ఇలా మాత్రం ఎవ్వరూ విష్ చేసి ఉండరు!.. పవన్ కళ్యాణ్‌కు శ్రీరెడ్డి స్పెషల్ విషెస్

పవన్ కళ్యాణ్-శ్రీ రెడ్డి మధ్య జరిగే కోల్డ్ వార్ అందరికీ తెలిసిందే. అయితే ఇంత వరకు పవన్ కళ్యాణ్ ఎన్నడూ కూడా శ్రీ రెడ్డి పేరు ఎత్తలేదు. కానీ శ్రీ రెడ్డి మాత్రం పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండా మాత్రం ఉండదు. సమయం సందర్భం లేకపోయినా సరే పవన్ కళ్యాణ్‌పై కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ అన్నా, మెగా ఫ్యామిలీ అన్నా శ్రీ రెడ్డి ఎంత కస్సుమంటుందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌ బర్త్ డేకు స్పెషల్ విషెస్ అందించింది.

అలా గొడవ మొదలు..

అలా గొడవ మొదలు..

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్, మీటూ అంటూ అప్పట్లో శ్రీ రెడ్డి ఉద్యమం ప్రారంభించింది. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో ఆర్జీవీ చెప్పాడని, పవన్ కళ్యాణ్‌ను దుర్భాషలాడింది. ఇక అక్కడి నుంచి మెగా ఫ్యాన్స్‌తో శ్రీ రెడ్డికి చెడింది. నిత్యం వీరి మధ్య ఏదో ఒక మాటల యుద్దం జరుగుతూనే ఉంటుంది.

ప్రతీ గొడవలో..

ప్రతీ గొడవలో..

పవన్ కళ్యాణ్‌ను రాజకీయంగా, సినిమాపరంగానూ విమర్శిస్తుంటుంది. ఇక ప్రత్యేకించి పూనమ్ కౌర్, పవన్ కళ్యాణ్ వ్యవహారంలో శ్రీ రెడ్డి చేసే కామెంట్స్ తెగ వైరల్ అవుతుంటాయి. ప్రతీసారి ఇలా పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసే శ్రీ రెడ్డి బర్త్ డే విషెస్ చెబుతుందని ఎవ్వరూ ఊహించరు.

సోషల్ మీడియాలో రచ్చ..

సోషల్ మీడియాలో రచ్చ..

నిన్న (సెప్టెంబర్ 2) పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ట్వీట్ల సునామీ మొదలైంది. టాలీవుడ్ సెలెబ్రిటీలందరూ పవన్ కళ్యాణ్‌కు విషెస్ చెప్పారు. ఇక సెలెబ్రిటీలందరి విషెస్ ఒకెత్తు అయితే శ్రీ రెడ్డి తెలిపిన శుభాకాంక్షలు మరో ఎత్తు.

Recommended Video

#Watch : Hero Vishal Explains How He Was Cured From Corona
 ఐ హేట్ యూ..

ఐ హేట్ యూ..

మామూలుగా ఎవరిపైనైనా కోపం ఉంటే.. బర్త్ డేకు విషెస్ చెప్పకుండా సైలెంట్‌గా ఉండిపోతారు. కానీ ఇలా శ్రీరెడ్డిలా చేయరు. ఐ హేట్ యూ బట్ హ్యాపీ బర్త్ డే పీకే అంటూ ఓ అడుగు ముందుకు వేసింది. ఇక శ్రీ రెడ్డి చెప్పిన ఈ విషెస్‌కు భిన్న రకాల స్పందనలు వస్తున్నాయి. కొందరు గ్రేట్ అని పొగుడుతుంటే.. పవన్ ఫ్యాన్స్ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X