బాల్స్ పనిచేయకుండా చేస్తా.... శ్రీరెడ్డి వార్నింగ్ ఎవరికి?
Recommended Video

జబర్దస్త్ షోలో హైపర్ ఆది తనపై పరోక్షంగా పంచ్‌లు వేస్తున్నాడంటూ శ్రీరెడ్డి ఇటీవల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇంకోసారి తన జోలికి వచ్చినా, మహిళలను కించ పరిచే విధంగా ఏమైనా కామెంట్స్ చేసినా చెప్పుతో కొడతానంటూ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. తాజాగా శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఈ సారి ఎవరి పేరు ప్రస్తావించక పోయినా... మహిళలను కించ పరిస్తే సహించేది లేదంటూ తీవ్రమైన పదజాలంతో హెచ్చరికలు జారీ చేసింది.

ఆడవారిని కించ పరిస్తే ఊరుకోను
కామెడీ షోల మీద లక్షలు సంపాదించే వారికి నా మనవి ఒకటే. ఆడవారిని కించపరుస్తూ ఏ కమెడియన్ అయినా, యాక్టర్ అయినా, మేల్ యాంకర్ అయినా పిచ్చి పిచ్చికామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదు అంటూ శ్రీరెడ్డి హెచ్చరించింది.
బాల్స్ పని చేయకుండా చేస్తా జాగ్రత్త
ఇకపై ఎవరైనా ఆడవారిని కించ పరుస్తూ కామెంట్స్ చేస్తే బాడీ పచ్చడి పచ్చడి చేసి, దంతాలు ఊడగొట్టి.... బాల్స్ పని చేయకుండా పీకీ జేబులో పెట్టి జాగ్రత్తగా మీ ఇంట్లో దింపి వెళతాం. సెట్లో దొరక్కపోతే మీ ఇంటికి వచ్చి పచ్చడి చేస్తాం జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చింది.
పవన్ ఫ్యాన్స్ ఇలా చేయడం దారుణం
పవన్ కళ్యాణ్ ఫోటోలతో శ్రీరెడ్డి మరో ఫోస్టు చేశారు. కొందరు పవన్ అభిమానులు పిచ్చి పనులు చేస్తున్నారు. ఎవరివో ఫోటోలు దొంగిలించి పవన్ కళ్యాన్ మీద ప్రజల్లో సింపథీ పెరిగేలా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అని పేర్కొన్నారు.
ఈ పోస్టు ఆ హీరో గురించేనా?
అమోలి తెలుగు ఎపిసోడ్‌కు నువ్వు వాయిస్ ఓవర్ ఇవ్వడమేంటో? ఉమెన్ గురించి ఉమనైజర్ మాట్లాడటం హాస్యాస్పదం అంటూ శ్రీరెడ్డి మరో పోస్టులో కామెంట్ చేశారు. ఈ షార్ట్ ఫిల్మ్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చింది ఎవరనేది అందరికీ తెలిసిందే.


Click it and Unblock the Notifications











