ఎన్టీఆర్ విషయంలో శ్రీరెడ్డి యూటర్న్: జగన్‌ గురించి షాకింగ్‌గా.. తొక్క తీస్తా బిడ్డా అంటూ వార్నింగ్!

శ్రీరెడ్డి.. కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేరిది. సినిమా నటిగా కెరీర్‌ను ఆరంభించి పలు వివాదాల కారణంగా హాట్ టాపిక్ అయిన ఈ భామ.. ఎంతో మందిపై విమర్శలు చేస్తూ సంచలనంగా మారింది. అదే సమయంలో అందాల విందుతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. వివాదాలు.. గొడవలు.. బూతు పోస్టులు.. గ్లామర్ షో.. ఇలా ఎన్నో రకాలుగా నిత్యం జనాల నోళ్లలో నానుతూ రోజురోజుకూ పాపులర్ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా శ్రీరెడ్డి జూనియర్ ఎన్టీఆర్ విషయంలో యూటర్న్ తీసుకుని ఏపీ సీఎంపై జగన్‌పై ఓ పోస్ట్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

 మోడల్.. ప్రజెంటర్.. హీరోయిన్‌.. శ్రీరెడ్డి ప్రస్థానం

మోడల్.. ప్రజెంటర్.. హీరోయిన్‌.. శ్రీరెడ్డి ప్రస్థానం

మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది శ్రీరెడ్డి. అలా కొన్ని షోలలో క్యాట్ వాక్‌లు చేసిన ఈ భామ.. ఆ తర్వాత ఓ న్యూస్ చానెల్‌లో ప్రజెంటర్‌గానూ పని చేసింది. ఆ సమయంలోనే 'నేను నాన్న అబద్ధం' అనే సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. దీని తర్వాత 'అరవింద్ 2', 'జిందగీ' తదితర సినిమాల్లో లీడ్ రోల్ చేసింది. కానీ, ఆ తర్వాత అనూహ్యంగా సినిమాలకు దూరం అయిపోయింది.

 టాలీవుడ్‌లో కలకలం రేపి.. ఆ ఉద్యమంతో క్రేజ్

టాలీవుడ్‌లో కలకలం రేపి.. ఆ ఉద్యమంతో క్రేజ్

తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపుతూ కాస్టింగ్ కౌచ్ ఉదంతాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది శ్రీరెడ్డి. ఇండస్ట్రీలో ఛాన్స్‌లు రావాలంటే దర్శక నిర్మాతలు చెప్పినట్లు చేయాలి అంటూ సంచలన ఆరోపణలు చేసిన ఆమె.. పరిశ్రమలో ప్రకంపనలు రేపింది. ఆ సమయంలోనే టీవీ డిబెట్ల ద్వారా ఎన్నో విషయాలు చెప్పింది. ఆ తర్వాత నగ్న నిరసనకు దిగి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

 ఏ ఒక్కరినీ వదలకుండా.. అందరినీ టార్గెట్ చేసి

ఏ ఒక్కరినీ వదలకుండా.. అందరినీ టార్గెట్ చేసి

కాస్టింగ్ కౌచ్ గొడవ జరుగుతోన్న సమయంలోనే ఎంతో మంది సినీ ప్రముఖులపై ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. ఆ తర్వాత కొన్ని ఫొటోలను కూడా లీక్ చేసి వార్తల్లో నిలిచింది. అంతేకాదు, టాలీవుడ్‌లో ఉన్న కొందరు స్టార్ హీరోలపై ఊహించని వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి.. అలాగే, కొంత మంది హీరోయిన్ల బ్యాగ్రౌండ్‌పై, వాళ్ల బాడీపై వివాదాస్పదంగా కామెంట్లు చేస్తూ విమర్శలను ఎదుర్కొంది.

అందులోనే ఎక్కువగా... రచ్చ చేస్తున్న బ్యూటీ

అందులోనే ఎక్కువగా... రచ్చ చేస్తున్న బ్యూటీ

సోషల్ మీడియాలో శ్రీరెడ్డి ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా కాలంగా దాని నుంచే తన అభిప్రాయాలను వెల్లడిస్తోంది. అదే సమయంలో ఎంతో మందిపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ కలకలం రేపుతోంది. అలాగే, గ్లామరస్ ఫొటోలు, వీడియోలతో విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే బూతు పోస్టులతోనూ రచ్చ రచ్చ చేస్తోంది.

 జూనియర్ ఎన్టీఆర్‌కు సపోర్ట్.. పాలిటిక్స్‌పై పోస్టు

జూనియర్ ఎన్టీఆర్‌కు సపోర్ట్.. పాలిటిక్స్‌పై పోస్టు

ఇటీవల జరిగిన ఓ ప్రెస్‌మీట్ తర్వాత ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి స్పందిస్తూ.. 'ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారో రారో నాకు తెలియదు. కానీ వస్తే మాత్రం పక్కా CM అవుతారు. ఎందుకంటే తెలుగు ప్రజలు ఆయనను వాళ్ళ ఇంట్లో సొంత కొడుకులా, అన్నలా చూస్తారు' అంటూ ఆయన కామెంట్స్ చేసిన వీడియోలను షేర్ చేసిందామె.

ఎన్టీఆర్ విషయంలో యూటర్న్.. జగన్‌కు సపోర్ట్

ఎన్టీఆర్ విషయంలో యూటర్న్.. జగన్‌కు సపోర్ట్

ట్విట్టర్ అకౌంట్ ద్వారా జూనియర్ ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ వరుస పోస్టులు పెట్టింది శ్రీరెడ్డి. దీంతో ఆమె యంగ్ టైగర్ అభిమాని అని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి సమయంలోనే తన ఫేస్‌బుక్ ఖాతాలో ఊహించని విధంగా కామెంట్లు చేస్తూ పోస్టు పెట్టింది. ఇందులో ఎన్టీఆర్‌ విషయంలో యూటర్న్ తీసుకుని, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచింది.

తొక్క తీస్తా బిడ్డా అంటూ అతడకి వార్నింగ్ ఇచ్చి

తొక్క తీస్తా బిడ్డా అంటూ అతడకి వార్నింగ్ ఇచ్చి

తాజాగా చేసిన పోస్టులో 'ట్విట్టర్ ఫేక్ అకౌంట్ పర్సన్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. తొక్క తీస్తా బిడ్డా. నేను ఎప్పటికీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారి అభిమానాని. ఆయననే ఆరాధిస్తున్నాను. ఆయనను రీప్లేస్ చేసే వాళ్లు ఎవరూ లేరు. జై జగన్' అంటూ రాసుకొచ్చింది శ్రీరెడ్డి. దీంతో తారక్‌పై చేసిన ట్వీట్లు తాను చేయలేదని పరోక్షంగా చెప్పింది. దీనిపై భిన్నమైన కామెంట్లు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X