళ్లు దానం చేస్తూ వారు పబ్లిసిటీ
కులాభిమానం వీక్నెస్‌ను ఆ కుటుంబం క్యాష్ చేస్కొని... ఆయన కుటుంబం నుండి ఇప్పటికి 8 మందిని హీరోస్‌ని చేసి మీ మీదకి వదిలాడు. మీకు వచ్చింది ఏం ఉంది అందులో ?? ఆ యబ్బి బ్లడ్ బ్యాంకు పెట్టి ....రక్తం నువ్వు ఇస్తే పబ్లిసిటీ తను చేస్కోన్నాడు..... ఐ బ్యాంకు పెట్టి కళ్ళు నువ్వు దానం చేస్తే ఆయన గొప్పతనం గా ప్రమోట్ చేస్కోన్నాడు ..! అందులో నీకు వచ్చింది ఏం ఉంది ?? అంటూ.... శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేశారు.

మీకు చేతిలో చిప్ప తప్ప ..!
ఆ తరువాత.....రాజకీయాల్లోకి వచ్చి నీ భుజాన పార్టి జెండా పెట్టి.... టికెట్స్ తను అమ్ముకొని సొమ్ము చేస్కోన్నాడు..... కొడుక్కి 'రోల్స్ రాయీస్' లాంటి ఖరీదైన కార్లు కొన్నాడు..... నీకు ఏం పెట్టాడు..... చేతిలో చిప్ప తప్ప ..... అంటూ శ్రీరెడ్డి పదునైన కామెంట్స్ చేశారు.

మీకు పార్టీ టికెట్స్ కూడా ఇవ్వలేదు
294లో ఒక పది టికెట్స్ అయినా 3 దశాబ్దాలుగా ఆయన్ని మోస్తున్న ఫాన్స్ ప్రెసిడెంట్స్‌కి అయినా ఇచ్చడా ?? లేదు డబ్బు సంచులతో ఎవడు వస్తే వాడికే ఇచ్చాడు. కలెక్షన్స్ బాగా దండుకొని అంత అయ్యాక పార్టి మూసేసి.... నన్ను అమాయకుణ్ణి చేసి ముంచేసారని మొసలి కన్నీళ్ళు కారిస్తే.....నువ్వు పెడ బొబ్బలు పెట్టావ్.... మా అన్న మంచోడు చుట్టూ చేరి ముంచేసారని ...... అంటూ శ్రీరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్ గారు అదే సినిమా ప్రపంచం నుండి వచ్చి...
ఎన్టీఆర్ గారు అదే సినిమా ప్రపంచం నుండి వచ్చి.... పార్టీ పెట్టి తన ఫాన్స్ ప్రెసిడెంట్స్‌గా ఉన్న శ్రీపతి రాజేశ్వర్, నెల్లూరు రమేష్ రెడ్డి, బి వి మోహన్ రెడ్డి...... లాంటి వాళ్ళకి టికెట్స్ ఇచ్చి గెలిపించి మంత్రుల్ని చేసాడు. మరి ప్రజలు లేని ఒక రాజ్యం అనే పార్టి పెట్టినా ఆ అన్న ఏం చేసాడు ??.... అని శ్రీరెడ్డి ప్రశ్నించారు.

ఎంత తెలివి అంటే ఒక బజారు మనిషి తనని తిడితే మా తల్లి ని తిట్టింది అని రచ్చ
ఇవ్వాళ తముడు..... ఇంకో పార్టి పెట్టి కొత్త అవతారం ఎత్తాడు. పార్టి పెట్టి ....పెట్టక ముందే ఒక మంచి ప్యాకేజీ కుదుర్చుకొని ప్రీ ప్రొడక్షన్ లో పార్టి ఉండగానే టేబుల్ ప్రాఫిట్ చూశాడు. మహా తెలివిగలోడు. ఎంత తెలివి అంటే ఒక బజారు మనిషి తనని తిడితే మా తల్లి ని తిట్టింది అని నిమ్మళంగా నాలుగు రోజులాగి దానిని రాజకీయం చేసి, మీడియా మీద బురద జల్లి దాంట్లో కొంచెం ప్రత్యర్ది పార్టికి పూసి తను పెట్టబోయే కొత్త ఛానల్ కి ప్రమోట్ చేస్కునేంత తెలివిగలోడు..... అటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.

ఆ కుటుంబం తప్పించి హీరోస్ అయ్యే అర్హత ఇంకెవరికి లేదా ?
అసలు చెప్పిన నిజాలు నీకు ఒప్పుకోవడానికి మనసొప్పదు..... సరే నేను ఒకటి అడుగుతా చెప్పు...... 30 ఏళ్లుగా నెం. 1 ఉంటూ సగానికి పైగా థియేటర్స్ కంట్రోల్ లో పెట్టుకొని సినిమా ఇండస్ట్రీ లో మకుటం లేని మహారాజు గా ఉన్న ఆ పెద్ద మనిషి... ఒక్క నటుడి నైనా మీ కులం లో నుండి హీరో గా రమ్మని గాని....... వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయడం గాని జరిగిందా ?? లేదు..... ఆయన కుటుంబం లోనే డజను మందిని దింపి .....నీ భుజాన మోపాడు. ఏం మీ కులం లో ఆ కుటుంబం తప్పించి హీరోస్ అయ్యే అర్హత ఇంకెవరికి లేదా ?? అంటూ శ్రీరెడ్డి ప్రశ్నించారు.

అదే సినిమా ప్రపంచంలో ఇంకో కులం కూడా ఉంది....
అదే సినిమా ప్రపంచంలో ఇంకో కులం కూడా ఉంది.... 3 శాతం కూడా లేని.....ఆ కులం నుండి 30 రకాల కుటుంబాలు బోలెడు డైరెక్టర్స్.......బొచ్చెడు మంది హీరోస్ ఉన్నారు. మరి 30 శాతం ఉన్న మీ కులం ఉండి ఆ కుటుంబం తప్పించి ఇంకోకళ్లని ఆ కుటుంబం ఎందుకు తీస్కు రావట్లేదు..... అదే వ్యాపారం అంటే మీ కులానికి తానే ప్రతినిధి ని అని చెప్పుకుంటూ చేసే మోనోపోలీ బిజినెస్ అది. ఏనాడైనా మీరు బాగా చదువుకుని బాగుపడండిరా....మా వెనక తిరగొద్దు ....అన్నారా? తెలుసుకో....... ఇప్పటికైనా కళ్ళు తెరువు....... టికెట్స్ కోసం సిగపట్లు పట్టి ......చిరిగినా చొక్కా తెగిన జోళ్ళు చూసుకో.... అంటూ శ్రీరెడ్డి సూచించే ప్రయత్నం చేశారు.

కులం మాటున చేసే ఆ బానిస మనస్తత్వం వదిలేయ్
కులం మాటున చేసే ఆ బానిస మనస్తత్వం వదిలి నీ గురించి నీ కుటుంబం గురించి ఆలోచించు..... ఒళ్ళు వంచి కష్టపడు అపుడు రిజర్వేషన్ అడగాల్సిన అవసరం కూడా ఉండదు. నిన్న కూడా సరిగ్గా వయసు కూడా రాని కుర్రోళ్ళు.....ఫాన్స్ పేరుతో....టీవీ వాహనాలు పగలగొట్టారు.....ఓ వ్యక్తిని....పోలీసు చొక్కా పట్టుకుని లాక్కెళ్లడం కూడా చూసాం....వాళ్ళు వచ్చారా? సమయం అంత ఆ కుటుంబం తీసిన సినిమాలు.....పెట్టిన పార్టీలు..... ఇచ్చిన పిలుపులకి స్పందిచటానికి ఖర్చు పెడితే నీ భార్య బిడ్డలకి ఏం తెచ్చి పెడతావ్......ఎలా పోషిస్తావ్ ??... అంటూ శ్రీరెడ్డి ప్రశ్నించారు. కొంతమంది నా ప్రాణ మిత్రులు...సోదరులు.... ఫాన్స్ గా చెప్పుకుంటూ 'క్యాస్ట్ ప్రైడ్' తో కాలర్ ఎగరేసే చాలా మందిని చూసి జాలి వేసి రాయాలి అనిపించి రాసా ..! ఇక ఏం చేయదలుచుకున్నారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా.... అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











