Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్: ఆడవాళ్లతో అలా.. వస్తే అది ఖాయమంటూ వీడియోలు!
వివాదాలు.. గొడవలు.. బూతు పోస్టులు.. గ్లామర్ షో.. ఇలా ఎన్నో రకాలుగా హాట్ టాపిక్ అవుతూ తరచూ సంచలనం అవుతోంది తెలుగు నటి శ్రీరెడ్డి. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. అంతగా గుర్తింపును దక్కించుకోలేకపోయిందామె. కానీ, కాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. అదే సమయంలో కొందరిని పొగుడుతూ పోస్టులు కూడా పెట్టింది. ఈ నేపథ్యంలోనే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి వరుస ట్వీట్లు చేసి షాకిచ్చింది. అంతేకాదు, అతడి పొలిటికల్ ఎంట్రీపైనా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు మీకోసం!
చీరకట్టు అందాలతో అనసూయ భరద్వాజ్: స్టేజీపై డాన్స్ (ఫొటోలు)
అలా మొదలైన కెరీర్... అర్థాంతరంగానే
నటిగా గుర్తింపు పొందాలన్న లక్ష్యంతో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది శ్రీరెడ్డి. ఈ క్రమంలోనే అవకాశాలు లేకపోవడంతో ఓ న్యూస్ చానెల్లో ప్రమోటర్‌గానూ పని చేసింది. ఆ సమయంలోనే 'నేను నాన్న అబద్ధం' అనే సినిమాతో పరిచయమై... ఆ తర్వాత 'అరవింద్ 2', 'జిందగీ' తదితర సినిమాల్లో లీడ్ రోల్ చేసింది. కానీ, ఆ తర్వాత ఆమె కెరీర్ ఆర్థాంతరంగానే ముగించుకుంది.
కాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో హాట్ టాపిక్‌గా
తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చెబుతూ సంచలనానికి తెర తీసింది శ్రీరెడ్డి. ఇక్కడ అవకాశాలు కావాలంటే దర్శక నిర్మాతలు చెప్పినట్లు చేయాలని షాకింగ్ కామెంట్స్ చేసిన ఆమె.. అప్పట్లో ప్రకంపనలు రేపింది. అప్పుడు వరుసగా పలు డిబెట్లలో పాల్గొంటూ తరచూ హాట్ టాపిక్ అవుతూ వచ్చింది. ఈ క్రమంలోనే నగ్న నిరసనకు దిగి దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది.
వాళ్లందరిపై కామెంట్లు.. టార్గెట్ చేస్తూనే
కాస్టింగ్ కౌచ్ ఉద్యమం జరుగుతోన్న సమయంలో పలువురు సినీ పెద్దలను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి.. ఆ తర్వాత కూడా ప్రముఖులపై షాకింగ్ కామెంట్లు చేసింది. మరీ ముఖ్యంగా తెలుగులో ఉన్న కొందరు స్టార్ హీరోలపై ఊహించని వ్యాఖ్యలు చేసి తరచూ వార్తల్లో నిలిచిందామె. అలాగే, కొంత మంది హీరోయిన్ల బ్యాగ్రౌండ్‌పై, వాళ్ల బాడీపై వివాదాస్పదంగా మాట్లాడి విమర్శలను ఎదుర్కొందామె.
ఎప్పుడూ అక్కడే.. హాట్ షో, బూతులు
శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. చాలా కాలంగా అందులో నుంచే తన అభిప్రాయాలను వెల్లడిస్తోంది. అదే సమయంలో ఎంతో మందిపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ కలకలం రేపుతోంది. అలాగే, గ్లామరస్ ఫొటోలు, వీడియోలతో విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే బూతు పోస్టులతోనూ రెచ్చిపోతోంది.
దమ్మున్న హీరో ఎన్టీఆర్ ఒక్కడేనంటూ
ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరులు' అనే షో చేస్తున్న విషయం తెలిసిందే. దానికి సంబంధించిన ప్రెస్మీట్లో ఎన్నో ప్రశ్నలకు అతడు సమాధానం చెప్పాడు. అలా ఓ వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేసిన శ్రీరెడ్డి.. అతడిపై ప్రశంసల వర్షం కురిపించింది. 'తన అభిమానులను కుటుంబంలా చూసుకునే ఒకే ఒక్క దమ్మున్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ గారు' అంటూ ట్వీట్ చేసింది.
ఆ విషయంలో ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా
జూనియర్ ఎన్టీఆర్ టాలెంట్ గురించి వివరిస్తూ గతంలో ఎన్నో సార్లు కామెంట్లు చేసింది శ్రీరెడ్డి. అదే సమయంలో అతడి పేరును వాడుతూ చాలా మందిపై విమర్శలు కూడా చేసింది. తాజాగా 'మాస్ అయినా.. క్లాస్ అయినా.. డైలాగ్ చెప్పటంలో అయినా.. డాన్స్ చేయటంలో అయినా.. నటనలో అయినా నిజ జీవితంలో అయినా ఎన్టీఆర్ గారి తర్వాతే ఎవరైనా' అంటూ ట్వీట్ చేసింది శ్రీరెడ్డి.
ఆడవాళ్లతో అలా.. అందుకే అభిమానిని
ఈ ప్రెస్మీట్లో ఓ మహిళా జర్నలిస్టుతో ఎన్టీఆర్ మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ.. 'ఆడవారిని అమ్మా అని పిలిచే మీ సంస్కారానికి నా జీవితాంతం మీకు అభిమానిగా ఉంటాను సార్. ఇందుకే ఎన్టీఆర్ గారు అంటే నాకు ఇష్టం' అని ట్వీట్ చేసింది. అలాగే, టీం తారక్ ట్రస్ట్ పేరుతో సేవ చేస్తున్న ప్రతీ యంగ్ టైగర్ అభిమానికి కృతజ్ఞతలు చెబుతూ మరో పోస్టును పెట్టింది శ్రీరెడ్డి.
ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై శ్రీరెడ్డి కామెంట్
శనివారం జరిగిన ప్రెస్‌మీట్ తర్వాత ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి స్పందిస్తూ.. 'ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారో రారో నాకు తెలియదు. కానీ వస్తే మాత్రం పక్కా CM అవుతారు. ఎందుకంటే తెలుగు ప్రజలు ఆయనను వాళ్ళ ఇంట్లో సొంత కొడుకులా, అన్నలా చూస్తారు' అంటూ ఆయన కామెంట్స్ చేసిన వీడియోలను షేర్ చేసిందామె.