twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్ నవనీత్ కౌర్‌పై శ్రీరెడ్డి సంచలన పోస్ట్: డ్రామాలు ఆడుతున్నారంటూ.. మోదీని లాగుతూ పోస్ట్

    |

    వివాదాస్పద తీరుతో చాలా కాలంగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది హాట్ బ్యూటీ శ్రీరెడ్డి. లోకల్ విషయాలతో పాటు జాతీయ స్థాయి అంశాలను కూడా వదలకుండా తలదూర్చే ఈమె.. ఎన్నో వివాదాల్లో చిక్కుకుంటూ వస్తోంది. ఇప్పటికే సినిమా, రాజకీయ రంగాలకు సంబంధించిన చాలా మందిపై విమర్శలు చేస్తూ వచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీపైనే పరోక్షంగా విమర్శలు చేసింది. దీనికి కారణం ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ నవనీత్ కౌర్‌ విషయంలో జరుగుతోన్న పరిణామాలే. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీకోసం!

    Recommended Video

    Sri reddy comments in support of mp Navneet Kaur | Oneindia Telugu

    చీర కట్టులో ఎద అందాలతో కవ్విస్తోన్న అందాల 'నిధి'

    అలా మొదలైన కెరీర్.. యాక్టింగ్ దూరం

    అలా మొదలైన కెరీర్.. యాక్టింగ్ దూరం

    నటి అవ్వాలన్న లక్ష్యంతో మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది శ్రీరెడ్డి. ఈ క్రమంలోనే ఓ ఛానెల్‌లో న్యూస్ ప్రజెంటర్‌గా పని చేసింది. కొంత గ్యాప్ తీసుకుని 'నేను నాన్న అబద్ధం' అనే మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత 'అరవింద్ 2', 'జిందగీ' తదితర సినిమాలు చేసింది. కానీ, ఇవేమీ ఆకు గుర్తింపును ఇవ్వలేదు. దీంతో యాక్టింగ్ కెరీర్‌కు పుల్‌స్టాప్ పెట్టాల్సి వచ్చింది.

    ఆ ఉద్యమంతో దేశ వ్యాప్తంగా పాపులార్

    ఆ ఉద్యమంతో దేశ వ్యాప్తంగా పాపులార్

    శ్రీరెడ్డి సినిమాలకు దూరం అవడానికి కాస్టింగ్ కౌచ్ ఉద్యమమే ప్రధానం కారణం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌లో ఛాన్స్‌లు కావాలంటే దర్శక నిర్మాతలు చెప్పినట్లు చేయాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారాన్నే రేపాయి. అదే సమయంలో సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలకు కారణం అయ్యాయి. ఇక, ఈ క్రమంలోనే ఆమె నగ్న నిరసన చేయడంతో పాపులర్ అయిపోయింది.

     ఏమీ వదలకుండా స్పందిస్తోన్న బ్యూటీ

    ఏమీ వదలకుండా స్పందిస్తోన్న బ్యూటీ

    సినిమా నటిగా ఆ పరిశ్రమలోని ఎన్నో అంశాలపై సంచలన ఆరోపణలు చేసి హాట్ టాపిక్ అయిపోయింది శ్రీరెడ్డి. అదే సమయంలో రాజకీయాలపైనా బాగానే స్పందిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మంది నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేసింది. కొందరు నాయకులు అసభ్యంగా ప్రవర్తించారంటూ అప్పట్లో వ్యాఖ్యలు చేసి రాజకీయ రంగంలోనూ ప్రకంపనలు రేపింది.

     ఇప్పుడు రాజకీయాలపై ఫోకస్ చేస్తోంది

    ఇప్పుడు రాజకీయాలపై ఫోకస్ చేస్తోంది

    ఇక, ఈ మధ్య శ్రీరెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోని ఓ పార్టీకి నేరుగానే మద్దతు తెలుపుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల నర్సాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణంరాజుపై ఎన్నో విమర్శలు చేసింది. అంతేకాదు, ఆయనపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేసింది. ఆయన మాత్రమే కాదు.. మాజీ ముఖ్యమంత్రి.. ఇతర పార్టీల నాయకులపైనా అసభ్యకరమైన వ్యాఖ్యలతో పోస్టులు పెడుతోందామె.

     హీరోయిన్... ఎంపీ నవనీత్ కౌర్‌పై పోస్టు

    హీరోయిన్... ఎంపీ నవనీత్ కౌర్‌పై పోస్టు

    ఒకప్పటి తెలుగు హీరోయిన్ నవనీత్ కౌర్ 2019 ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆమె తన గొంతును వినిపిస్తూ దేశ వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. మరీ ముఖ్యంగా ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆమె క్యాస్ట్ సర్టిఫికెట్‌ను రద్దు చేసింది. దీనిపై శ్రీరెడ్డి తాజాగా స్పందించింది.

    డ్రామాలు ఆడుతున్నారంటూ కామెంట్స్

    డ్రామాలు ఆడుతున్నారంటూ కామెంట్స్

    నవనీత్ కౌర్ ఎదుర్కొంటోన్న కుల వివాదంపై శ్రీరెడ్డి స్పందిస్తూ.. 'నవనీత్ కౌర్ ధైర్యవంతురాలు.. ఎంతో ప్రతిభావంతురాలు.. మంచి మనస్థత్వం కలిగిన గొప్ప వక్త (స్పీకర్). అలాంటి డైనమిక్ పార్లమెంట్ సభ్యురాలి పట్ల ఇప్పుడు డ్రామా జరుపుతున్నారు. ఆమె కులంతో కొందరు రాజకీయాలు చేస్తున్నారు' అంటూ పోస్టు చేసింది. తద్వారా నవనీత్‌కు తన మద్దతును తెలియజేసిందామె.

    ప్రధాని మోదీపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

    ప్రధాని మోదీపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

    నవనీత్ కౌర్‌కు మద్దతు తెలుపుతున్న సమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీని పరోక్షంగా విమర్శిస్తూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. 'ఒక చదువులేని చాయ్‌వాలా దేశానికి ప్రధాని కావొచ్చు.. చదువుకున్న నవనీత్ కౌర్ ఎంపీ కాకూడదు. దీనికి కారణం కులం. వావ్ ఇండియా' అంటూ విమర్శించింది. ఈ పోస్టుకు ఒక వర్గం నుంచి మద్దతు.. మరో వర్గం నుంచి ట్రోల్స్ వస్తున్నాయి.

    English summary
    Tollywood Actress Sri Reddy Now Support MP Navneet Kaur. Then She Sensational Comments on PM Narendra Modi in Her Facebook Account.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X