జనసేనానిపై శ్రీ రెడ్డి అటాక్.. నీ మొఖానికి పిచ్చ కళ్యాణ్ అంటూ.. ఏకంగా 'రా' అని పిలిచేసింది
Recommended Video
టాలీవుడ్ సంచలనం శ్రీ రెడ్డి సమయం దొరికిందంటే ఆగటం లేదు. తనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బయటపెడుతూ బూతు పురాణాలు మొదలు పెట్టేస్తోంది. టెక్స్ట్, వీడియోలతో సంచలనం సృష్ఠ్టిస్తోంది. సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఆమె చేసిన పోస్టులు ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వివాదస్పద కామెంట్ చేసింది శ్రీ రెడ్డి. తనదైన భావాజాలంతో చుక్కలు చూపించింది. ఆమె పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్లుగా వైరల్ అవుతోంది. ఇంతకీ శ్రీ రెడ్డి పెట్టిన ఈ పోస్ట్‌లో సారాంశం ఏమిటో చూద్దామా..

అసెంబ్లీ ఎన్నికలు.. జనసేనకు షాక్
సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనూ రాణించాలని భావించారు. ఈ మేరకు జనసేన పార్టీ ద్వారా జనంలోకి వెళ్లి ఊహించని షాక్ తిన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన, ఆయన పార్టీ నేతలు ఘోర పరాజయం చెందటం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. కనీసం స్వయంగా తానే పోటీ చేసిన భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాలు కూడా దక్కించుకోలేక పోయారు పవన్.

పవన్ పోరాటం ఆగటం లేదుf
ఓటమి పాలైన పవన్ ఇక సినిమాలు చేసుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ తాను రాజకీయాలు వదిలే ప్రసక్తే లేదని తేల్చేసిన పవన్.. వచ్చే ఎన్నికల్లో విక్టరీ కొట్టేందుకు వ్యూహరచనలు చేస్తూ అధికార పార్టీపై ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో '100 రోజుల టైం ఇస్తున్నా.. ఆ తరువాత నా ప్రతాపం' చూపిస్తా అంటూ ప్రభుత్వానికి లేఖ రాశాడు పవన్.
పవన్‌పై శ్రీ రెడ్డి అటాక్.. గాలి తీసేసింది
పవన్ తీరు చూసిన శ్రీ రెడ్డి వెంటనే ఆయనపై అటాక్ చేస్తూ ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టేసింది. ''కనీసం అసెంబ్లీలో కూర్చోటానికి సీటు లేదు నీ మొఖానికి పిచ్చి కళ్యాణ్.. నీకు నాకు పెద్ద పని లేదు కానీ, దా కూర్చొని సొల్లు చెప్పుకుందాం'' అంటూ సెన్సేషనల్ పోస్ట్ వదిలింది. దీంతో షాకైన జనసైనికులు ఆమెపై విరుచుకుపడుతున్నారు.

గతంలో అలా.. ఇప్పుడిలా
గతంలో కాస్టింగ్ కౌచ్ విషయమై పోరాడుతున్నపుడు పవన్ కళ్యాణ్‌ను, ఆయన తల్లిని శ్రీ రెడ్డి అనరాని మాటలు అన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఉదంతం పెద్ద చర్చలకు దారితీసింది. పవన్ అభిమానులు శ్రీరెడ్డి ట్వీట్స్, కామెంట్స్ ఓ రేంజ్‌లో మండిపడ్డారు. మరోసారి ఇప్పుడు తన మాటలకు పదును పెట్టి హాట్ టాపిక్ అవుతోంది శ్రీ రెడ్డి.


Click it and Unblock the Notifications











