twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పక్కాగా ఆయనే ముఖ్యమంత్రి.. వైఎస్ జగన్ సీఎం సీటుకు శ్రీరెడ్డి ఎసరు!

    |

    వివాదాస్పద నటి శ్రీరెడ్డి సినిమాలపైనా కాకుండా రాజకీయ రంగంలోని పలు అంశాలపై సోషల్ మీడియాలో ఘాటుగా స్పందిస్తుంటారు. పాలిటిక్స్‌లో గానీ, సినిమా రంగంలో గానీ కీలక విషయాలు జరిగినప్పుడు తన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకొంటారు. తాజాగా శ్రీరెడ్డి చేసిన ట్వీట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఆ ట్వీట్ మతలబు ఏమిటంటే...

    శాకుంతలగా సమంత అక్కినేని.. గుణశేఖర్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభం (ఫొటోలు)

    ఎవరు మీలో కోటీశ్వరుడుతో

    ఎవరు మీలో కోటీశ్వరుడుతో

    వెండి తెర మీద వరుస విజయాలతో దూసుకెళ్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరుడు అనే గేమ్ షోతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ రియాలిటీ షో కోసం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. పాలిటిక్స్‌లోకి ఎప్పుడు వస్తున్నారు అంటూ మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది.

    పొలిటికల్ ఎంట్రీపై జూ ఎన్టీఆర్

    పొలిటికల్ ఎంట్రీపై జూ ఎన్టీఆర్

    అయితే మీడియా అడిగిన ప్రశ్నను యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలివిగా దాట వేసేందుకు ప్రయత్నించారు. రాజకీయ ప్రవేశంపై ప్రశ్నకు సమాధానం మీకు తెలుసు అంటూ నవ్వుల్లో మునిగిపోయారు. మీ వద్దనే ఆ ప్రశ్నకు సమాధానం ఉందంటూ చమత్కరించారు. ఆ తర్వాత అలాంటి విషయంపై మాట్లాడటానికి ఇది సమయం కాదు.. సందర్భం కాదు. తీరిగ్గా కాఫీ తాగుతూ మాట్లాడుకొందాం అంటూ ఆ ప్రశ్నకు జవాబు ఇచ్చారు.

    మహేష్ బాబు థియేటర్ లో ముగ్గురు జాతిరత్నాలు సందడి: రచ్చరచ్చ చేశారు (ఫొటోలు)

    టీడీపీకి గడ్డు పరిస్థితి

    టీడీపీకి గడ్డు పరిస్థితి

    ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో తన తాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి గడ్డు పరిస్థితి నెలకొని ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా తన పార్టీని కొంత పుంతలు తొక్కిస్తున్నారు. ఇప్పట్లో ఆయనకు ఎదురే లేదనే పరిస్థితి కనిపిస్తున్నది. ఇలాంటి సమయంలో శ్రీరెడ్డి చేసిన ట్వీట్ ఆసక్తిని కలిగించింది.

    శ్రీరెడ్డి ఆసక్తికరమైన ట్వీట్

    శ్రీరెడ్డి ఆసక్తికరమైన ట్వీట్

    ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై నటి శ్రీరెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారో రారో నాకు తెలియదు. కానీ వస్తే మాత్రం పక్కా CM అవుతారు, ఎందుకంటే తెలుగు ప్రజలు ఆయనను వాళ్ళ ఇంట్లో సొంత కొడుకులా, అన్నలా చూస్తారు అంటూ శ్రీరెడ్డి తన అభిప్రాయాన్ని ట్వీట్ రూపంలో వెల్లడించారు.

    ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం

    ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం

    అలాగే జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా టీమ్ చేస్తున్న సేవలపై ప్రశంసలు కురిపించారు. టీం తారక్ ట్రస్ట్ పేరుతో సేవ చేస్తున్న ప్రతీ యంగ్ టైగర్ అభిమానికి నా కృతజ్ఞతలు.. జై ఎన్టీఆర్ అంటూ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. మాస్ అయిన క్లాస్ అయినా, డైలాగ్ చెప్పటంలో, డాన్స్ చేయటంలో, నటనలో, నిజ జీవితంలో ఎన్టీఆర్ గారి తర్వాతే ఎవరైనా. జై ఎన్టీఆర్ అంటూ మరో ట్వీట్ చేశారు.

    English summary
    Sri Reddy Shocking comments about Jr NTR's Political Entry: Young tiger Jr NTR is going to host the Evaru Meelo Koteeswarulu. He was so excited to host the show. On this, NTR told that Nagarjuna, Chiranjeevi has created mark by hosting Meelo Evaru Koteeswarudu. I will take forward Evaru Meelo Koteeswarulu press meet further.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X