నేను ** చేస్తే ఏడుస్తారు.. అదే సమంత చేస్తే.. అంటూ శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
టాలీవుడ్ సంచలనం శ్రీరెడ్డి ఎవ్వరినీ వదలడం లేదు. గతంలో పవన్ కళ్యాణ్ లాంటి బడా హీరోపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన ఆమె.. మొన్నటి మొన్న విశాల్, తేజ, మురళీ మోహన్, మంచు లక్ష్మి, జీవిత రాజశేఖర్ లాంటి వారిపై సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దాన్నే కంటిన్యూ చేస్తూ ఈ సారి సమంత పేరు వాడేసింది శ్రీరెడ్డి. పైగా ఆమె పేరును వాడుతూ చేసిన కామెంట్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కొన్నాళ్ళు సైలెంట్‌గా ఉండి.. ఈ మధ్య
సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పేరుతో మహిళలను వాడుకొని వదిలేస్తున్నారని, ఎంతో మహిళల జీవితాలు మంటలో కలుస్తున్నాయని పేర్కొంటూ పెద్ద పోరాటం చేసింది శ్రీరెడ్డి. నిజానికి ఆమె చేసిన ఈ పోరాటం అభినందించదగినదే అయినా.. మధ్యలోనే నీరుగార్చి కోలీవుడ్ కి మకాం మార్చేసింది. ఈ మేరకు కొన్నాళ్ళు సైలెంట్‌గా ఉండి.. ఈ మధ్యకాలంలో మళ్లీ సోషల్ మీడియా వేదికగా సినీ పెద్దలపై సంచలన కామెంట్స్ పెడుతోంది శ్రీ రెడ్డి.

ఫేమస్ హీరోయిన్ల పేర్లు వాడేస్తూ
ఫేస్‌బుక్ వేదికగా హద్దులు దాటి కామెంట్లు చేస్తోంది శ్రీరెడ్డి. పైగా ఫేమస్ హీరోయిన్స్ పేర్లు వాడేస్తూ బాహాటంగా కామెంట్స్ చేస్తుండటం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గతంలో తేజతో తాజ్ బంజారా రూములో ఇలియానా అని, విశాల్ కారవాన్ లో జరిగే బాగోతం అదే అని, మా ఆయన దగ్గుబాటి అభిరామ్ ఒక్కడినే సమంత పిలిచిందని రకరకాలుగా సంచలనాలు సృష్టించింది శ్రీరెడ్డి.
నేను చేస్తే ఏడుస్తారు.. అదే సమంత చేస్తే..
ఈ కోవలోనే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరు వాడుతూ ఓ సెన్సేషన్ కామెంట్ చేసింది ఈ సంచలన తార. ''శ్రీరెడ్డి ఎక్స్‌పోజ్ చేస్తే ఏడుస్తారు.. అదే సమంత చేస్తే చూస్తారు.. మారండి రారేయ్'' అంటూ ఫేస్ బుక్ పోస్ట్ వదిలింది శ్రీరెడ్డి. సమంత పేరు ఉంది కదా! ఇంకేముంది వెంటనే ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్ల నుంచి భిన్న స్పందన వస్తోంది.

నా లాంటి ఆడపిల్లల బాధ పట్టించుకోండి.. శ్రీరెడ్డి ఆవేదన
ఇలాంటి పోస్టులు పెడుతూనే మరోవైపు తన ఆవేదన కూడా వెళ్లగక్కుతోంది శ్రీరెడ్డి. తన పేరు వింటేనే భయపడిపోతున్నారని, పెళ్లి చేసుకుందుకు కూడా ఒక్కరు ముందుకు రావడం లేదని.. చివరకు తన పరిస్థితి అలా అయిందని శ్రీరెడ్డి ఆవేదన చెందుతోంది. నా లాంటి ఆడపిల్లల బాధ కాస్తయినా పట్టించుకోండని శ్రీరెడ్డి పేర్కొంటోంది.

శ్రీరెడ్డి టర్నింగ్ తీసుకుంటోందా..?
గతంలో కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి చేసిన పోరాటం ఎవ్వరు మర్చిపోలేరు. అయితే అనుకోకుండా ఆ పోరాటం మధ్యలో ఆపిన ఆమె.. టార్గెట్ చేసిన ఏ ఒక్కరినీ కూడా వదలకుండా ఇలా కామెంట్స్ చేస్తూనే వస్తోంది. హైదరాబాద్‌లో లేకున్నా టాలీవుడ్ పెద్దలపై అదును చూసి శ్రీరెడ్డి చేస్తున్న అటాక్స్ అబ్బో! అనేలా ఉండటంతో తాజా పరిణామాలు మరోసారి హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్నాయి. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే శ్రీరెడ్డి టైమ్ మరోసారి టర్న్ అవుతుందేమో అనే సందేహం వ్యక్తమవుతోంది జనాల్లో.


Click it and Unblock the Notifications











