Don't Miss!
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
వర్మపై పడిన శ్రీ రెడ్డి.. నాతో అన్నాడు ఇప్పుడు వేరొక లేడీతో.. మోసం చేశాడంటూ సెన్సేషన్
ఎప్పుడైతే రామ్ గోపాల్ వర్మ బ్యూటిఫుల్ హీరోయిన్ కాళ్లపై పడ్డాడో ఆ క్షణం నుంచే ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. వర్మ చేసిన ఈ పని చూసి అంతా షాకయ్యారు. సినీ వర్గాలు మొదలుకొని సాధారణ ప్రేక్షకుడి వరకు రామ్ గోపాల్ వర్మ గురించే చర్చించుకుంటున్నారు. సరిగ్గా ఈ తరుణంలో ఇదే ఇష్యూలోకి ఎంటర్ అయింది శ్రీ రెడ్డి. అంతేకాదు తనదైన శైలిలో కామెంట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. వివరాల్లోకి పోతే..
'బ్యూటిఫుల్' హీరోయిన్.. వర్మ పడిపోయాడు
వివాదాస్పద దర్శకుడిగా సినీ, రాజకీయ వర్గాలకు చుక్కలు చూపించిన రామ్ గోపాల్ వర్మ 'బ్యూటిఫుల్' హీరోయిన్ కాళ్లపై పడ్డాడు. తన నిర్మాణంలో రూపొందుతున్న 'బ్యూటిఫుల్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రామ్ గోపాల్ వర్మ ఇలా వినూత్నంగా, వింతగా ప్రవర్తించాడు.
హీరోయిన్‌తో రెచ్చిపోయిన వర్మ
ఎలాగైతేనేం తన సినిమాకు భారీ పబ్లిసిటీ కావలి అన్నట్లుగా రామ్ గోపాల్ వర్మ, తన హీరోయిన్ నైనా గంగూలీతో కలిసి రచ్చ రచ్చ చేశాడు. ఆమెతో కలిసి రెచ్చిపోయి డాన్సులేసి వార్తల్లో నిలిచాడు. ఇక తీరా సినిమా విడుదల సమయంలో ఆమె కాళ్లపై పడి ఊహించని షాకిచ్చాడు. దీంతో రామ్ గోపాల్ వర్మ ఏంటి? ఆమె హీరోయిన్ కాళ్లపై పడటం ఏంటి? మరీ ఇంత దిగజారిపోయాడా? అంటూ చర్చలు ముదిరాయి.
ఎంటరైన శ్రీ రెడ్డి.. చీట్ చేశాడంటూ
తాజగా ఈ ఇష్యూపై మరో వివాదాస్పద బ్యూటీ శ్రీ రెడ్డి రియాక్ట్ అయింది. ఏకంగా రామ్ గోపాల్ వర్మ తనను చీట్ చేశాడంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించింది. వర్మ చేసిన పనికి ఫసక్ లాంటి పంచ్ వేసి వార్తల్లో నిలిచింది.
ఇటు శ్రీ రెడ్డి, అటు వర్మ ఇద్దరూ..
''వర్మ నన్ను చీట్ చేశారు.. ఒకానొక సందర్భంలో నన్ను దేవత అని పొగిడిన ఆయన నా కాళ్లు పట్టుకుంటా అని అన్నాడు.. ఇప్పుడేమో ఆమె కాళ్లు పట్టుకున్నాడు.. నేను హర్ట్ అయ్యా'' అంటూ తన సోషల్ మీడియా ఖత ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. ఇటు శ్రీ రెడ్డి, అటు వర్మ ఇద్దరూ వివాదాలకు కేంద్రబిందువులే కావడంతో ఆమె పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట పెద్ద దుమారంగా మారింది.
అన్నీ తానై వర్మ.. న్యూ ఇయర్ రోజు
వర్మ శిష్యుడు అగస్థ్య మంజు దర్శకత్వంలో ‘బ్యూటిఫుల్' మూవీ రూపొందింది. రామ్ గోపాల్ వర్మ స్వయంగా నిర్మాతగా వ్యవహరించి అన్నీ తానై చూసుకున్నాడు. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రంలో నైనా గంగూలీ హీరోయిన్గా నటించింది.