పవన్ కల్యాణ్‌పై దారుణమైన పోస్టును పెట్టిన శ్రీరెడ్డి.. ఆయన భార్యను కూడా వదల్లేదు.!

By Manoj Kumar P

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న శ్రీరెడ్డి ఏది చేసినా సంచలనమే అవుతోంది. తన వ్యవహార శైలితో నిరంతరం అందరి నోళ్లలో నానుతూ ఉంటోంది. ఎంతో మంది హితవు పలికినప్పటికీ శ్రీరెడ్డి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఆమె కూడా ఎవరో చెప్పింది ఎందుకు వినాలి..? అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటోంది. ఈ క్రమంలోనే వరుస పోస్టులు పెడుతూ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు టాలీవుడ్‌లోని ఎంతో మంది హీరోలపై కామెంట్లు చేసిన ఈ బోల్డ్ బ్యూటీ.. తాజాగా పవన్ కల్యాణ్‌పై ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో ఆయన భార్యను కూడా వదల్లేదు. ఇంతకీ ఆమె ఏ పోస్ట్ పెట్టింది..? వివరాల్లోకి వెళితే...

అక్కడ శ్రీరెడ్డి ఫుల్ బిజీ

అక్కడ శ్రీరెడ్డి ఫుల్ బిజీ

కొద్దిరోజులుగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. రెండు మూడు సంవత్సరాలుగా ఆమె బాగా ఫేమస్ అయిపోయింది. దీంతో శ్రీరెడ్డి ఫాలోవర్లు కూడా అరవై లక్షలకు పైగానే ఉన్నారు. ఇక, తాజాగా జరుగుతున్న వ్యవహారాలతో ఆమె చర్చనీయాంశం అవుతోంది. ఈ కారణంగానూ ఆమె ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంది. ఈ కారణంగా హాట్ టాపిక్ అయింది. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆమె మాత్రం అస్సలు తగ్గడం లేదు.

కొందరు హీరోలను టార్గెట్ చేసింది

కొందరు హీరోలను టార్గెట్ చేసింది

శ్రీరెడ్డి.. కొద్దిరోజులుగా చేస్తున్న పోస్టులు మరీ వివాదాస్పదం అవుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్‌లోని ఎంతో మంది హీరోలను టార్గెట్ చేస్తూ ఆమె.. ఎన్నో సార్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. సీనియర్ జూనియర్ అనే వ్యత్యాసం లేకుండా తరచూ ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంది. దీంతో ఆయా హీరోల ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. అయినా శ్రీరెడ్డి వ్యవహార శైలిలో మార్పులు మాత్రం రావడం లేదు.

 హీరోయిన్స్‌ను కూడా వదలదు

హీరోయిన్స్‌ను కూడా వదలదు

ఈ బోల్డ్ హీరోయిన్.. హీరోలనే కాదు.. ఎంతో మంది హీరోయిన్లను కూడా టార్గెట్ చేసింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న వారిని ప్రత్యేకించి ఫోకస్ చేసింది. వీళ్లను ఉద్దేశిస్తూ తరచూ శ్రీరెడ్డి పోస్టులు పెడుతూనే ఉంటోంది. కొన్ని కొన్ని సార్లైతే ఆమె పోస్టులు మరీ శృతి మించుతున్నాయి. దీంతో ఆమెపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సాటి మహిళలను కించ పరుస్తున్నావెందుకు అంటూ చాలా మంది ఆమెను ప్రశ్నిస్తూనే ఉన్నారు.

పవన్ అంటే మరీ కోపం

శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ విషయంలో దాదాపు రెండు మూడు నెలల పాటు పోరాటం చేసింది. ఒకానొక సందర్భంలో ఫిలిం చాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన కూడా చేసింది. అదే సమయంలో పవన్ కల్యాణ్‌పైనా విమర్శలు చేయడంతో ఆయన అభిమానులు శ్రీరెడ్డిపై విమర్శలు చేశారు. ఇక, అప్పటి నుంచి పవన్ టార్గెట్‌గా పోస్టులు పెడుతూ ఉంటుంది శ్రీరెడ్డి. తరచూ ఏదో ఒక విషయంపై ఆయనను లాగుతూనే ఉంటోంది.

పవన్‌పై దారుణమైన పోస్ట్

పవన్‌పై దారుణమైన పోస్ట్

తాజాగా శ్రీరెడ్డి.. పవన్ కల్యాణ్‌పై మరో పోస్ట్ చేసింది. ఇందులో ఆమె పవన్ కల్యాణ్‌ను కాలితో కొడుతున్నట్లు ఉన్న ఫొటోను షేర్ చేసింది. అంతేకాదు, పక్కనే ఆయన భార్యను కూడా ఉంచారు. వాస్తవానికి ఇది మహేశ్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాలోని మామిడి తోటలో జరిగే ఫైట్ తాలూకు ఫొటో. దానికి మార్ఫింగ్ చేసి ఇలా తయారు చేశారు. ఈ పోస్ట్‌పై శ్రీరెడ్డి ‘ఇది ఒకరు నాకు పంపారు. పాపం రా' అని కూడా కామెంట్ పెట్టింది.

Recommended Video

#Cinebox : #KRKRTrailer2 Released | Chiranjeevi - Manisharma To Team Up Again
ఆడేసుకుంటున్నారు

ఆడేసుకుంటున్నారు

శ్రీరెడ్డి చేసిన ఈ పోస్టును పవన్ కల్యాణ్ వ్యతిరేకులు షేర్ చేస్తూ తమ వికృతానందాన్ని పంచుకుంటుండగా, ఆయన అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టుగా ఆమె వాల్‌లోకి వచ్చి మరీ బండ బూతులు తిడుతున్నారు. దీంతో శ్రీరెడ్డి షేర్ చేసిన ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X