యంగ్ హీరోపై శ్రీరెడ్డి ఊహించని కామెంట్స్: ఏకంగా సీఎం జగన్‌ను తీసుకొచ్చి.. చిన్న వయసులోనే అలా అంటూ!

హీరోయిన్‌గా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. అవకాశాలను అందుకోవడంలో విఫలమైన వారిలో లోకల్ బ్యూటీ శ్రీరెడ్డి ఒకరు. ఆకట్టుకునే అందం ఉన్నా.. ఆఫర్లను దక్కించుకోలేకపోయిన ఈ భామ.. కాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా ఎంతగానో ఫేమస్ అయింది. అదే సమయంలో పలు వివాదాల వల్ల తరచూ వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ అవుతోంది. ఇలాంటి సమయంలోనే తాజాగా శ్రీరెడ్డి తాజాగా యంగ్ హీరోపై ఊహించిన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేరునూ వాడేసింది. అసలేం జరిగింది? వివరాలు మీకోసం!

శ్రీరెడ్డి ప్రయాణం ఎలా సాగిందంటే

శ్రీరెడ్డి ప్రయాణం ఎలా సాగిందంటే

యాక్టింగ్ మీద ఉన్న మక్కువతో హైదరాబాద్‌కు వచ్చింది ఆంధ్రా అమ్మాయి శ్రీరెడ్డి. ఆరంభంలో ఎంతగానో ప్రయత్నించినా అవకాశాలు దొరకలేదు. అలాంటి సమయంలోనే ఓ న్యూస్ చానెల్‌లో పని చేసింది. ఆ తర్వాత 'నేను నాన్న అబద్ధం' అనే మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత 'అరవింద్ 2', 'జిందగీ' తదితర సినిమాల్లో లీడ్ రోల్ చేసినా గుర్తింపును అందుకోలేకపోయింది.

కాస్టింగ్‌ కౌచ్‌తో మరింత పాపులర్

కాస్టింగ్‌ కౌచ్‌తో మరింత పాపులర్

సినిమా అవకాశాలు సన్నగిల్లిన సమయంలోనే శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చింది. టాలీవుడ్‌లో అవకాశాలను దక్కించుకోవాలంటే దర్శక నిర్మాతలు చెప్పినట్లు చేయాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె.. ఎంతో మందిపై ఆరోపణలు కూడా చేసింది. అప్పుడే శ్రీరెడ్డికి మహిళా సంఘాలు, సామాజికవేత్తల నుంచి మద్దతు దక్కడంతో ఇది ఉద్యమం అయింది.

బట్టలు విప్పింది... దేశ వ్యాప్తంగా

బట్టలు విప్పింది... దేశ వ్యాప్తంగా

కాస్టింగ్ కౌచ్ ఉద్యమం గురించి శ్రీరెడ్డి చాలా కాలం పాటు పోరాటం చేసింది. ఇండస్ట్రీలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కోరింది. అందుకు తగ్గట్లుగా స్పందన దక్కకపోవడంతో హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్ ముందు శ్రీరెడ్డి అర్ధ నగ్న నిరసన చేపట్టింది. ఏకంగా బట్టలు విప్పేసి అక్కడే దర్నాకు దిగింది. దీంతో ఆమె దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా అయింది. ఆ తర్వాత కమిటీ ఏర్పాటైంది.

ఎవ్వరినీ వదిలి పెట్టకుండా పోస్ట్స్

ఎవ్వరినీ వదిలి పెట్టకుండా పోస్ట్స్


పోరాటం సాగిస్తోన్న సమయంలో ఎంతో మంది సినీ పెద్దలపై సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. ఇందుకోసం సోషల్ మీడియాతో పాటు న్యూస్ డిబెట్లను గట్టిగానే వాడుకుంది. ఇక, దీని తర్వాత కూడా ఇదే పంథాను ఫాలో అవుతోంది. ఇందులో భాగంగానే తరచూ టాలీవుడ్‌లోని పలువురు హీరోలు, హీరోయిన్లపై వివాదాస్పద పోస్టులు పెడుతూ విమర్శలను ఎదుర్కొంటోంది.

ఎప్పుడూ అందులోనే రచ్చ చేస్తూ

ఎప్పుడూ అందులోనే రచ్చ చేస్తూ


శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు నాలుగేళ్లుగా దీని ద్వారానే ఆమె తన వాణిని వినిపిస్తోంది. అదే సమయంలో ఎన్నో వివాదాల్లో భాగం అవుతోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ అందాలతోనూ కుర్రాళ్లకు వల వేస్తోంది. తరచూ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ రచ్చ చేస్తోంది. అలాగే బూతులతోనూ రెచ్చిపోతోంది.

హీరోపై శ్రీరెడ్డి ఊహించని కామెంట్స్

హీరోపై శ్రీరెడ్డి ఊహించని కామెంట్స్


శ్రీరెడ్డి తెలుగు రాష్ట్రాల్లో జరిగే అంశాలనే కాకుండా.. తమిళనాడులోని విషయాలపైనా తన గొంతును వినిపిస్తుంటుంది. ఇప్పటికే పలువురు హీరోలపై ఆరోపణలు చేయడంతో పాటు అక్కడి రాజకీయాలపై ఎన్నో పోస్టులను కూడా పెట్టింది. దీంతో అక్కడ కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా యంగ్ హీరో కమ్ ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌పై ఊహించని పోస్ట్ పెట్టింది.

ఏకంగా సీఎం జగన్‌ను తీసుకొచ్చి

ఏకంగా సీఎం జగన్‌ను తీసుకొచ్చి


ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే తరపున ఉదయనిధి స్టాలిన్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. దీనిని ఉద్దేశిస్తూ శ్రీరెడ్డి 'ఉదయనిధి స్టాలిన్ గారు మీకు శుభాకాంక్షలు. మీరు యంగ్ ఎమ్మెల్యే. మా వైఎస్ జగన్ గారిలా ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా. మేమంతా గర్వంగా ఉన్నా స్టాలిన్ సార్. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి' అంటూ రాసుకొచ్చిందీ బ్యూటీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X