Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నేను మెచ్యూర్ కాకముందే చూసేశా.. శ్రీ రెడ్డి సెన్సేషనల్ వీడియో
సంచలన తార శ్రీ రెడ్డి మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో ద్వారా తన చిన్నప్పటి విశేషాలు, తనకు ఎదురైన లైంగిక ఘటనల గురించి తెలిపింది. దిశ ఎన్కౌంటర్ ఉదంతం గురించి మాట్లాడుతూ తనదైన రీతిలో కామెంట్స్ చేసింది. సమాజ పరిస్థితులపై విరుచుకు పడుతూ సంచలనం సృష్టించింది. ఆ వివరాలు చూద్దామా..
భారీ ఫాలోయింగ్.. కొత్తగా మరో అడుగు
సాధారణంగానే సోషల్ మీడియాలో శ్రీ రెడ్డి హంగామా మామూలుగా ఉండదనే సంగతి తెలిసిందే. దానికి తోడు ఏకంగా యూ ట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి వీడియోలు పోస్ట్ చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. ఈ మేరకు తనకున్న భారీ ఫాలోయింగ్‌కి క్యాచ్ చేసుకుంటూ సొమ్ము చేసుకుంటోంది.
దిశ నిందితుల ఎన్కౌంటర్.. శ్రీ రెడ్డి కామెంట్స్
దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇదే అంశంపై శ్రీ రెడ్డి కూడా తన స్పందన తెలిపింది. నలుగురు మృగాళ్లను కాల్చి చంపినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ తన జీవితంలో ఎదుర్కొన్న లైంగిక ఘటనల గురించి వివరించింది.
పోలీసులకు సలాం.. ఇది సరైందేనా ప్రశ్నించుకోండి
దిశ కేసులో నిందితులైన ఇలాంటి వాళ్లను చంపడమే కరెక్ట్ అంటూ పోలీసులకు సలాం కొట్టింది శ్రీ రెడ్డి. ఈ రోజున అమ్మాయిలు సమాజంలో కనీసం ధైర్యంగా తిరగలేకపోతున్నారంటే దానికి కారణం ఎవరో మీరే ఆలోచించుకోండి అంటూ శ్రీ రెడ్డి చెప్పుకొచ్చింది. మానవ మృగాళ్లలా తయారైన మీరంతా.. మిమ్మల్ని మీరు ఒక్కసారి ఇది సరైందేనా అని ప్రశ్నించుకోండి అని చెప్పింది శ్రీ రెడ్డి.
ఇంట్లో వాళ్ళు, సొంత బంధువులే లైంగికంగా
ఇక తాను కూడా చిన్నప్పటి నుంచి సెక్సువల్ హెరాజ్మెంట్స్ ఎదుర్కొంటూనే ఉన్నానని చెప్పుకొచ్చింది శ్రీ రెడ్డి. ఇంట్లో వాళ్ళు, సొంత బంధువులే తనను లైంగికంగా వేధించారని, ఎన్నోసార్లు తను మౌనంగా ఏడ్చానే తప్ప ఏమీ చేయలేకపోయానని చెప్పింది. చివరకు స్కూల్ టీచర్ కూడా తనను సెక్సువల్ హెరాజ్ చేశాడని శ్రీ రెడ్డి చెప్పుకొచ్చింది. వర్క్ ప్లేస్‌లో కూడా ఇదే పరిస్థితి అని, అందరూ తనను తాకరాని చోట్ల తాకారని, లైంగికంగా ఎన్నో ఇబ్బందులు పెట్టారని చెప్పుకొచ్చింది శ్రీ రెడ్డి.
Recommended Video
చట్టంలో మార్పులు.. మోదీకి రిక్వెస్ట్
మన చట్టంలో మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉందని శ్రీ రెడ్డి పేర్కొంది. ఆర్మీకి ఇచ్చినట్లే పోలీసులకు కూడా హక్కులు ఇవ్వాలని చెప్పింది. అమ్మాయిలపై, చిన్న పిల్లలపై ఇలాంటి దారుణాలు చేసే వాళ్లను ఎన్కౌంటర్ చేసేలా అఫీషియల్ ఆర్డర్స్ ఇవ్వాలని మోదీ ప్రభుత్వాన్ని కోరింది శ్రీ రెడ్డి.