నయనతారకు, దర్శకుడికి మధ్య ఎఫైర్... వీరి ‘సం’బంధంపై శ్రీరెడ్డి హాట్ కామెంట్!
సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నయనతార కెరీర్ పరంగా వరుస అవకాశాలతో దూసుకెళుతున్నారు. దీంతో పాటు ఆమె చుట్టూ వివాదాలూ ఎక్కువే. ముఖ్యంగా నయనతార ప్రేమ వ్యవహారాలు తరచూ మీడియాలో చర్చనీయాంశం అవూతూనే ఉంటాయి.
గతంలో శింబుతో ప్రేమాయణం సాగించిన నయన అతడితో విడిపోయిన తర్వాత ప్రభుదేవాపై మనసు పారేసుకుంది. అప్పట్లో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ చివరి నిమిషంలో విడిపోయారు. ప్రస్తుతం నయనతార... తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో లవ్ రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే.

రాధారవి కామెంట్లపై రియాక్ట్ అయిన శ్రీరెడ్డి
నయనతార గురించి తరచూ మీడియాలో వస్తున్న ఈ వార్తలను ఉద్దేశించో... లేక మరేదైనా కారణమో తెలియదు కానీ తమిళ సీనియర్ నటుడు రాధారవి ఇటీవల ఓ మూవీ ఆడియో వేడుకలో నయనతారను కించపరిచే విధంగా వ్యాఖ్యానించారు. రాధారవి నయనతారను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నటి శ్రీరెడ్డి రియాక్ట్ అయ్యారు.

నయనతార దెయ్యమే.. కానీ
‘‘అవును రాధారవి... మీరు అన్నట్లు నయనతార డెవిల్...కానీ ఆమె కష్టపడి పని చేయడంలో డెవిల్.. అందంలో దేవత.. నయనతార పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నాను.'' అంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది శ్రీరెడ్డి. కేవలం నయనతారకు మాత్రమే కాదు... పెళ్లి చేసుకోకండా రిలేషన్లో ఉన్న మలైకా అరోరా-అర్జున్ కపూర్ లాంటి వారికి కూడా శ్రీరెడ్డి తన మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు.

ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో షేర్ చేసిన శ్రీరెడ్డి
ఈ సందర్భంగా శ్రీరెడ్డి.... నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్ కలిసి ఉన్న ఫోటోను ఫేస్ బుక్ పేజీ ద్వరా పంచుకున్నారు. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. వీరి బంధాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు అనే ఒక మెసేజ్ పాస్ చేసే ప్రయత్నం చేశారు.

నయనతార-విఘ్నేష్ శివన్
‘నేనూ రౌడీనే' సినిమాలో నటించిన నయనతార... ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన విఘ్నేష్ శివన్‌కు మరింత క్లోజ్ అయ్యారు. అప్పటి నుంచి వీరి లవ్ రిలేషన్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్లు కోలీవుడ్ టాక్. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











