Sri Reddy: లైగర్​ మూవీపై శ్రీరెడ్డి రివ్యూ​.. అంత హైప్​ అవసరమా అంటూ..

టాలీవుడ్ డేరింగ్​ అండ్​ మాస్​ డైరెక్టర్ అంటె టక్కున గుర్తు వచ్చే పేరు పూరీ జగన్నాథ్. ఆయన సినిమాలకు ఓ సెపరేట్​ ఫ్యాన్​ బేస్ ఉంది. జయాపజయాల సంగతి పక్కన పెట్టి ఆయన డైలాగ్స్​, స్క్రీన్​ ప్లేకు అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురిచి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన యాటిట్యూడ్​తో అర్జున్​ రెడ్డిగా అతి తక్కువ కాలంలోనే ఒక స్పెషల్​ ఇమేజ్​ సంపాదించుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్​లో తొలిసారిగా తెరకెక్కిన చిత్రం లైగర్​. అత్యంత భారీ అంచనాల మధ్య పాన్​ ఇండియా మూవీగా ఆగస్టు 25న విడుదలైన లైగర్​పై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్​ నటి శ్రీరెడ్డి తన అభిప్రాయాన్ని తెలిపింది. అది ఎలా ఉందంటే?

లైగర్​ మూవీని ప్రముఖ బాలీవుడ్​ సినీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్ బ్యానర్స్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా మిక్స్​డ్​ మార్షల్​ ఆర్ట్స్​ నేపథ్యంలో తెరకెక్కిన విషయం తెలిసిందే.

 సూపర్బ్​ రెస్పాన్స్​..

సూపర్బ్​ రెస్పాన్స్​..

సినిమా విడుదలకు ముందు ఎంతో క్రేజ్​ సంపాదించుకుంది లైగర్​. అందుకు కారణం ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, సాంగ్స్​, ట్రైలర్​ ఇలా అన్నింటికి సూపర్బ్​ రెస్పాన్స్​ వచ్చింది. అంతకుమించి వివిధ రాష్ట్రాల్లో చిత్రబృందానికి వచ్చిన స్పందన మరిచిపోలేం.

 అభిమానుల సందడితో..

అభిమానుల సందడితో..

అంతేకాకుండా ప్రమోషన్స్​లో భాగంగా వరంగల్​లో ఫ్యాన్​డమ్​ ఈవెంట్​ను చాలా గ్రాండ్​గా ఏర్పాటు చేశారు. గుంటూరులో ప్రీ రిలీజ్​ ఈవెంట్​ అభిమానుల కోలాహలం, సందడి మధ్య సూపర్​ సక్సెస్​ అయింది. ఈ ప్రమోషన్స్​లలో ఆగస్టు 25న ఇండియా షేక్​ అవుతుంది అని విజయ్​ చెప్పిన డైలాగ్​ గుర్తుండే ఉంటుంది.

 ఒక్కోలా స్పందన..

ఒక్కోలా స్పందన..

ఇక గురువారం విడుదలైన లైగర్​ సినిమా మిక్స్​డ్​ టాక్​తో నడుస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, బాలీవుడ్​ భామ అనన్య పాండే జోడీగా నటించిన ఈ చిత్రంపై ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నటి శ్రీరెడ్డి లైగర్​పై తన స్పందన తెలియజేసింది.

ఆ సినిమా అద్భుతం..

ఆ సినిమా అద్భుతం..

'లైగర్​కు ముందు లైగర్​కు తర్వాత అంట.. అనవసరమైన హైప్​లు అవసరమా?, కంటెంట్​ ఉన్నోడికి హైప్​ అవసరం లేదు. లైగర్​ కన్నా కార్తికేయ 2 బెటర్​. బెటర్​ కూడా కాదు కార్తికేయ 2 ఒక అద్భుతం' అని ట్వీటర్​ ద్వారా శ్రీరెడ్డి షాకింగ్​ కామెంట్స్​ చేసింది.

 హాట్​ టాపిక్​గా మారిన శ్రీరెడ్డి..

హాట్​ టాపిక్​గా మారిన శ్రీరెడ్డి..

ఇక టాలీవుడ్​లో శ్రీరెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్​ కౌచ్​ గురించి, పలువురు ప్రముఖుల గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేసి హాట్​ టాపిక్​గా మారిన విషయం తెలిసిందే. క్యాస్టింగ్​ కౌచ్ టాపిక్​తో రచ్చ చేసిన శ్రీరెడ్డి తర్వాత అనేక అంశాలపై మాట్లాడింది.

 యూట్యూబ్​లో వ్లోగ్స్​..

యూట్యూబ్​లో వ్లోగ్స్​..

అనేక నటీనటులను టార్గెట్​ చేస్తూ ట్వీట్​లు చేస్తుంటుంది. ఇక ప్రస్తుతం అయితే సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉంటూ యూట్యూబ్​లో పలు వ్లోగ్స్​ చేస్తుంది. అప్పుడప్పుడు సినీ పరిశ్రమ, రాజకీయ అంశాలపై తనదైన శైలీలో రియాక్ట్​ అవుతూ ఉంటోంది శ్రీరెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X