వైన్ షాపుల ముందు అమ్మాయిల వీడియోలు తీస్తే.. అది పగులకొట్టండి.. శ్రీరెడ్డి ఫైర్

లాక్‌డౌన్‌లో మద్య అమ్మకాలకు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మందుబాబులు రోడ్లపైకి వచ్చి బారులు తీరి మందు బాటిళ్లు కొనుక్కోవడమనే విషయం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. అయితే మహిళలకు కూడా క్యూలైన్లలో నించోని మద్యం కొనుగోలు చేస్తూ కనిపించారు. అలాంటి సందర్భాల్లో మహిళలను ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై శ్రీరెడ్డి స్పందించారు. మహిళలకు ఆ స్వేచ్ఛ లేదా? మండిపడ్డారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో శ్రీరెడ్డి ఏమన్నారంటే..

Recommended Video

Watch Sri Reddy warns Shooting Women videos at Wine shops
 మహిళలను వీడియో తీయడంపై

మహిళలను వీడియో తీయడంపై

వైన్ షాపుల నుంచి మందు కొంటున్నారు. బెంగళూరులో అమ్మాయిలు మందుకొంటున్నారంటూ టిక్ టాక్, ఇతర సోషల్ మీడియా యాప్‌లో వీడియోలు తీసిపెడుతున్నారు. వైన్ షాపు ముందు అమ్మాయి కనిపిస్తే చాలూ వీడియో తీయడం సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతున్నది. అమ్మాయిలు మందు కొనకూడదా? ఇంతకు మీ గోల ఏంటిరా అంటూ శ్రీరెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

ఆడవాళ్లు మద్యం సేవించొద్దా?

ఆడవాళ్లు మద్యం సేవించొద్దా?

మగాళ్లు మీరు మందు కొంటున్నారు. మీరు మందు తాగుతున్నారు. మీకు కష్టాలు ఉన్నట్టే వాళ్లకు కష్టాలు ఉన్నాయి. ఆడవాళ్లు మందు కొనకూడదా? మందు తాగకూడదా? వారికి కష్టాలు ఉంటాయనే విషయం తెలుసా అంటూ శ్రీరెడ్డి ఘాటుగా స్పందించారు. దేశంలో ప్రతీ ఒక్కరికి సమాన హక్కులు ఉన్నాయి. వారి ఇష్ట ప్రకారం మగాళ్లైనా, ఆడాళ్లైనా తేడా లేకుండా హద్దు మీరకుండా హక్కులను వినియోగించుకోవాల్సిందే అంటూ శ్రీరెడ్డి స్పందించారు.

పురాణాల్లో దేవతలు కూడా

పురాణాల్లో దేవతలు కూడా

పురాణాల్లో దేవతలు కూడా మదుపానం సేవించే వారనే విషయం తెలుసుకదా.. పేదలు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడి వరకు కష్టపడి అలసిపోతారు. వారు తమ కష్టాన్ని మరిచిపోయేందకు కల్లు తాగుతారు. అది తప్పా? మీకు ఎన్నో కష్టాలు ఉన్నట్టే మహిళలకు సమస్యలు ఉండావా? వాటిని మరిచిపోయేందుకు తాగకూడదా? మీరంటే ఏసీ గదుల్లో బతికే వారికి మీకేం తెలుసు అని శ్రీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 వీడియో కెమెరాలతో షూట్ చేస్తే

వీడియో కెమెరాలతో షూట్ చేస్తే

వైన్ షాపుల వద్ద మహిళలు ఉంటే వీడియో కెమెరాలతో షూట్ చేయడం తప్పు. అలాంటి వారు కనిపిస్తే ఇరగ తన్నండి. మద్యం షాపుల వద్ద అమ్మాయిలు నిలబడితే వీడియోలు తీయడం ఆపండి. ఆల్కాహాల్ శరీరానికి మంచిది తెలుసా? శారీరక ఇబ్బందులను దూరం చేయడానికి గర్బిణీలకు విస్కీ, బ్రాందీ తాగిస్తారు అంటూ శ్రీరెడ్డి వెల్లడించారు.

ఆంక్షలు పెట్టొద్దని

ఆంక్షలు పెట్టొద్దని

మహిళలు తాగొద్దని ఆంక్షలు పెట్టకండి. వారిని వీడియోలు తీసి కించపరచకండి. మద్యం తాగితే వెంటనే చచ్చిపోరు. హద్దు మీరి తాగితే లివర్ చెడిపోతుంది. కొద్దిగా తాగితే ఆరోగ్యం చెడిపోదు. కాబట్టి మాకు ఆ ఫ్రీడమ్ ఇవ్వండి. అంతేగానీ చెత్త పనులు చేస్తే గూ. పగిలిపోద్ది అంటూ శ్రీరెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X