For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నువ్ నాకు ఒక ఆకుతో సమానమంటూ డైరెక్టర్ తేజపై ఫైర్.. వీడియోలో అలా చూపించేసిన శ్రీరెడ్డి!!

  |

  శ్రీ రెడ్డి మాట్లాడే మాటలు, చేసే పోస్ట్‌ల గురించి ప్రత్యేకంగా విడమరిచి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత ఘాటుగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఒక్కోసారి రాయడానికి కూడా వీల్లేనటువంటి భాషను, పదాలను వాడుతూ ఉంటుంది. తాజాగా అలాంటి ఓ నాటు వీడియోనే దర్శకుడు తేజ గురించి వదిలింది. ప్రస్తుతం ఆ వీడియో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఇందులో శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు, తేజను పోల్చిన విధానం మరీ దారుణంగా ఉంది.

  గతంలో అలా..

  గతంలో అలా..

  గతంలో ఓ సారి శ్రీరెడ్డి, అర్దనగ్న ప్రదర్శన, మీటూ ఉద్యమం, రామ్ గోపాల్ వర్మ జోక్యం గురించి దర్శకుడు స్పందించాడు. ఎవరు ఎంత చేసినా మా ఇండస్ట్రీని ఏమీ పీకలేరంటూ కాస్త ఘాటుగానే స్పందించాడు. ఆ సమయంలో తేజపైనా శ్రీరెడ్డి విరుచుకుపడింది. ఇలియానా, తాజ్ హోటల్ అంటూ తేజ పరువు తీసేసింది.

  మళ్లీ ఇలా..

  మళ్లీ ఇలా..

  తాజాగా మళ్లీ శ్రీరెడ్డి గురించి తేజ ఎక్కడో ఏదో మాట్లాడట అందుకే ఓ వీడియోను వదిలింది. శ్రీరెడ్డి షేర్ చేసిన వీడియోలో ఏముందంటే.. దర్శకుడు తేజా గారికి పెద్ద నమస్కారాలు.. మీరు బాగా అనుభవం ఉన్న డైరెక్టర్.. మేం స్కూల్‌కి వెళ్లే రోజుల్లోనే మీరు డైరెక్షన్ చేశారు. మీ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది.. మీరు కాంట్రవర్శీ డైరెక్టర్ కూడా.. అమ్మాయిల్ని కొడతారంట. అప్పట్నుంచే మీ మీద నాకు కోపం ఉండేది. అమ్మాయిల్ని కొట్టడం ఏంటి నాన్ సెన్స్ అంటూ ఫైర్ అయింది.

  అక్కడ చేతిని పెట్టుకుని..

  అక్కడ చేతిని పెట్టుకుని..

  ఒకప్పుడు నేను మీకు అభిమానిని.. మీ గురించి చాలా మంచిగా అనుకున్నా. అది వేరే కానీ.. తేజా గారూ!! మీరు యూట్యూబ్‌లో నాగురించి మాట్లాడిన కామెంట్స్ చూశా.. మీకు చాలా గౌరవంగా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే..మీరు నాకు అది అంటూ ప్రైవేట్ పార్ట్ దగ్గర చేయి పెట్టి ఓ సైగ చేసింది. వాటిని రాయడానికి కూడా కుదరలేనంత నాటుగా చెప్పేసింది శ్రీరెడ్డి.

  నాకు అధికారం ఉంది..

  నాకు అధికారం ఉంది..

  ఇంకెప్పుడూ నాకు వార్నింగ్ ఇవ్వడానికి ట్రై చేయకండి.. ఏ అమ్మాయితో అయినా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పులు పడతాయి. రెండు మూడు హిట్లు కొట్టినంత మాత్రాన నువ్వేం సంఘసంస్కర్తవేం కాదు.. నువ్వేం గొప్పోడివేం కాదు.. ఇండస్ట్రీ ఎవడిది అంటున్నావ్.. మరి నీదా?.. ఇండస్ట్రీ అందరిదీ.. తప్పులు జరుగుతున్నప్పుడు నాలాంటి అమ్మాయిలు ప్రశ్నించాలి. నేను ఒక న్యూస్ రిపోర్టర్‌గా న్యూస్ లీడర్‌గా ప్రశ్నించా.. నేను ఒక యాంకర్‌కి ప్రశ్నించడానికి అన్ని అధికారాలు ఉన్నాయంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది

  కిందా మీదా మూసుకో..

  కిందా మీదా మూసుకో..


  శ్రీరెడ్డో.. రామ్ గోపాల్ వర్మో అని అంటే.. వర్మ కాలికి కూడా సరిపోవు నువ్వు. నీ గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడాలని అనుకోవడం లేదు.. నువ్వు సురేష్ బాబుకి తొత్తువి. వాళ్ల ఆస్థాన డైరెక్టర్‌వి.. వాళ్లనేదో లేపాలని అనుకుంటావ్.. నువ్ లేవలేవు వాళ్లని లేపలేవు. కిందా మీదా అన్నీ మూసుకుని పని చూసుకో.. పో అంటూ శ్రీరెడ్డి ఘోరంగా మాట్లాడేసింది.

  English summary
  Sri reddy Sensational video on Director teja,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X