Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నేను చూపిస్తే తట్టుకోలేరంటూ డ్రెస్ తీసేసిన శ్రీరెడ్డి: ఆ హీరోయిన్లను టార్గెట్ చేస్తూ అలా!
కొంత కాలంగా తన వివాదాస్పద వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తూ ఎంతో మందికి టార్గెట్ అయింది ప్రముఖ నటి శ్రీరెడ్డి. సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ అయింది. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో సినీ పెద్దలకు వణుకు పుట్టించిన ఆమె.. వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. పద్దతి మార్చుకోమని ఎంతో మంది హితవు పలికినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా తన అందాలను చూపిస్తానంటూ డ్రెస్ తీసేసింది. అంతేకాదు, కొందరు హీరోయిన్లపై కామెంట్ కూడా చేసింది. ఆ వివరాలు మీకోసం.!
కాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో పాపులర్
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ ఉందని ఆరోపిస్తూ వెలుగులోకి వచ్చింది శ్రీ రెడ్డి. సోషల్ మీడియాలో యమ క్రేజ్ ఉన్న ఈ బ్యూటీ ఆ సమయంలో పలువురు సినీ పెద్దలు, వారి సుపుత్రులతో పాటు కొందరు స్టార్ హీరోలను సైతం టార్గెట్ చేసింది. ఆమె చేసిన ఉద్యమానికి ఊహించని రీతిలో మద్దతు వచ్చింది. దీంతో శ్రీరెడ్డి దేశ వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకుంది.
బట్టలు తీసి నిరసన... విమర్శలు
కాస్టింగ్ కౌచ్ విషయంలో తనకు న్యాయం జరిగే పరిస్థితులు కనిపించకపోవడంతో.. శ్రీరెడ్డి వినూత్న రీతిలో బట్టలు తీసేసి ఫిలిం చాంబర్ ముందు నిరసన తెలియజేసింది. ఆ సమయంలో ఆమెకు ఉన్న మద్దతు ఒక్కసారిగా తగ్గిపోయింది. అంతేకాదు, నగ్నంగా కనిపించడంపై మహిళా సంఘాలతో పాటు చాలా మంది విశ్లేషకులు శ్రీరెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు.
హీరోలు.. హీరోయిన్లపై ఆరోపణలు
కాస్టింగ్ కౌచ్ ఉద్యమం తర్వాత శ్రీరెడ్డి సోషల్ మీడియాలో యమ యాక్టివ్ అయిపోయింది. ఈ క్రమంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలోని కొందరు హీరోలు, హీరోయిన్లను బాగా టార్గెట్ చేసింది. తరచూ వాళ్లను ఏదో రకంగా బూతులు తిడుతుండేది. అదే సమయంలో తనను ఓ నిర్మాత కుమారుడు మోసం చేశాడని కొన్ని ఫొటోలను కూడా లీక్ చేసిన విషయం తెలిసిందే.
పవర్ స్టార్‌పై కామెంట్లతో రచ్చరచ్చ
శ్రీరెడ్డి ఆ మధ్య పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను విమర్శించింది. దీనిపై ఆయన అభిమానులు తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే ఆమెను బండ బూతులు తిడుతూ విమర్శించారు. దీంతో శ్రీరెడ్డి మరింతగా రెచ్చిపోయింది. అప్పటి నుంచి పవన్ సినీ కెరీర్‌తో పాటు పొలిటికల్ కెరీర్‌ను టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టింది. అలాగే, ఆయన పర్సనల్ లైఫ్‌నూ వదిలిపెట్టలేదు.
ఆ హీరోయిన్లను టార్గెట్ చేస్తూ పోస్ట్
టాలీవుడ్‌లోని కొందరు హీరోయిన్లపై బాడీ షేమింగ్ కామెంట్లు కూడా చేస్తుండే శ్రీరెడ్డి.. అదే తరహాలో తరచూ ఏదో ఒక రకమైన పోస్ట్ పెడుతూనే ఉంది. పలానా హీరోయిన్ ఫిగర్ బాలేదని కొందరిపై అసభ్యంగా స్పందిస్తూ ఉండేది. అదే సమయంలో తనను తాను బాగా పొగుడుకునేది. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్లపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్లు చేసింది.
తట్టుకోలేరంటూ డ్రెస్ తీసేసిన శ్రీరెడ్డి
తన టీ షర్ట్ తీసేసి ఎద అందాలను చూపిస్తూ తాజాగా ఓ పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. దానికి ‘నేను మేకప్ లేకుండా గ్లామర్ షో స్టార్ట్ చేస్తే, టాప్ హీరోయిన్లు అందరూ నా వెనుక నిలబడాల్సిందే. అప్పట్లో సిల్క్ స్మిత కూడా అలాగే హవా చూపించారు. నేను సెక్సీగా ఉంటాను. చల్.. హట్. నిమ్మకాయలు, ద్రాక్ష పండ్లు' అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఈ ఫోటో వైరల్ అయిపోయింది.