వైఎస్ జగన్ పేరు తీసిన శ్రీ రెడ్డి.. హీరోకి స్ట్రాంగ్ వార్నింగ్

టాలీవుడ్‌లో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, నమ్మించి మోసం చేస్తున్నారని సినీ పెద్దలపై సంచలన ఆరోపణలు చేస్తున్న శ్రీ రెడ్డి.. ఈ సారి ఓ నటుడికి ఏకంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అది కూడా ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోలి తీస్తూ.. ఇంతకు శ్రీ రెడ్డి వార్నింగ్ ఎందుకిచ్చింది? ఆ నటుడు ఎవరు? వివరాల్లోకి పోతే..

రవిప్రకాష్‌, శివాజీలపై కేసు నమోదు.. విచారణ

రవిప్రకాష్‌, శివాజీలపై కేసు నమోదు.. విచారణ

టీవీ 9 వివాదం విషయమై అలంద మీడియా సంస్థ పోలీస్ కేసు ఫైల్ చేసింది. ఈ కేసులో ఓ ముద్దాయిగా గత కొంతకాలంగా విచారణ ఎదుర్కొంటున్నాడు నటుడు శివాజీ. టీవీ 9 సిఈఓ రవిప్రకాష్ తో పాటు నటుడు శివాజీ పై కేసు పెట్టింది టీవీ 9 కొత్త యాజమాన్యం అలంద మీడియా సంస్థ. టీవీ 9 వాటాల విషయంలో వీరిద్దరూ ఫోర్జరీ సంతకాలు చేశారని అలంద మీడియా ఆరోపించింది.

ముఖ్యమంత్రి జగన్ పై శివాజీ ఫైర్

ముఖ్యమంత్రి జగన్ పై శివాజీ ఫైర్

ఈ మేరకు విచారణకు రావాలంటూ శివాజీకి పలుమార్లు పోలీస్ శాఖ శివాజీకి ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆయన విచారణకు హాజరు కాకపోగా, సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును కోరడం జరిగింది. దీంతో కొద్ది రోజులుగా సదరు కేసు విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే మీడియా ముందుకొచ్చిన శివాజీ.. ముఖ్యమంత్రి జగన్ పై, తన పోలీస్ కేసు విషయంలో ఇబ్బంది పెడుతున్న వారిపై ఫైర్ అయ్యాడు.

జగన్ కారణంగా ఓ కులం

జగన్ కారణంగా ఓ కులం

తాను బీజేపీలో చేరుతున్నట్లుగా పరోక్షంగా హింట్స్ ఇచ్చిన శివాజీ.. జగన్‌ని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యమంత్రి పదవి ప్రజల కోసమని మరచి జగన్ రాచరిక పాలన చేస్తున్నారని ఆరోపించాడు శివాజీ. తనకు రక్షణ కల్పించాలని జగన్ కి మెయిల్ పెట్టినా ఆయన స్పందించలేదని అన్నాడు శివాజీ. జగన్ కారణంగా ఓ కులం అభద్రతా భావానికి లోను కావాల్సిన పరిస్థితి చోటుచేసుకుందని ధ్వజమెత్తాడు.

ఎంటరైన శ్రీ రెడ్డి

శివాజీ చేస్తున్న ఈ కామెంట్స్ చూసి సంచలన తార శ్రీ రెడ్డి ఎంటరైంది. ముందు నుంచే జగన్ కి సపోర్ట్ చేస్తూ వస్తున్న ఆమె.. శివాజీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టింది. శివాజీ పై ఆమె చేసిన కామెంట్స్ సినీ, రాజకీయ రంగాల్లో సంచలనంగా మారాయి.

శివాజీ.. మీ నమూనా లేకుండా చేస్తాం జాగ్రత్త

శివాజీ.. మీ నమూనా లేకుండా చేస్తాం జాగ్రత్త

''హీరో శివాజీ గారు ప్రశ్నించండి తప్పు లేదు.. జగన్ గారి గురించి అతిగా మాట్లాడితే మీ నమూనాని ప్రజలు మర్చిపోయేలా చేస్తాం'' అని తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి. ఆమె చేసిన ఈ పోస్ట్ రాజకీయంగా దుమారం రేపుతోంది. ప్రస్తుతం శివాజీ పోలీస్ విచారణలో భాగంగా ఖాకీల అదుపులో ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X