మహేష్ ‘భరత్ అనే నేను’ ప్రమోషన్లో కేటీఆర్..... శ్రీరెడ్డి సంచలన పోస్ట్!

By Bojja Kumar

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన చిత్రం 'భరత్ అనే నేను'. ప్రజా సమస్యలు, పాలనా పరమైన, రాజకీయ అంశాలతో తెరకెక్కిన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్....సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో ఇటీవల పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'భరత్ అనే నేను' సినిమా చూసిన తర్వాత చిత్ర యూనిట్ ను మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. సినిమా చాలా బాగా ఉందని కితాబిచ్చారు. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో కేటీఆర్ పాల్గొనడంపై నటి శ్రీరెడ్డి రియాక్ట్ అయ్యారు. భరత్ అనే నేను సినిమా ప్రమోషన్లకు వెళ్లిన కేటీఆర్.... సమస్యలతో పోరాడుతున్న సినిమా రంగానికి చెందిన మహిళల గురించి పట్టించుకోవడం లేదని ప్రశ్నించే ప్రయత్నం చేశారు.

సర్ మమ్మల్ని కాస్త పట్టించుకోండి

సర్ మమ్మల్ని కాస్త పట్టించుకోండి

సర్, కేటీఆర్ గారూ... తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అంశంపై మేము పోరాడుతున్నాం. మాక న్యాయం రిగేలా చూడండి సార్. సినిమా రంగానికి చెందిన పెద్ద ఫ్యామిలీలు ఈ సమస్యను పట్టించుకోడం లేదని.... శ్రీరెడ్డి కేటీఆర్‌కు విన్నవించారు.

ఆ నిర్ణయ సంతృప్తి కరంగా లేదు

ఆ నిర్ణయ సంతృప్తి కరంగా లేదు

కాస్టింగ్ కౌచ్, ఇతర సమస్యలపై ఇండస్ట్రీకి చెందిన కొందరు పెద్దలు తీసుకున్న నిర్ణయంపై మేము సంతోషంగా లేము. తెలుగు వారికి అవకాశాలు రావడం లేదు. మేము మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం. దయచేసి రెస్పాండ్ అవ్వండి... అని శ్రీరెడ్డి ట్వీట్ చేశారు.

మహేష్ బాబు సినిమానే కాదు...మమ్మల్ని కూడా పట్టించుకోండి

మహేష్ బాబు సినిమానే కాదు...మమ్మల్ని కూడా పట్టించుకోండి

మహేష్ బాబు సినిమా 'భరత్ అనే నేను' ప్రమోషన్లలో కేటీఆర్‌ పాల్గొన్నారు. కానీ సినీ పరిశ్రమలో మహిళల సమస్యలపై స్పందించేందుకు సమయం ఎందుకు కేటాయించడం లేదు అని ఈ సందర్భంగా శ్రీరెడ్డి ప్రశ్నించింది.

దయచేసి మా సమస్య పరిష్కరించండి

దయచేసి మా సమస్య పరిష్కరించండి

సర్... కేటీఆర్‌ గారు, మీ పీఏ మొబైల్‌కి చాలా సార్లు మెస్సేజ్‌ చేశాను, కానీ అటు వైపు నుండి స్పందన రాలేదు, దయచేసి తమ సమస్యలకు పరిష్కారం చూపించాలని కోరుకుంటున్నాను అని శ్రీరెడ్డి కోరారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X