అనుమానాలు రేకెత్తిస్తున్న శ్రీరెడ్డి..వేరే వ్యక్తి కాలిపై కాలేసి..పూలతో రాస్తూ..నీ లవరా అని అడిగితే

Recommended Video

Sri Reddy Posts An Unknown Person Pics, Who Is He?? || Filmibeat Telugu

తెలుగు హీరోయిన్‌గా సినీ పరిశ్రమకు పరిచయమైంది సంచలన నటి శ్రీరెడ్డి. టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో కనిపించిన ఈ బ్యూటీ.. అవకాశాలు రాక ఇబ్బందులు పడింది. ఈ క్రమంలోనే కాస్టింగ్ కౌచ్ అనే వివాదాన్ని తెరపైకి తీసుకు వచ్చి ప్రకంపనలకు కారణం అయింది. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హైలైట్ కావడంతో శ్రీరెడ్డి కూడా హాట్ టాపిక్ అయింది. వివాదాస్పద వ్యవహార శైలితో అందరికీ సుపరిచితురాలు అయిన ఆమె.. అదే పంథాను కంటిన్యూ చేస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా సాక్షిగా రెచ్చిపోతోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు అనుమానాలకు తావిస్తున్నాయి.

 అక్కడి నుంచే మాట్లాడుతోంది

అక్కడి నుంచే మాట్లాడుతోంది

కొద్దిరోజులుగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. రెండు మూడు సంవత్సరాలుగా ఆమె బాగా ఫేమస్ అయిపోయింది. దీంతో శ్రీరెడ్డి ఫాలోవర్లు కూడా అరవై లక్షలకు పైగానే ఉన్నారు. ఇక, తాజాగా జరుగుతున్న వ్యవహారాలతో ఆమె చర్చనీయాంశం అవుతోంది. ఈ కారణంగానూ ఆమె ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంది. తన ఫేస్‌బుక్ ఖాతాను వాడుకుని శ్రీరెడ్డి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఈ కారణంగా హాట్ టాపిక్ అయింది.

కొందరు హీరోలను టార్గెట్ చేసింది

కొందరు హీరోలను టార్గెట్ చేసింది

శ్రీరెడ్డి.. కొద్దిరోజులుగా చేస్తున్న పోస్టులు మరీ వివాదాస్పదం అవుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్‌లోని ఎంతో మంది హీరోలను టార్గెట్ చేస్తూ ఆమె.. ఎన్నో సార్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. సీనియర్ జూనియర్ అనే వ్యత్యాసం లేకుండా తరచూ ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంది. దీంతో ఆయా హీరోల ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. అయినా శ్రీరెడ్డి వ్యవహార శైలిలో మార్పులు మాత్రం రావడం లేదు.

హీరోయిన్స్‌ను కూడా వదలదు

ఈ బోల్డ్ హీరోయిన్.. హీరోలనే కాదు.. ఎంతో మంది హీరోయిన్లను కూడా టార్గెట్ చేసింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న వారిని ప్రత్యేకించి ఫోకస్ చేసింది. వీళ్లను ఉద్దేశిస్తూ తరచూ శ్రీరెడ్డి పోస్టులు పెడుతూనే ఉంటోంది. కొన్ని కొన్ని సార్లైతే ఆమె పోస్టులు మరీ శృతి మించుతున్నాయి. దీంతో ఆమెపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సాటి మహిళలను కించ పరుస్తున్నావెందుకు అంటూ చాలా మంది ఆమెను ప్రశ్నిస్తూనే ఉన్నారు.

వ్యక్తిగత విషయాలు కూడా..

సోషల్ మీడియాలో శ్రీరెడ్డి ఎంతో యాక్టివ్‌గా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె సామాజిక, రాజకీయ, సినీ విషయాలపై తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. అదే సమయంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను కూడా తన అభిమానులతో పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలు కూడా తరచూ షేర్ చేస్తోంది.

ఎవరా వ్యక్తి.?

ఎవరా వ్యక్తి.?

తాజాగా శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో ఎవరో ఒక వ్యక్తి కాలిపై ఆమె కాలు పెట్టి కూర్చుంది. అలాగే మరో ఫొటోలో సదరు వ్యక్తి ఆమె కాలిపై పూలతో రాస్తున్నాడు. ప్రతి పోస్టుకు క్యాప్షన్ పెట్టే శ్రీరెడ్డి.. వీటికి మాత్రం ఏమీ రాయకపోవడంతో అందరిలో అనుమానం కలిగింది. ఒక నెటిజన్ నీ లవరా అని అడగగా.. కాదు నా స్నేహితుడు అని జబాబు చెప్పింది. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X