For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sri Reddy: పవన్ కల్యాణ్ భార్యాపిల్లలతో నీకేం పనిరా.. వైసీపీ నేతకు శ్రీ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

  |

  తెలుగు ప్రేక్షకులకు శ్రీ రెడ్డి సుపరిచితమే. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడటంతో వెలుగులోకి వచ్చిన శ్రీ రెడ్డి పలు అంశాలపై వ్యాఖ్యలు చేస్తూ వివాదస్పదమైంది. ఎక్కువగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ వైసీపీకి సపోర్టింగ్ గా మాట్లాడే శ్రీ రెడ్డి తాజగా ఆయన భార్యాపిల్లలకు మద్దతుగా నిలిచింది. ఇటీవల వైసీపీ నేతలపై విరుచుకుపడిన పవన్ కల్యాణ్ కు చెప్పు చూపిస్తూ మరి బూతుల వర్షం కురుపించింది. అయితే తాజాగా మాత్రం పవన్ కల్యాణ్ భార్యా పిల్లలపై కామెంట్స్ చేసిన ఓ వైసీపీ నేతపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది శ్రీ రెడ్డి. ఆ వివరాల్లోకి వెళితే..

  బాటా చెప్పు చూపిస్తూ..

  బాటా చెప్పు చూపిస్తూ..


  ఇటీవల వైజాగ్ సంఘటనలపై మంగళూరులో జరిగిన జనసేన పార్టీ మీటింగ్ లో పవన్ కల్యాణ్ కోపంతో ఊగిపోయిన విషయం తెలిసిందే. చెప్పు చూపిస్తూ కొడకల్లారా, సన్నాసుల్లారా అంటూ ఉగ్రరూపం చూపించాడు పవన్ కల్యాణ్. ఈ వ్యాఖ్యలపై మండిపడిన వివాదస్పద నటి శ్రీ రెడ్డి.. అదే తరహాలో బాటా చెప్పు చూపిస్తూ పవన్ పై తిట్ల దండకం ఎత్తుకుంది. జగనన్నే పవన్ కల్యాణ్ ను కాపాడాలి అంటూ రెచ్చిపోయింది. అయితే ఇప్పుుడు తాజాగా అనూహ్యంగా వైసీపీ పార్టీ నాయకుడు బోరుగడ్డ అనిల్ కుమార్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది శ్రీ రెడ్డి.

  పిల్లల జోలికొస్తే తొక్క తీస్తా..

  పిల్లల జోలికొస్తే తొక్క తీస్తా..

  వైసీపీ పార్టీ మద్దతుదారుడైన బోరుగడ్డ అనిల్ కుమార్.. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని, ఆయన భార్యాపిల్లలను తీవ్రంగా దూషిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. పవన్ కల్యాణ్ ను బండ బూతులు తిడుతూ.. ఆయన భార్యా పిల్లలను తనకు అప్పగించాలని నోరు పారేసుకున్నాడు. ఈ వీడియోకు కౌంటర్ గా శ్రీ రెడ్డి తన స్టైల్ లో మండిపడింది. నువ్ ఏ పార్టీలో ఉన్నా సరే.. ఆడవాళ్లు, పిల్లల జోలికొస్తే తొక్క తీస్తా నా కొడకా అంటూ అనీల్ కుమార్ ను హెచ్చరిస్తూ సోషల్ మీడియా వేదికగా వీడియో వదిలింది.

   పవన్ కల్యాణ్ ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం ఊరుకోను..

  పవన్ కల్యాణ్ ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం ఊరుకోను..

  ''జగన్ అన్నని మనమంతా నమ్మి.. వైఎస్సార్ పై అభిమానంతో ఆ పార్టీని నెత్తిన పెట్టుకున్నాం. కానీ వైసీపీ పార్టీ పేరు చెప్పి కొంతమంది నాయకులు దందాలకు పాల్పడుతున్నారు. నేను ఏ పార్టీలో ఉన్నా మహిళల్ని కించపరిస్తే మాత్రం ఊరుకోను. వైసీపీ పార్టీలో ఉన్న ఒక వెధవ.. జనసేన పార్టీ నాయకుడిని కించపరుస్తూ మాట్లాడాడు. అతని గురించి మాట్లాడు. అది అతని పర్సనల్. తప్పులేదు. ప్రతివిమర్శలు చేసినా తప్పు లేదు. కానీ పవన్ కల్యాణ్ ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ఊరుకోను.

  పెళ్లాం పిల్లలతో నీకేం పనిరా..

  అతను (పవన్ కల్యాణ్) తప్పు చేస్తే అతన్ని తిట్టాలి. కానీ, పవన్ కల్యాణఅ మాజీ భార్యని, ఆయన పిల్లలను వైసీపీ పార్టీలో ఉన్న అనీల్ కుమార్ అనే దరిద్రుడు ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. ఇలాంటి వెధవల వల్లే వైసీపీ పార్టీకి చెడ్డపేరు వస్తుంది. ఇది జగన్ అన్నకు చేరాలి. ఆడపిల్లలతో, పెళ్లాం పిల్లలతో నీకేం పనిరా. మూడు పెళ్లిల్లు చేసుకున్నోడు వాడు.. దమ్ముంటే వాడిని తిట్టు. కానీ వాడి పిల్లలు ఏం చేశారు. ఈ అనీల్ గాడి కుండ బద్దలు కొట్టాలి. ఇలాంటి వెధవలను జగన్ అన్న ఎంకరేజ్ చేయడు. అసలు నీకు వైసీపీకి సంబంధం ఏంట్రా వెధవా. చంపుతా.. నరుకుతా అని బెదిరిస్తున్నాడు వీడు. వీడిపై పోలీసులు యాక్షన్ తీసుకోవాలి'' అని ఫేస్ బుక్ వీడియోలో చెప్పుకొచ్చింది శ్రీ రెడ్డి.

  English summary
  Tollywood Controversy Actress Sri Reddy Strong Warning To YCP Leader Borugadda Anil Kumar Over Abusing Janasena Founder Pawan Kalyan Wife And Children
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X